For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలేయ వ్యాధులను నివారించే ఉత్తమ హోం రెమెడీస్

By Super
|

మన శరీరంలో అతిపెద్ద అవయవం లివర్!లివర్‌(కాలేయం) పెద్ద అవయవమే కాదు అతి ముఖ్యమైన అవయవం కూడా! శరీరంలో ఐదుకి పైగా పనుల్ని నిర్వర్తిస్తోంది. వెయ్యికి పైగా ఎంజైమ్స్‌ని లివర్‌ తయారు చేస్తుంటుంది. శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు రక్తం కొద్దిసేపు కారి, అక్కడ గడ్డకట్టి, రక్తం కారిపోతోందంటే అందుకు అవసరమైన ఎంజైమ్స్‌ని లివరే ఉత్పత్తిచేస్తుంది. అనారోగ్యాలు కలిగినప్పుడు, వాటినుంచి తట్టుకోవడానికి అవసరమైన ‘యాంటిబాడీస్‌ని లివరే ఉత్పత్తి చేస్తుంది. లివర్ కొంత మేరకు గాయపడ్డా తిరిగి తన పూర్వస్థితికి చేరుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. మన శరీర అవయవాలన్నింటిలోనూ మూడింట రెండు వంతులు తొలగించినా... మళ్లీ మునపటిలా పెరగగల సామర్థ్యం కాలేయానికి ఉంది. అందుకే దాదాపు 90 శాతం కాలేయం దెబ్బతిన్నప్పటికీ ఒక పట్టాన లక్షణాలు బయటకు కనిపించవు.

లివర్ (కాలేయం)... మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర (గ్లూకోజ్), ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.

బయటకు కనిపించే 8 లివర్ డ్యామేజ్ లక్షణాలు: క్లిక్ చేయండి

కాలేయం పనిచేయకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాలేయం దాదాపు 90శాతం దెబ్బతినేంత వరకూ మనం లక్షణాలు కనిపించవు అన్నాము, కానీ కొన్ని లక్షణాలను మాత్రం త్వరగా గుర్గించినట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించి కాలేయ పరీక్షలు చేయించుకోవాలి. అలసట, బలహీనత, బరువుతగ్గడం, వికారం, వాంతి, చర్మం రంగు ఎల్లోగా మారడం ఇది జాండీస్ కు సంకేతం. కాలేయం దెబ్బతిన్న కనీసం 75శాతం లివర్ టిష్యులు అవసరం అవుతాయి. కాలేయం దెబ్బతిన్నా తిరిగి చాలా సులభంగా ఈ కణాలను పునరుత్పత్తి చేసుకోగలదు. అయితే శరీరానికి సరిపడనంత అందక పోతే, కొన్ని కొన్ని రకాల కాలేయ సమస్యలకు హోం రెమెడీస్ ద్వారా చికిత్సనందివచ్చు. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

వీటిలో ఏలక్షణం మీలో కనిపించినా?లివర్ డ్యామేజ్ అయినట్లే: క్లిక్ చేయండి

పాలు తిస్టిల్:

పాలు తిస్టిల్:

అనేక లివర్ సమస్యలకు ఈ హెర్బ్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ హెర్బ్ వైరల్ హెపటైటిస్, సిర్రోసిస్, ఆల్కహాలిక్ హెపటైటిస్, రసాయనలు మరియు మష్రుమ్ ద్వారా కారణం అయిన టాక్సిటి మొదలై వాటికి ఉత్తమ చికిత్సగా పనిచేస్తుంది.

* భోజనం సమయంలో 900గ్రాములు , రోజుకు రెండు సార్లు తీసుకోవల్సి ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

లివర్ ను డిటాక్సిఫై చేయడానికి ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఫ్యాట్ త్వరగా కరగడానికి సహాయపడుతుంది.

ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీళ్ళలో కలిపి అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేయాలి. దీన్ని రోజుకు మూడు సార్లు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. కాలేయం శుభ్రపడుతుంది.

 డాండలైన్ రూట్ టీ

డాండలైన్ రూట్ టీ

లివర్ ఫంక్షన్స్ ఆరోగ్యకరంగా జరగడానికి డాండలైన్ వేరు యొక్క పౌడర్ అద్భుతంగా సహాయపడుతుంది . ఈ పొడిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇంకా, ఈ డాండలైన్ వేరును నీళ్ళలో వేసి బాగా మరిగించి, గోరువెచ్చగా అయిన తర్వాత త్రాగవచ్చు.

ఆమ్లా (ఉసిరికాయ):

ఆమ్లా (ఉసిరికాయ):

ఆమ్లా(ఉసిరికాయ)లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ఫంక్షన్స్ క్రమంగా జరగడానికి సహాయపడుతుంది. కొన్ని పరీశోధనల ద్వారా ఇది నిరూపితమైనది.

అందుకు మీరు చేయాల్సింది: రోజుకు 4-5ఉసిరికాయలను నేరుగా తీసుకోవచ్చు.

* లేదా సలాడ్స్ లేదా తురుమి, పెరుగులో మిక్స్ చేసి, సాల్ట్ వేసుకొని తినవచ్చు.

