For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొంతునొప్పి-ఇన్ఫెక్షన్స్ నివారణకు ఉత్తమ చిట్కాలు

|

థ్రోట్ ఇన్ఫెక్షన్(గొంతు నిప్పి)ఒక భయంకరమైన ఆరోగ్య సమస్య. ఇటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆహారం తీసుకోవాలన్నా, ఇతరులతో మాట్లాడాలన్నా ఇబ్బంది కరంగా ఉంటుంది. దానికి తోడు రోజంతా దగ్గు వేధిస్తుంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దగ్గకపోయినా, గొంతు నొప్పెడుతూనే ఉంటుంది. అలాంటి భయంకరమైన త్రోట్ ఇన్ఫెక్షన్ తో రోజంతా మీరు ప్రశాంతంగా గడపలేరు. ముఖ్యంగా మీకు నచ్చినవన్నీ ఆరోజు వదులుకోవల్సి ఉంటుంది.

ఇన్ఫెక్షన్స్ ను త్వరగా గుర్తించి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఒక రోజులో పోతుతుంది. మరికొన్ని ఇన్ఫెన్స్ ఒక వారంలో పోతాయి. మరికొన్ని ఇన్ఫెక్షన్స్ ఒక నెలవరకూ ఉంటాయి. దాంతో ఎక్కువ రోజుల వరకూ చెడుగా త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడాల్సి వస్తుంది.

త్రోట్ ఇన్ఫెక్షన్ నిశారించడానికి మార్కెట్లో వివిధ రకాలు మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మెడిసిన్స్ మంచివే అయినా, ఒక్కసారికే ఇన్ఫెక్షన్స్ ను నయం చేయవు.

థ్రోట్ ఇన్ఫెక్షన్ వెంటనే నివారించుకోకపోతే అది మరింత చెడుగా మారుతుంది. ఒక వేళ మార్కెట్లో మందువల్ల మీకు త్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గకుండా అలాగే బాధపడుతుంటే, ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా స్మూత్ గా థ్రోట్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తాయి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

రాస్బెర్రీ టీ:

రాస్బెర్రీ టీ:

రాస్బెర్రీ లీఫ్ టీ త్రోట్ ఇన్ఫెక్షన్ కు చాలా మంచిది. సోర్ త్రోట్ నివారించుకోవాలంటే రాస్బెర్రీ లీవ్స్ తో టీ తయారుచేసుకొని గోరువెచ్చగా చేసి నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. రెండు చెంచాలా రాస్బెర్రీ ఆకులను తీసుకొని అందులో ఒక కప్పు వేడినీళ్ళు పోసి బాగా ఉడికించాలి. తర్వాత వేరే కప్పులోకి ఫిల్టర్ చేసుకొని, చల్లారనివ్వాలి . తర్వాత ఈ నీటితో గార్గిల్ చేయాలి. గొంతునొప్పిని నివారించడంలో ఇది ఒక ఉత్తమ రెమెడీ.

సేజ్:

సేజ్:

సేజ్ తో మీరు గార్గిల్ చేస్తే, గొంతు తక్షణం ఉపశమనం పొందుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ హేర్బ్. ఒక కప్పువేడి నీటిలో సేజ్ వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని మరో కప్పులోకి వడగట్టుకొని, చల్లారనివ్వాలి. కొద్దిపేపటి తర్వాత ఈ నీటిని నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. తక్షణం ఉపశమనం పొందడం మీరు గమనిస్తారు.గొంతునొప్పి నివారించడానికి ఇది ఒక నేచురల్ రెమెడీ

నీళ్ళు లేదా పాలలో పసుపు:

నీళ్ళు లేదా పాలలో పసుపు:

అరచెంచా పసుపును ఒక కప్పు వేడి నీళ్ళలో లేదా వేడి పాలలో వేసి బాగా మిక్స్ చేసి వేడి వేడిగా తీసుకోవాలి. ఈ వాటర్ లేదా పాలను ఉదయం నిద్రలేవగానే తీసుకోవాలి. అలాగే పసుపు వేడినీళ్ళతో తిరిగి గార్గిల్ కూడా చేయవచ్చు .మీరు గొంతు నొప్పుతో మరియు ఎక్కువగా గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లైతే, టర్మరిక్ వాటర్ చాలా స్మూత్ గా నివారిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్స్ ను పసుపు వేడినీళ్ళు చాలా ఎఫెక్టివ్ గా నయం చేస్తుంది.

సాల్ట్ వాటర్:

సాల్ట్ వాటర్:

వేడి నీళ్ళలో ఒక చిటికెడు ఉప్పు వేసి, బాగా మిక్స్ చేసి నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. ఇలా సాల్ట్ వాటర్ తో రెగ్యులర్ గా గార్గిల్ చేస్తుంటే త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా నయం చేస్తుంది. ఈ హోం రెమెడీని ఉపయోగించినట్లైతే చాలా త్వరగా ఉపశమనం పొందుతారు.

లిస్ట్రిన్:

లిస్ట్రిన్:

లిస్ట్రిన్ మీ నోటిని ఫ్రెష్ గా ఉంచడం మాత్రమే కాదు, మీ గొంతును చాలా స్మూత్ గా ఉంచుతుంది. టిస్ట్రిన్ ను గార్గిల్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలిగించి, గొంతు నొప్పిని నివారిస్తుంది.

అల్లం టీ:

అల్లం టీ:

అల్లం టీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కు అయినా, చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, మీ గొంతు ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవాలంటే ఒక కప్పు అల్లం టీను తీసుకోండి . గొంతు సమస్యలను నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

English summary

Natural Remedies For Throat Infection

Throat infections can be dreadful. You really don’t want to experience a bad throat day as that means you will not be able to talk, and you will be coughing throughout the day. Even when you are not coughing, throat infections can be painful. You can’t have a normal day with a bad throat. In fact, most of your favourite things will be given a miss on a bad throat day.
Story first published: Friday, October 24, 2014, 17:52 [IST]
Desktop Bottom Promotion