For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీటిలో ఏలక్షణం మీలో కనిపించినా?లివర్ డ్యామేజ్ అయినట్లే

By Super
|

మన శరీరంలో అతిపెద్ద అవయవం లివరే..!లివర్‌(కాలేయం) పెద్ద అవయవమే కాదు అతి ప్రత్యే కమైన అవయవం కూడా! శరీరంలో ఐదుకి పైగా పనుల్ని నిర్వర్తిస్తోంది. వెయ్యికి పైగా ఎంజైమ్స్‌ని లివర్‌ తయారు చేస్తుంటుంది. శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు రక్తం కొద్దిసేపు కారి, అక్కడ గడ్డకట్టి, రక్తం కారిపోతోందంటే అందుకు అవసరమైన ఎంజైమ్స్‌ని లివరే ఉత్పత్తిచేస్తుంది. అనారోగ్యాలు కలిగినప్పుడు, వాటినుంచి తట్టుకోవడానికి అవసరమైన ‘యాంటిబాడీస్‌ని లివరే ఉత్పత్తి చేస్తుంది. లివర్ కొంత మేరకు గాయపడ్డా తిరిగి తన పూర్వస్థితికి చేరుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. మన శరీర అవయవాలన్నింటిలోనూ మూడింట రెండు వంతులు తొలగించినా... మళ్లీ మునపటిలా పెరగగల సామర్థ్యం కాలేయానికి ఉంది. అందుకే దాదాపు 90 శాతం కాలేయం దెబ్బతిన్నప్పటికీ ఒక పట్టాన లక్షణాలు బయటకు కనిపించవు. లివర్ (కాలేయం)... మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర (గ్లూకోజ్), ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.

కాలేయ సమస్యలకు ముఖ్య కారణాలు: ఇన్ఫెక్షన్స్ మత్తు పదార్థాలు సేవించడం, పొగతాగడం కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం శరీరానికి వ్యాయామం ఇవ్వకపోవడం కలుషిత ఆహారం లేదా నీరు తీసుకోవడం రక్తమార్పిడి శరీరానికి హాని చేసే మందులను ఎక్కువ మోతాదులో వాడటం ఆటో ఇమ్యూన్ డిసీజెస్... అంటే మన రోగనిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేయడానికి అవకాశం ఉన్న వ్యాధులు రావడం, వీటితో పాటు వంశపారంపర్యంగాకూడా కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Symptoms of liver damage

మద్యపానం ఒక్కటే లివర్ డ్యామేజ్ కు కారణం కాదు. మేము మద్యం త్రాగము కాబట్టి మాకు లివర్ డ్యామేజ్ సమస్యలు ఏం ఉండవనుకోవడం చాలా పొరపాటు. కొన్ని సార్లు మీరు తీసుకొనే ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల కాలేయం చుట్టూ అధికంగా క్రొవ్వు చేరుతుంది. దీన్ని ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అంటారు. అంతే కాదు దీన్ని లివర్ డ్యామేజ్ గా కూడా వర్గీకరిస్తారు. కాబట్టి ఎటువంటి సంకేతాలు లేకుండా లివర్ డ్యామేజ్ అవుతుంటాయి. సడన్ గా బయటపడుతుంటాయి. అందుకోసం లివర్ డ్యామేజ్ కలిగించే కొన్ని లక్షణాలు(సంకేతాలు)మీకోసం...

1. కళ్ళు పసుపు పచ్చగా ఉంటాయి: అలసిన కళ్ళు మరియు కళ్ళ చుట్టు నల్లటి వలయాలు: కాలేయం మోసపూరితంగా చర్మాన్ని నాశనం చేయడం మరియు అలసటకు గురిచేయడం వంటి లక్షణాలకు గురిచేస్తుంది. కళ్ళ క్రింది చర్మ చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం అలసనట్లు కనబడ్డి అది మీ అనారోగ్యానికి చిహ్నంగా గుర్తించాలి. తెల్లగా ఉండే కళ్ళు పసుపు పచ్చగా మరియు గోళ్ళు పసుపుగా మారినప్పుడు కామెర్లు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవాలి. అంటే కాలేయం దెబ్బతినింది దానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

2. వికారంగా ఉండడం అజీర్ణం, కాలేయం దెబ్బతినడంతో ఆమ్ల ప్రభావంతో తలతిరిగేటట్టు ఉండడం వంటి జీర్ణ సమస్యలు కూడా వాంతులకు దారితీస్తాయి.

3. ఉదరపు వాపు: కొన్ని సార్లు, కాలేయం ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఎన్ లార్డ్ కావడం వల్ల పొట్ట ఉదర భాగం ఉబ్బి ఉంటుంది. ఈ పరిస్థితిని వెంటనే గమనించకపోయినట్లైతే మీ బొడ్డు చుట్టూ పొట్ట మరింత విస్తరించే అవకాశం ఉంది. పొత్తికడుపు, ప్రత్యేకంగా పొత్తికడుపు పైన కుడివైపు మూలన లేదా పక్కటేముకకు కింద కుడి భాగంలో నొప్పి ఉంటే అది కాలేయం దెబ్బతిన్న లక్షణాన్ని సూచిస్తుంది.

4. నిద్రలేమి: దెబ్బతిన్న కాలేయం పూర్తిగా పాడైపోయినపుడు ప్రమాదకర ఫాటిగ్, కండరాల, మానసిక బలహీనత, మతిమరుపు, గందరగోళం, చివరికి కోమా సాధారణంగా వస్తాయి.

5. జీర్ణక్రియ మీద ప్రభావం: మీ కాలేయం దాని పై కొవ్వు పేరుకుపోయినా లేదా కాలేయం విస్తరించినా, నీరు కూడా జీర్ణం కాలేవు. అయితే చాలా కాలం నుండి చిన్న జీర్ణ సమస్యలు ఉన్నా, తగ్గకుండా తరచూ బాధిస్తుంటే లివర్ డ్యామేజ్ లక్షణంగా గుర్తించాలి.

6. మెనుష్ట్రువల్ డిసార్డర్: లివర్ క్రిటికల్ గా డ్యామేజ్ అయినప్పుడు, బ్రెయిన్ ఫంక్షన్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో మెదడు వెంటనే ప్రతిస్పందించవు. పేషంట్స్ ఎల్లప్పుడూ ఆందోళనలో ఉంటారు. ఇది కూడా లివర్ డ్యామేజ్ కు ఒక ప్రధాన లక్షణమే. పేషంట్స్ కు వెంటనే మెడికల్ అటెన్షన్ ఇవ్వకపోతే మెనుష్ట్రువల్ డిజార్డర్ మొదలవుతుంది.

7. కోమా: లివర్ డ్యామేజ్ చివరి లక్షణం మరియు వరెస్ట్ లివర్ డ్యామేజ్ లక్షణం, పేషంట్ వెంటనే కోమాలోకి వెళతాడు. అటువంటి పరిస్థితిలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

Desktop Bottom Promotion