For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కండ్ల కల (పింక్ ఐస్)నివారించే ఉత్తమ హోం రెమెడీస్

By Super
|

కండ్లకల లేదా పింక్ ఐస్ లేదా మెడ్రాస్ ఐస్ ఈ సమస్య పిల్లల్లో మరియు పెద్దవారిలో కూడా కనిపించే చాలా సాధారణ సమస్య. పింక్ ఐస్ నే కండ్లకలగా చెబుతుంటారు. పింక్ ఐస్ వైలర్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఇది పిల్లలు మరియు పెద్దలో వచ్చే సాధారణ ఐ ఇన్ఫెక్షన్. ఈ కండ్ల కల అనేది కన్నులోపల తెల్లగా ఉండే ప్రదేశంలో వస్తుంది. ఇది కనురెప్పకు ఆనుకొని లేదా ఐ మాయిస్ట్ కు దగ్గరగా ఉంటుంది. పింక్ ఐస్(కండ్ల కల)హానికరం కాకపోవచ్చు. అయితే ఇది అసౌకర్యంగా ఉంటుంది. ఎటువంటి మెడికట్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా 7నుండి 10 రోజులకు అదంట అదే తగ్గిపోతుంది. సాధారణంగా, ఇది ఒక కన్నుకు వస్తుంది, అయితే రెండో కన్నుకు కూడా సోకుతుంది. కండ్లకళ వల్ల వచ్చే నొప్పి లేదా అసౌకర్యంను నివారించుకోవడానికి యాంటీ బయోటిక్ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఐడ్రాప్ తో పాటు కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించవచ్చు. పింక్ ఐ నివారించడానికి ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ ఇవ్వడం జరిగింది.

మంచి కంటి చూపు కోసం 20 పవర్ ఫుల్ చిట్కాలు:క్లిక్ చేయండి

కండ్ల కల మూడు రకాలుగా ఉంటుంటుంది. అందులో ఒకటి బ్యాక్టీరియల్ కంజెక్టివ్స్, అలర్జిక్ కంజెక్టివ్స్, మరియు వైరల్ కంజెక్టివ్స్. బ్యాక్టీరియల్ కంజెక్టివ్స్ స్టైఫోలోకోకల్ లేదా స్ట్రెప్టోకాల్ బ్యాక్టీరియా వల్ల సోకవచ్చు .ఇది అలర్జీకీ దారితీస్తుంది. అలర్జీకి కారణం డస్ట్ లేదా స్మోక్. ఇక వైరల్ కంజంక్టివిటీస్ వైరస్ వల్లవ్యాప్తి చెందుతుంది . బ్యాక్టీరియల్ మరియు వైరన్ కంజంక్టివిటీస్ ఒకరి నుండి మరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఇంది సర్ఫేస్ ద్వారా లేదా పింక్ ఐస్ ఒకరి చూడటం ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది.

కళ్లక్రింద నల్లని వలయాలను నివారించే 14 బెస్ట్ హోం రెమడీస్:క్లిక్ చేయండి

పిల్లులు మరియు పెద్దల్లో పింక్ ఐ లక్షణాలు :

కంట్లో నుండి ఎక్కువగా నీరు కారడం
కళ్ళు ఎర్రగా, దురదగా మరియు కళ్ళు ఉబ్బుగా ఉండటం
కళ్ళలో తరచూ నొప్పిగా ఉండటం
ఇన్ఫెక్షన్ ఉన్నప్రదేశంలో క్రస్ట్ చేరడం
కళ్ళు బ్రైట్ గా కనబడకపోవడం
కళ్ళ నుండి చాలా స్వచ్చమైన వైట్ డిశ్చార్జ్ అవ్వడం(వైరల్ లేదా అలర్జీ)
కళ్ళ నుండి పసుపుగా లేదా పచ్చగా డిశ్చార్జ్ అవ్వడం(బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్)

ఐస్ ప్యాక్:

ఐస్ ప్యాక్:

