For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రకాల వ్యాధుల నివారణకోసం: ఆహారంతో చికిత్స

By Super
|

సాధారణంగా మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం మన శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా ఆరోజంతా మన శరీరంలోని అనేక జీవక్రియలు సక్రమంగా పనిచేయాలన్నా, చురుకుగా ఉండాలన్నా, మన శరీరానికి తగినంత ఎనర్జీని అందివ్వగల శక్తి సామర్థ్యాలు, పోషకవిలువలు మన రెగ్యులర్ గా తీసుకొనో పౌష్టకాహారంతోనే పొందుతాము. అంతే కాదు, మన శరీరానికి తగినంత శక్తిని, ఎనర్జీని అందివ్వడంతో పాటు అనేక ప్రమాధకర జబ్బులను హై బ్లడ్ ప్రెసర్, ఆస్తమా, స్కిన్ ఇన్ ఫెక్షన్ మరియు బ్లాడర్ ఇన్ ఫెక్షన్ వంటివి నివారిస్తాయి.

అందుకే ఒక ప్రతి రోజూ ఒక బ్యాలెన్స్ డైట్ ను తీసుకోవడం ఆరోగ్యానకి చాలా అవసరం . అయితే మనం రెగ్యులర్ గా తీసుకొనే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు పూర్తి పోషకాలు, న్యూట్రీషియన్స్ కలిగినవైతే ఇటువంటి అనారోగ్య సమస్యలను, మరియు వివిధ రకాల ఇన్ఫక్షన్స్ ను మరియు వాటి లక్షణాలను నివారిస్తుంది . ఇలాంటి అనారోగ్యాలు మరియు వ్యాధికారక లక్షనాలను నివారించే ఆహారాలు కొన్ని ప్రత్యేకమైన ఈ క్రింది విధంగా ఉన్నాయి...

అవొకాడో

అవొకాడో

ఈ నలుపు ఆకుపచ్చ ఆహారంలో గ్లూటాతియోన్ గా పిలవబడే ఒక అమైనో ఆమ్లం ఉంటుంది. అనేక గుండె వ్యాదులు మరియు క్యాన్సర్ రోగాలకు వ్యతిరేకంగా పోరాడటానికి,మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా దీనిలో విటమిన్ E సమృద్ధిగా ఉండుటవల్ల మీ చర్మం కోసం ఒక మంచి యాంటిఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అవకాడొలు మోనో సాచురేటేడ్ కొవ్వును కూడా కలిగి ఉంటాయి.

పైనాపిల్

పైనాపిల్

పైనాపిల్ లో బ్రొమిలిన్ అనే ఎంజైమ్ కలదు. ఇది చిన్న ప్రేగులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా నివారిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఒక ఉత్తమ నేచురల్ యాంటీబయోటిక్ ఫుడ్.

బ్రొకోలీ

బ్రొకోలీ

ఈ ఆకుపచ్చ ఆహారంలో విటమిన్ K మరియు విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ అవసరమైన రెండు పోషకాలు మీ ఎముకలు మరియు దంతాల బలోపేతం చేయడానికి సహాయం చేస్తాయి. అంతేకాక వివిధ రకాల క్యాన్సర్లను తగ్గించటానికి సహాయపడుతుంది.

బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్

ఎరుపు నీలం వర్ణంలో ఉన్న ఈ పండులో అనామ్లజనకాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంది. బ్లూ బెర్రీలు రెగ్యులర్ తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి క్షీణతను నివారించడం ద్వారా మీ మెదడు ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైనదిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది స్థూలకాయంను కూడా నిరోధించడంలో సహాయపడుతుంది. రక్తపోటు ప్రమాదం తగ్గించడం మరియు ధమని గట్టిపడుటను నిరోదిస్తుంది.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

ఉల్లిపాయల్లో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక మంచి యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయలను మీ డైలి డైట్ లో చేర్చుకోవడం ద్వారా, అన్ని రకాలా స్టొమక్ ఇన్ఫెక్షన్స్ ను దూరంగా ఉంచుతుంది.ప్రధానంగా ఉల్లిపాయల్లో క్విర్సిటైన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, ఇది ఇన్ఫ్లమేషన్ కు కారణం అయ్యే వాటితో పోరాడుతుంది.

