For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతక ‘ఎబోలా ఫీవర్’ రాకుండా ముందు జాగ్రత్తలు

|

ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి చెందటం గురించి మొత్తం ప్రపంచం అంతా భయపడుతుంది. అలాగే USA,గల్ఫ్ లలో కూడా ఎబోలా మరణాలు ఉన్నాయి. ఈ ఎబోలా వైరల్ జ్వరం వంటిది. దీనికి ఎటువంటి టీకాలు లేవు. దీని వలన 90 శాతం మరణాల రేటు ఉన్నది. కాబట్టి దీని గురించి భయపడటం సహజం. అయితే, ఎబోలా జ్వరం గురించి కొన్ని వాస్తవ లక్షణాలు తెలుసుకోవడం వలన పుకార్లు మరియు తీవ్ర భయాందోళనను పారద్రోలటానికి సహాయపడుతుంది.

ఎబోలా వైరస్ ప్రధానంగా జంతువులలో ఉంటుంది. మానవుడు ఈ వైరస్ తో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు మాత్రమే ఎబోలా యొక్క వ్యాప్తి ప్రారంభమవుతుంది. ఇది 1976 నుండి చరిత్రలో అనేక సార్లు కనపడింది. ఈ వైరస్ ఎక్కువగా ఆఫ్రికా ఉష్ణమండల అడవులలో కనబడుతుంది. కానీ ఇది చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. మీరు ఎబోలా వైరస్ లక్షణాలను తెలిసికోవటానికి ముందు, మీరు గాలి,నీరు లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందదని తెలుసుకోవాలి. ఈ వైరల్ సంక్రమణ ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది.

ఎబోలా జ్వరం ప్రారంభ లక్షణాలు చాలా మటుకు ఫ్లూ లేదా డెంగ్యూ లేదా మలేరియా వంటి ఇతర జ్వరాల వలే ఉంటాయి. ఈ జ్వరంలో మాత్రమే ఉండే నిర్దిష్ట లక్షణం రక్తస్రావం జరిగి హేమరేజ్ కు దారితీస్తుంది. ఎబోలా సోకిన ఒక వ్యక్తి ముక్కు,కళ్లు,చెవులు మరియు పాయువు వరకు రక్తస్రావం ఉంటుంది.ఇది చివరికి రక్తస్రావం వలన మరణానికి దారితీస్తుంది. ఇక్కడ మీరు ప్రారంభ లక్షణాలను గుర్తించడానికి సహాయపడే కొన్ని ఎబోలా జ్వరం లక్షణాలు ఉన్నాయి.

తలనొప్పి

తలనొప్పి

తలనొప్పి అనేది జ్వరం యొక్క ఒక సాధారణ లక్షణంగా ఉంది. కాబట్టి, మీకు ఎబోలా సోకినది అని అనుకోవటం కష్టం. ఎబోలా జ్వరం ఉన్న వ్యక్తికీ హెమోర్రేజిక్ మరియు విపరీతమైన తలనొప్పి ఉంటాయి. అప్పుడు ఈ లక్షణాలతో ఎబోలా జ్వరం వచ్చిందని నిర్దారణకు రావాలి.

అలసట

అలసట

ఎబోలా సోకినప్పుడు విపరీతమైన అలసట ఉంటుంది. సంక్రమణ జరిగినప్పుడు మీకు జ్వర సంబంధమైన గొంతు మరియు అలసటతో కూడిన అనుభూతి ఉంటుంది.

శ్వాసక్రియలో సమస్యలు

శ్వాసక్రియలో సమస్యలు

శ్వాసక్రియలో సమస్యలు అనేది ఎబోలా జ్వరం యొక్క నిర్దిష్ట లక్షణం. మీకు టెంపరేచర్ ఉన్నప్పుడు,మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు మీరే తనిఖీ చేసుకోవాలి.

చలి

చలి

డెంగ్యూ,మలేరియా,ఎబోలా జ్వరాల్లో చలిని ఒక సాధారణ లక్షణంగా చెప్పవచ్చు. అయితే,వారికి జ్వరం వచ్చినప్పుడు ఎబోలా వైరస్ సోకిన వ్యక్తులకు చలి ఎక్కువగా ఉంటుంది.

బాడీ పెయిన్స్

బాడీ పెయిన్స్

బాడీ పెయిన్స్ అనేవి జ్వరం మరియు ఫ్లూ యొక్క ఒక సాధారణ లక్షణం.అయితే,ఎబోలా జ్వరంలో బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు,మీ చర్మం కింద రక్తం పూలింగ్ ప్రారంభమవుతుంది.

మల విసర్జనలో రక్తం

మల విసర్జనలో రక్తం

మీ ప్రేగులు రక్తసిక్తం అవటం వలన మీ మల విసర్జనలో రక్తంను గమనించవచ్చు. అలాగే మహిళలు యోని రక్తస్రావాన్ని ఎదుర్కొంటారు.

దద్దుర్లు రక్తంతో నిండి ఉంటాయి

దద్దుర్లు రక్తంతో నిండి ఉంటాయి

మీ చర్మం బాధిస్తుంది మరియు దద్దుర్లు లోకి చీముతో కూడిన రక్తం ప్రవేశిస్తుంది. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి.

కళ్ళు, ముక్కు మరియు చెవుల బ్లీడింగ్

కళ్ళు, ముక్కు మరియు చెవుల బ్లీడింగ్

తరువాతి దశల్లో,ఎబోలా వలన కళ్ళు,ముక్కు మరియు చెవుల నుండి రక్తస్రావం జరిగి హెమోర్రేజిక్ దారితీస్తుంది.ఈ లక్షణాలకు చికిత్స లేకుంటే 3 నుంచి 4 వారాల తర్వాత ఇన్ఫెక్షన్ జరుగుతుంది.

చిగుళ్ళ నుండి బ్లీడింగ్

చిగుళ్ళ నుండి బ్లీడింగ్

ఎబోలా వైరస్ సోకినప్పుడు నోటి లోపల ఎరుపు మరియు చిగుళ్ళు నుండి రక్తస్రావం ఏర్పడుతుంది.

వాంతులు

వాంతులు

వికారం,వాంతులు మరియు నిర్జలీకరణం ఎబోలా జ్వరం యొక్క సాధారణ లక్షణాలు అని చెప్పవచ్చు. రోగి అతను లేదా ఆమె ఎక్కువగా వాంతులు అవుతుంటే ఎక్కువగా ద్రవాలు ఇవ్వవలసిన అవసరం ఉంది.

హై జ్వరం ఎక్కువ రోజులు ఉంటే

హై జ్వరం ఎక్కువ రోజులు ఉంటే

హై జ్వరం ఎక్కువ రోజులు ఉంటే ప్రమాదకరం. మీకు హై జ్వరం వారం రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే ఎబోలా పరీక్ష చేయించుకోవలసిన అవసరం ఉంది.

Desktop Bottom Promotion