కళ్లు వాపు, దురద మరియు రెడ్ నెస్ ను నివారించడంలో ఐస్ ప్యాక్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ కు చికిత్స కాదు. ఒక శుభ్రమైన వస్త్రాన్ని చల్లటి నీటిలో నానబెట్టి తర్వాత బయటకు తీసి నీరు మొత్తం పిండేయాలి. తర్వాత ఈ తడి వస్త్రాన్ని కళ్ళ మీద కప్పుకొని 15 నుండి 20 నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి .ఐస్ ప్యాక్ కంటిన్యూగా చేయండి. చల్లటి వస్త్రాన్ని తరచూ మార్చతుండాలి.

తేనె మరియు పాలు:

తేనె మరియు పాలు:

తేనె మరియు గోరువెచ్చని పాలు సమంగా తీసుకొని, రెండింటి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో ఐ కప్పు లేదా కాటన్ బాల్స్ ఉపయోగించి మీ కళ్ళను శుభ్రం చేసుకోవాలి . ఇంకా మీరు ఈ మిశ్రమాన్ని ఐడ్రాప్స్ గా లేదా కంప్రెస్ గా ఉపయోగించుకోవచ్చు. కళ్ళలు జస్ట్ ఒకటి రెండు డ్రాప్స్ ను వేసుకోవాలి . తర్వాత కళ్ళమీద క్లాత్ లేదా కాటన్ ప్యాడ్ ను కప్పి ఉంచుకోవాలి.

కొత్తిమీర:

కొత్తిమీర:

తాజాగా ఉన్న కొత్తమీరను(ఎండినదాన్ని) గుప్పెడు చేతిలోకి తీసుకొని నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. తర్వాత స్ట్రెయినర్ తో వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వతా ఈ నీటితో ఇన్ఫెక్షన్ అయిన కళ్ళను శుభ్రం చేసుకోవాలి. దీన్ని కంప్రెస్ గా ఉపయోగించాలి . ఈ హోం రెమెడీ వల్ల కళ్ళ మంటలు తగ్గుతాయి. అదే విధంగా కళ్ళు నొప్పి మరియు వాపు కూడా నివారించబడుతుంది.

 హాట్ కంప్రెస్:

హాట్ కంప్రెస్:

రోజ్, ల్యావెండర్ లేదా చమోమెలీ వంటి వివిధ రకాల నూనెలను ఉపయోగించి హాట్ కంప్రెస్ చేయాలి. కొన్ని చుక్కల నూనెను వెచ్చని వస్త్రం మీద వేసి, ఈ క్లాత్ ను కళ్ళమీద ఉంచుకోవాలి. క్లాత్ చల్లబడే వరకూ కళ్ళ మీద నుండి తీయ్యకూడదు. కనీసం 5నుండి 10 నిముషాలు అప్లై చేయాలి. రోజులో ఇలా మూడు నుండి నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. హాట్ కంప్రెస్ అసౌకర్యాన్ని నివారిస్తుంది మరియు కళ్ళనుండి ఇన్ఫెక్షన్ ను తొలగిస్తుంది.

సోంపు:

సోంపు:

కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో సోంపు వేసి బాగా మరిగించి ఆ నీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నీటిని వడగట్టుకొని, ఇన్ఫెక్షన్ అయిన కళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇది నొప్పిని మరియు మంటను తగ్గిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని ఒక కప్పు నీటిలో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో కాటన్ బాల్స్ ఉపయోగించి ఇన్ఫెక్షన్ సోకిన కళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ‘మదర్' కలిగి ఉంటుంది. ‘మదర్' అంటే మాలిక్ యాసిడ్ , ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.

తేనె:

తేనె:

తేనెను రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మొదట, ఇన్ఫెక్షన్ ఐన కళ్ళలో తేనెను ఒక డ్రాప్ వేసుకోవాలి. రెండవది, మూడు చెంచాల తేనెను రెండు కప్పుల వేడి నీళ్ళలో వేసి చల్లారిన తర్వాత ఆ నీటితో ఇన్ఫెక్ట్ అయిన కళ్ళను శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంప:

బంగాళదుంప:

పచ్చిబంగాలదుంప తీసుకొని, స్లైస్ గా కట్ చేసి, ఇన్ఫెక్షన్ అయిన కళ్ళమీద ఉంచుకోవాలి. ఈ రెమెడీని మూడు రాత్రులు కంటిన్యూగా ఉపయోగించాలి.

