For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడానికి సహజ పద్దతులు

|

మూత్రపిండాలు రక్తం శుద్ధి అనే కీలక విధులను నిర్వహించడానికి,శరీరంలో విషాన్ని మరియు ఇతర వ్యర్ధాలు తొలగించుకోవటానికి సహాయం చేస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడుట వలన వాటి విధులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. యూరిక్ ఆమ్లం, పాస్పరస్, కాల్షియం మరియు అక్సాలిక్ ఆమ్లం వంటి రసాయనాలు పేరుకుపోవడం వలన రాళ్ళు ఏర్పడటానికి అత్యంత సాధారణ కారణంగా చెప్పవచ్చు.

ఎక్కువగా విటమిన్ D, ఖనిజ అసమతుల్యత, అతిసారం, గౌట్, అసమాన ఆహారం తీసుకొవటం వంటివి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కొన్ని ఇతర కారణాలుగా చెప్పవచ్చు. మూత్రపిండాలలో రాళ్ళు ఉండడం వలన చాలా బాధాకరంగాను మరియు అనేక విధాలుగా రోగి యొక్క జీవితంను అడ్డుకుంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉంటె ప్రధాన లక్షణాలు తరచూ మూత్ర విసర్జన, వికారం, వాంతులు మరియు అసాధారణ చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటాయి.

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!: క్లిక్ చేయండి

కిడ్నీ స్టోన్స్ ను నివారించుకోవాలంటే మీరు తీసుకొనే ఆహారం మరియు డ్రింక్స్ మీద ప్రత్యేక శ్రద్ద కలిగి ఉండాలి. కొన్నిఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. అంతే కాదు కొన్ని రకాల కెమికల్స్ వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. బ్లాడర్ లో చేరితే అత్యంత బాధకరమైన పరిస్థితి ఉంటుంది. కెమికల్స్ చాలా వరకూ క్యాల్షియం, ఆక్సాలేట్ లేదా ఫాస్పరస్ తో కలిసినప్పుడు యూరిక్ యాసిడ్ విచ్ఛిన్నం అయ్యి కిడ్నీ స్టోన్ కు దారితీస్తుంది. మరి కిడ్నీస్టోన్ నివారించడానికి కొన్నిచిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

కిడ్నిలో రాళ్ళను తొలగించే సులభ చిట్కాలు: క్లిక్ చేయండి

తగినన్ని నీళ్ళు త్రాగడం:

తగినన్ని నీళ్ళు త్రాగడం:

నీటిని తాగడం శరీరం మరియు మూత్రపిండాలు ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచడానికి రోజువారీ తగినంత నీరు అవసరం. మూత్రపిండాల్లో రాళ్లు దృష్టిలో తీసుకుంటే చికిత్సకు తక్కువ కాదు. ఇతర ఆరోగ్యకరమైన ద్రవాలు లేదా పానియాలతో పాటు 8-10 గ్లాస్ ల నీటిని త్రాగాలి. మూత్రంలో పాలిపోవడం తొలగింపులో సహాయపడుతుంది. మినరల్ వాటర్ అత్యంత సిఫార్సు చేయబడింది. తక్కువ ఆమ్ల లక్షణాలు, కాల్షియం తయారి తగ్గించటం మరియు మూత్రంలో యూరిక్ ఆమ్లం గాఢత తగ్గించడంలో సహాయపడుతుంది. మినరల్ వాటర్ మూత్రపిండాలలో పరిమాణంలో పెరుగుదల ఉన్న రాళ్లను నిరోధిస్తుంది.కాబట్టి మీ దినచర్యలో భాగంగా ఎక్కువ నీళ్ళు త్రాగి కిడ్నీ స్టోన్స్ ను నేచురల్ గా నివారించుకోవచ్చు.

