For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో సాధారణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణకు చిట్కాలు

By Super
|

భారీ ధారాపాతంగా కురిసే వర్షాల వలన తరచుగా అనారోగ్యాలు వస్తాయి. వర్షాకాలంలో సాదారణంగా కోల్డ్, దగ్గు,ఫ్లూ మరియు శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆహారం మరియు నీటి వలన మలేరియా,డెంగ్యూ మరియు అనేక అంటువ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. మీరు సాధారణ వర్షాకాల వ్యాధులు రాకుండా ముందుగానే సురక్షితంగా ఉండడానికి ఈ ముందు జాగ్రత్త చర్యలను చేపట్టవచ్చు.

 Tips to Prevent Common Respiratory Diseases in Monsoon

1. సాధారణ శ్వాస వ్యాధులను నివారించేందుకు, మీరు ఎల్లప్పుడూ మీతో రైన్ కోట్ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఉదయం పూట ఎండ ఉండవచ్చు, అయినప్పటికి రోజు సమయంలో ఎప్పుడైనా ధారాపాతంగా వర్షం కురిసే అవకాశం ఉంది. అందువలన మీ వెంట గొడుగు లేదా రైన్ కోట్ తప్పనిసరిగా ఉండాలి.

2. ఒక ఆహార సప్లిమెంట్ లేదా సహజ రూపంలో విటమిన్ సి ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది సాధారణ శ్వాసకోశ వ్యాధులను దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది. విటమిన్ సి కోల్డ్ చికిత్సలో ఉత్తమ నివారణగా పనిచేస్తుంది. ఇది చల్లని హిల్స్ మరియు ప్రతిరోధకాలను ప్రేరేపిస్తుంది.

3. మీరు వర్షంలో బాగా తడిచినప్పుడు స్నానం చేయటం వలన అంటువ్యాధులు వ్యాప్తి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి సహాయం చేస్తుంది.

4. మీరు వర్షం లోనించి ఇంటిలోకి తిరిగి వచ్చిన తర్వాత సూప్ లేదా వెచ్చని పాల వంటి వేడి పానీయం తీసుకోవాలి. ఇలా చేయుట వలన మీ శరీరం యొక్క ఉష్ణోగ్రత మార్పు వలన ఏర్పడే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి.

5. ఎల్లప్పుడూ మీరు మీ చేతులను శుభ్రం ఉంచుకోవటం మరియు ఈ సీజన్లో శానిటరీ లోషన్ ఉపయోగించాలని నిర్ధారించుకోండి.

6. అంతేకాకుండా గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన చిట్కా ఏమిటంటే మీ శరీర ఉష్ణోగ్రత నిర్వహించడానికి మరియు మీ శరీరం నుండి విషాన్ని బయటకు పంపించటానికి పుష్కలంగా నీటిని త్రాగటం అలవాటు చేసుకోవాలి.

English summary

Tips to Prevent Common Respiratory Diseases in Monsoon

The heavy downpour often brings a host of illnesses with it. Cold, cough, flu and respiratory diseases are a common occurrence during monsoon but one should also be weary of other monsoon illnesses like malaria, dengue and several water and food infections.
Story first published: Thursday, August 28, 2014, 17:33 [IST]
Desktop Bottom Promotion