సెలరీ

సెలరీ

స్టొమక్ ఇన్ఫెక్షన్ ఉన్న వారు మీ రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోవల్సి మరో రాఫుడ్ సెలరీ. మీ శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఈ సెలరీ.

పసుపు

పసుపు

మీ వంటగదిలోని మరో వస్తువు పసుపు . ఈ పసుపు క్రానిక్ పెయిన్ (దీర్ఘకాలిక నొప్పులను)నివారిస్తుంది . పసుపులో కుకుమిన్, యాంటీఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండి, పెయిన్ తో పోరాడుతాయి. ఇంకా పసుపు కణజాలాల డిట్రాక్షన్ నుండి జాయింట్ ఇన్ఫ్లమేషన్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే నరాలు బాగా పనిచేసుందుకు సహాయపడుతుంది. స్ట్రోక్ కు గురియైన వారు లేదా వృద్యాప్యంలో ఉన్నవారు, తప్పనిసరిగా వారి రెగ్యులర్ డైట్ లో పసుపును జోడించాలి. టర్మెరిక్ ఒక నేచురల్ యాంటీబయోటిక్. స్ట్రోక్ గురిచేసే అనేక ఇన్ఫెక్షన్స్ కు చికిత్సను అందిస్తుంది.

క్యాబేజ్

క్యాబేజ్

ఒక ఉత్తమ యాంటీబయోటిక్ ఫుడ్ ఇది. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ చల్లని లేదా వేడి ఏదైనా సరే మీరు బరువు తగ్గడానికి ఉపయోగపడే వాటిలో ఒక టాప్ బెవరేజ్. ఇది చాలా ఆరోగ్యకరమైన బెవరేజ్ ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది మరియు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది.హార్ట్ రేటు పెంచుతుంది.కొన్ని పరిశోధన ద్వారా, క్యాన్సర్ నివారించడానికి మరియు శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా పనిచేయడానికి గ్రీన్ టీ చాలా సహాయపడుతుందని కనుగొనబడింది.పొట్టలోని పెద్ద ప్రేగులోని చెడు బ్యాక్టీరియాను ఎదుర్కొనే మంచి బ్యాక్టీరియా గ్రీన్ టీలో ఉన్నాయి.

కేయాన్ పెప్పర్

కేయాన్ పెప్పర్

కేయాన్ పెప్పర్ తీసుకోవడం ద్వారా ఫ్యాట్ మరియు క్యాలరీలను బర్న్ చేస్తూ మీ జీవక్రియలను వేగవంతం చేస్తుంది . కేయాన్ పెప్పర్ లో ఉండే క్యాప్ససిన్ కంటెంట్ శరీరంలో వేడిని పెంచి క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి, కేయాన్ పెప్పర్ ను మీరు అలాగే పచ్చిగా మరియు ఉడికించి , లేదా అలాగే డ్రై తీసుకోవచ్చు.

అరటిపండ్లు

అరటిపండ్లు

శక్తిని వెంటనే అందించే సామర్థ్యం దీని సొంతం. పొటాషియమ్‌, విటమిన్‌ సి, బి కాంప్లెక్స్‌ కూడా ఉన్నాయి. మలబద్ధకం ఉన్న వాళ్ళు రోజూ రాత్రి రెండు అరటిపళ్ళు తింటే విరేచనం సాఫీగా అవుతుంది. పిల్లలకు బాగా మెత్తగా పండిన పండు మేలు చేస్తుంది. త్వరగా అనారోగ్యం నుండి కోలుకుంటారు.