పసుపు:

పసుపు:

రెండు టీస్పూన్ల పసుపు మరియు ఒక కప్పు వేడినీళ్ళలో మిక్స్ చేసి, ఈ నీటిని హాట్ కంప్రెసర్ గా ఇన్ఫెక్ట్ అయిన కళ్ళమీద ఉపయోగించాలి.

కాలెండులా:

కాలెండులా:

రెండు టీస్పూన్ల కాలెండులా పువ్వు యొక్క రేకులు ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి తర్వాత చల్లార్చాలి. ఈ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి . ఈ నీటితోనే హాట్ కంప్రెస్ గా కూడా ఉపయోగించవచ్చు . శుభ్రంగా ఉన్న క్లాత్ ను ఈ నీటిలోడిప్ చేసి కళ్ళ మీద వేడిగా అప్లై చేయాలి.

కలబంద:

కలబంద:

కలబంద రసాన్ని ఐవాష్ గా ఉపయోగిస్తుంటారు మరియ కంప్రెస్ గాను ఉపయోగిస్తుంటారు. కంప్రెస్ కోసం, క్లాత్ ను లేదా కాటన్ బాల్స్ ను అలోవరె రసంలో డిప్ చేయాలి . ఈ క్లాత్ ను ఇన్ఫెక్ట్ అయిన కళ్ళమీద అప్లై చేయాలి. కళ్ళను శుభ్రం చేసుకోవడానికి అరచెంచా కాచి చల్లార్చిన నీటిలో వేయాలి. అలాగే అరటీస్పూన్ బరిక్ యాసిడ్ ను ప్రిజర్వేటివ్ గా జోడించవచ్చు.

ఉసిరికాయ:

ఉసిరికాయ:

ఒక కప్పు ఉసిరికాయ రసంలో రెండు చెంచాల తేనె మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు త్రాగాలి.

వెజిటేబుల్ జ్యూస్ :

వెజిటేబుల్ జ్యూస్ :

కండ్లకలకు వెజిటేబుల్ జ్యూసులు చాలా ఎక్కువగా సహాయపడుతాయి. 200ఎంఎల్ ఆకుకూర రసంలో 300ఎంఎల్ క్యారెట్ జ్యూస్ ను మిక్స్ చేయాలి. అలాగే పార్ల్సే మరియు క్యారెట్ జ్యూస్ కూడా తయారుచేసి రోజూ తీసుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

కండ్ల కలకు నిమ్మరసం ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. కొన్ని చుక్కల నిమ్మరసం చేతిలోకి తీసుకొని , ఇన్ఫెక్షన్ అయిన కళ్ళ మీద అప్లై చేయాలి. ఇది ఒక 5నిముషాలు కండ్ల మంటకు గురిచేస్తుంది అయితే మంచి ఫలితం ఉంటుంది.

ఉప్పు:

ఉప్పు:

కొంచెం ఉప్పు తీసుకొని వేడినీళ్ళలో వేయాలి. తర్వాత అందులో కాటన్ బాల్ డిప్ చేసి ఇన్ఫెక్ట్ అయిన కళ్ళ మీద అప్లై చేయాలి. ఈ ఉప్పునీరు చాలా సులభమైన మరియు చాలా హెల్ప్ఫుల్ రెమెడీ.

పెరుగు:

పెరుగు:

పెరుగు ఒక ఉపయోగకరమైన హోం రెమెడీ. బాగా పులిసిన పెరుగును చేతిలో వేసి మర్దన చేసి ఇన్ఫెక్ట్ అయిన కళ్ల మీద అప్లై చేయాలి.

Desktop Bottom Promotion