లికోరైస్ :

లికోరైస్ :

ఇది మరోక అద్భుతమైనటువంటి హోం రెమెడీ . నాన్ ఆల్మహాలిక్ ఫ్యాటీ లివర్ కండీషన్స్ . కాలేయ సమస్యల నివారణ కోసం ఈ లికోరైస్ ను ఆయుర్వేదిక్ ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

* అందుకు మీరు చేయాల్సింది: లికో రైస్ ను పౌడర్ చేయాలి. ఈ పౌడర్ లో బాగా మరిగించిన నీటిని పోసి, కొన్ని నిముషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోరువెచ్చగా మారిన తర్వాత వడగట్టి, రోజుకు రెండు సార్లు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది కాలేయం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పసుపులోని యాంటీవైరల్ గుణాలు హెపటైటిస్ బి మరియు సి వంటి అనేక వ్యాధులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

అందుకు మీరు చేయాల్సింది: మీరు రెగ్యులర్ గా వండే ఆహారపదార్థాల్లో పసుపు జోడించాలి. అలాగే పాలలో 1/2tsp పసుపు జోడించి ఆ పాలను త్రాగాలి. అలాగే అర చెంచా పసుపుపొడిని ఒక చెంచా తేనెతో మిక్స్ చేసి తీసుకోవచ్చు.

ఫ్లాక్ సీడ్స్ :

ఫ్లాక్ సీడ్స్ :

రక్తంలో ప్రవహించే హార్మోనులను కాలేయం తొలగిస్తుంది . దాంతో కాలేయం మీద ఎక్కువ భారం పడుతుంది. ఫ్లాక్ సీడ్స్ లోని ఫైటో కాన్సిట్యూటియన్స్ రక్తంలోని ప్రవహించే హార్మోనులు తొలగించి కాలేయం యొక్క పని భారంను తగ్గిస్తుంది.

అందుకు మీరు చేయాల్సింది : ఫ్లాక్ సీడ్స్ ను అలాగే లేదా పొడి చేసి సలాడ్స్ లేదా టోస్ట్ మీద గార్నిష్ చేసి తీసుకోవాలి. ఇంకా వీటిని సెరెల్స్ తో చేర్చి తీసుకోవాలి.

 బొప్పాయి:

బొప్పాయి:

లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులను నివారణకు బొప్పాయి గొప్పగా సహాయపడుతుంది. కాలేయ వ్యాధులను నివారించడంలో ఇది ఒక సురక్షితమైనటువంటి నేచురల్ హోం రెమెడీ.

అందుకు మీరు చేయాల్సింది: రెండు చెంచాలా బొప్పా జ్యూస్ లో ఒక స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. ఇలా చేసి ప్రతి రోజు తీసుకోవాలి. ఇలా రెండు మూడు వారాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సమస్య పూర్తిగా నివారించబడుతుంది.

ఆకుకూరలు మరియు క్యారెట్ జ్యూస్:

ఆకుకూరలు మరియు క్యారెట్ జ్యూస్:

క్రోనిక్ సిర్రోసిస్ సమస్యలకు ఈ హోం రెమెడీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

అందుకు మీరు చేయాల్సింది: ఒక గ్లాస్ ఆకుకూరల రసంలో అరగ్లాసు క్యార్ జ్యూస్ మిక్స్ చేసి తీసుకోవాలి. ఒక రోజులో రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆల్కహాల్ నివారించాలి :

ఆల్కహాల్ నివారించాలి :

శరీరంలో ప్రధాన అవయం కాలేయంను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆల్కహాల్ ను నివారించాలి. ఆల్కహాల్ లివర్ మీద మరింత భారం నింపుతుంది.

అవొకాడో మరియు వాల్ నట్స్

అవొకాడో మరియు వాల్ నట్స్

కాలేయ వ్యాధులను నుండి కాలేయానికి రక్షణ కల్పించాలంటే మీ రెగ్యులర్ డైట్ లో అవొకాడో మరియు నట్స్ ను చేర్చుకోవాలి.

అవొకాడో మరియు వాల్ నట్స్ లో ఉండే గ్లూటాథైయాన్ కాలేయంని టాక్సిన్స్ ను శుభ్రం చేసి కాలేయంను శుభ్రం చేస్తుంది.

ఆపిల్ మరియు లీఫీ వెజిటేబుల్స్ :

ఆపిల్ మరియు లీఫీ వెజిటేబుల్స్ :

ఆపిల్స్ ఉండే పెక్టిన్, గ్రీన్ లీఫ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరియు ప్రేగుల్లో టాక్సిన్స్ (వ్యర్థాల)ను తొలగిస్తుంది. అది కాలేయానికి రక్షణ కల్పిస్తుంది.

ఫ్లూయిడ్ ఫ్రీ వాటర్ ను ఎక్కువగా తీసుకోవాలి:

ఫ్లూయిడ్ ఫ్రీ వాటర్ ను ఎక్కువగా తీసుకోవాలి:

ప్రతి రోజూ ఫ్లూయిడ్ ఫ్రీ వాటర్ ను అధికంగా తీసుకోవాలి. నీరు మీ శరీరంను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ కనీసం 10-12గ్లాసుల నీళ్ళను తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా మరియు వ్యర్థాలు లేకుండా ఉంటుంది.

వ్యాయామం:

వ్యాయామం:

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు శరీరంలో ఫ్యాట్ ను కరిగించబడుతుంది . వ్యాయామం చెమటను పెంచుతుంది దాంతో శరీరంలో మలినాలు చెమట రూపంలో బయటకు నెట్టివేయబడుతాయి. వారంలో 5 రోజులు 40నిముషాల వ్యాయామం తప్పనిసరి.

 గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

లివర్ సమస్యలకు అద్భుతమైనటువంటి రెమెడీ గ్రీన్ టీ. గ్రీన్ టీలో అధిక శాతంలో క్యాటచిన్స్ కలిగి ఉండి, లివర్ ఫంక్షన్స్ కు సహాయపడుతుంది . ప్రతి రోజూ రెండు మూడు కప్పుల గ్రీన్ టీ త్రాగడం వల్ల లివర్ సమస్యనుండి కాలేయాన్ని రక్షణ కల్పించబడుతుంది.

Desktop Bottom Promotion