చమోమెలీ

చమోమెలీ

ఎన్నో ఔషద గుణాలు కలిగిన చామంతి పువ్వుకు పుట్టినిల్లు మన ఆసియా ఖండమేనట. తెలుగువారికి ఈ పువ్వు ‘చామంతి'గా పరిచయం. చామంతి ఆకులను జలుబు వంటి వ్యాధుల నివారణకు వినియోగిస్తూ వుంటారు. చామంతి పువ్వు రేకులతో చామంతి టీ తయారు చేస్తారు. ఇంకా రకరాకాల ఔషదాల్లో చామంతిని విరివిగా వినియోగిస్తున్నారు.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మపండ్లు మంచి ఉపశాంతి నిచ్చే సింధూర ఎరుపు రంగు కలిగి ఉంటాయి. ఇవి మీ మెదడు ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉంచడానికి సహాయపడతాయి. దీనిలో మంచి పరిమాణంలో ఫైబర్ మరియు అనామ్లజనకాలు ఉంటాయి. ఒక ఆరోగ్యకరమైన మెదడు అంటే ఆరోగ్యంగా మరియు ఒత్తిడి నుండి ఉపసమనం కలిగిస్తాయని అర్థం.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వినెగార్ లో ఉన్న ఎసిటిక్ యాసిడ్, పిండిపదార్థాల జీర్ణాక్రియ వేగాన్ని తగ్గిస్తుంది, ఫలితంగా రక్తప్రవాహంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది.

సాల్మన్

సాల్మన్

సీఫుడ్స్ లో ది బెస్ట్ ఫుడ్ సాల్మన్ ఫిష్ . ఇందులో ఒమేగా ఫ్యాటీ 3యాసిడ్స్ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఇది నొప్పిని నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.క్రానిక్ పెయిన్ కు మరియు విటమిన్ డి లోపానికి మద్య సంబంధం ఉన్నట్లు కనుగొనపబడింది. కాబట్టి సాల్మన్ ను బేక్ చేసి, గ్రిల్ చేసి లేదా రోస్ట్ చేసి తీసుకోవచ్చు.

తులసి

తులసి

తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. ఇంటి పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని పెద్దలు చెబుతారు.ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. దీంట్లో ఉండే ఔషధ విలువలు అలాంటివి మరి. ఆరోగ్య పరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో తులసిని ఆరోగ్యప్రదాయినిగా కొనియాడారు.

క్రాన్ బెర్రీస్

క్రాన్ బెర్రీస్

రాన్ బెర్రీ పండు ఆరోగ్యానికి మంచిది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా మరీ మంచిదని పోషకాహార నిపుణులు చెపుతారు. ప్రతిరోజూ ఒక గ్లాసు క్రాన్ బెర్రీ రసం తాగితే, గుండె ఆరోగ్యం బాగా వుంటుంది. అది ఎలా అనేది పరిశీలించండి. క్రాన్ బెర్రీ జ్యూస్ రక్తంలోని మంచి కొలెస్టరాల్ పెంచుతుంది. కనీసం అంటే 10 శాతం పెరుగుతుందని నిపుణులు వెల్లడించారు. ప్లాస్మా యాంటీ ఆక్సిడెంట్ల సామర్ధ్యం 121 శాతం వరకు పెరుగుతుందట. ఈ పండు రసంతాగితే పిల్లలలో సాధారణంగా వచ్చే శ్వాస సంబంధిత ఇన్ ఫెక్షన్లు కూడా తగ్గిస్తుందని కూడా స్టడీ చెపుతోంది.

ఆస్పరాగస్

ఆస్పరాగస్

న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నటువంటి ఈ వెజిటేబుల్ ను ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ద ఉన్న ప్రతి ఒక్కరూ మరియు అదనపు బరువు తగ్గించుకోవాలనుకొనే వారు తప్పని సరిగా ఆస్పరాగస్ ను తీసుకోవాలి. ఒక కప్పు ఉడికించిన ఆస్పరాగస్ 2గ్రాముల ప్రోటీలుంటాయి . ఇందులో ఇతర మినిరల్స్ న్యూట్రీషియన్ కలిగి ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

English summary

Food Cures for Disease Prevention

We all know that food nourishes our bodies and fuels our daily activities, but did you know that food could also serve as a remedy for a range of ailments like high blood pressure, asthma, itchy skin and bladder infections?
Desktop Bottom Promotion