తక్కువ క్యాల్షియం:

తక్కువ క్యాల్షియం:

శరీరంలో క్యాల్షియం తక్కువైనప్పుడు, ఆక్సాలేట్ లెవల్స్ పెరుగుతుంది. అది కిడ్నీస్టోన్ కు దారితీస్తుంది. కాబట్టి, కిడ్నీస్టోన్ నివారించాలంటే, తగినంత క్యాల్షియం సప్లిమెంట్స్ లో క్యాల్షియం ఫుడ్స్ ను తీసుకోవల్సి ఉంటుంది. క్యాల్షియం కంటెంట్ వయస్సును బట్టి తగినంత మోతాదులో తీసుకోవల్సి ఉంటుంది. క్యాల్షియం సప్లిమెంట్ కన్నా, నేచురల్ గా క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.

సోడియం ఎక్కువైతే:

సోడియం ఎక్కువైతే:

సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల అది క్యాల్షియంగా మారి, కిడ్నీ స్టోన్ కు దారితీస్తుంది. కాబట్టి, లో సోడియం డైట్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరమం మరియు ఇది కిడ్నీ స్టోన్ ను నేచురల్ గా నివారించడం మాత్రమే కాదు, బ్లడ్ ప్రెజర్ ను మ్యానేజ్ చేస్తుంది.

అనిమల్ ప్రోటీన్ :

అనిమల్ ప్రోటీన్ :

రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. పౌల్ట్రీ మరియు గుడ్లను తినడం వల్ల కిడ్ని స్టోన్ ను నేచురల్ గా నివారిస్తుంది. ఎందుకంటే పౌల్ట్రీ ఫుడ్స్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ లెవల్ ను పెంచుతుంది. ఇది శరీరంలో సిట్రేట్ లెవల్ ను తగ్గిస్తుంది.

క్యాల్షియం మరియు ఆక్సాలేట్ రెండూ కలిపి తీసుకోవాలి:

క్యాల్షియం మరియు ఆక్సాలేట్ రెండూ కలిపి తీసుకోవాలి:

తాజా పరిశోధనల ప్రకారం క్యాల్షియం మరియు ఆక్సాలేట్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల, మూత్రపిండాల్లో రాళ్ళను నేచురల్ గా నివారించడానికి సహాయపడుతుంది. ఆక్సాలేట్ మరియు క్యాల్షియం పొట్ట మరియు ప్రేగుల్లో బంధించబడి ఉండటం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం తక్కువ .

రాళ్ళు ఏర్పడేలా చేసే ఆహారాలు:

రాళ్ళు ఏర్పడేలా చేసే ఆహారాలు:

కిడ్నీస్టోన్స్ ను ఎలా నివారించుకోవాలని మీరు అనుకుంటున్నప్పుడు, కిడ్నీలో రాళ్ళును ఏర్పడేలా చేసే అన్ని ఆహారాల గురించి తెలుసుకోవాలి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడేలా చేసే ఆహారాల్లో కొన్నిబీట్స్, ఆకుకూరలు మరియు చాక్లెట్స్. అలాగే చాలా వరకూ నట్స్ లో ఆక్సాలేట్ కలిగి ఉంటే, కోలాస్ లో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. అందువల్ల, ఈ ఆహారాలను తినకుండా నివారించగలిగినట్లైతే మీరు తప్పకుండా కిడ్నీస్టోన్ ను నివారించుకోవచ్చు.

కిడ్రీస్టోన్ ఏర్పకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం:

కిడ్రీస్టోన్ ఏర్పకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం:

కిడ్నీస్టోన్ ఎలా నివారించుకోవాలని ఆలోచిస్తున్నట్లైతే మీరు, అనారోగ్యాలకు దూరంగా ఉండాలి. ఒక్కసారి కిడ్నీస్టోన్ కు గురైన వారిలో తిరిగి మరళ ఏర్పడ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ముందుజాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకు చేయాల్సిందే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి.

English summary

How To Prevent Kidney Stones?

Kidney stones – the most painful word that you can hear. Those who have kidney stones should be extremely careful with their eating habits. The pain is unbearable till it passes through the urine. If you want to know how to prevent kidney stones, know that the most important factor is what you eat and drink. Lack of fluids or the excess amount of certain foods can be a reason for kidney stones.
Desktop Bottom Promotion