For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే విటమిన్స్ ఫుడ్స్

|

వర్షాకాలంలో చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధినిరోధకత తగ్గడంతో వివిధ చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. కాబట్టి, వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి విటమిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకత పెంచుతుంది . దాంతో శరీరంలో హానికరమై బ్యాక్టీరియాను నివారించుకోవచ్చు.

READ MORE: గొంతునొప్పి-ఇన్ఫెక్షన్స్ నివారణకు ఉత్తమ చిట్కాలు

వర్షాకాలంలో ఎక్కువగా జలుబు మరియు ఫ్లూ వంటి జబ్బులకు కారణం అవుతుంది. వర్షకాలంలో జలుబు మరియు దగ్గు ఎంత త్వరగా వస్తాయో.. అంతే త్వరగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి . ఇలా వర్షాకాలంలో వైరస్ వల్ల వచ్చే జలుబు మరియు దగ్గును హోం రెమెడీస్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే జలుబు మరియు ఫ్లూ వస్తుందో..అప్పుడు ముందుగా ప్రభావితం అయ్యేది గొంతు నొప్పిని చాలా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

READ MORE: గొంతు నొప్పి నివారణకు తక్షణ ఉపశమనం ఇచ్చే ఆహారాలు...!

గొంతు నొప్పిని నివారించడానికి కొన్ని బెస్ట్ ఫుడ్స్ ను ఈ క్రింది లిస్ట్ లో ఇవ్వడం జరిగింది. ఈ ఫుడ్స్ లో యాంటీఇన్ఫ్లమేషన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గొంతు నొప్పి మరియు వాపును తగ్గిస్తుంది. మరి గొంతు నొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

ఎగ్ వైట్:

ఎగ్ వైట్:

గొంతునొప్పి నివారించడంలో ఎగ్ వైట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే, ఎగ్ వైట్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి . వ్యాధినిరోధకత తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్స్ సహాయపడుతాయి.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసం అసిడిక్ ఆమ్లం కలిగి ఉంటుంది. ఇది గొంతునొప్పి తగ్గించడానికి చాలా సింపుల్ అండ్ బెస్ట్ హోం రెమెడీ. నిమ్మరసంకు తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో విటమిన్ సి, పొటాషియం, బి12 మరియు సోడియం కలిగి ఉండటం వల్ల గొంతునొప్పిని తగ్గిస్తుంది. అరటిపండ్లు మింగడానికి కూడా చాలా స్మూత్ గా ఉండటం వల్ల ఎలాంటి సమస్య ఉండదు.

 గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గొంతు నొప్పి ఉన్నప్పుడు గొంతులో ఇరిటేషన్ ఉంటుంది. ఈ ఇరిటేషన్ తగ్గించాలనుకుంటే గ్రీన్ టీని తీసుకోవాలి. గ్రీన్ టీకి కొద్దిగా తేనె మరియు దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. గ్రీన్ టీకి కొద్దిగా తేనె మరియు దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి త్రాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

సూప్స్:

సూప్స్:

గొంతునొప్పి తగ్గించడంలో సూప్స్ ఒక బెస్ట్ హోం రెమెడీ. గొంతులో చేరిన గల్ల మరియు వైరస్ ను నివారించడంలో మరియు గొంతునొప్పిని తగ్గించడంలో మరియు ఉపశమనం కలిగించడంలో చాల గ్రేట్ గా సహాయపడుతుంది.

 ఫైబర్ ఫుడ్స్:

ఫైబర్ ఫుడ్స్:

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాల్లో ఓట్స్ ఒకటి. ఓట్స్ చాలా మెత్తగా ఉండటం వల్ల మ్రింగడానికి చాలా సులభం అవుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఓట్స్ ను చేర్చుకోవడం వల్ల గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

 సేజ్:

సేజ్:

సేజ్ లో ఆక్సిజెన్ , ఎంజైమ్స్, ఫ్లెవనాయిడ్స్, మరియు ఫినోలిక్ యాసిడ్స్, పుష్కలంగా ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా సహాయపడుతాయి. కాబట్టి, గొంతు నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. గొంతునొప్పి తగ్గించుకోవడానికి తప్పనిసరిగా తీసుకోవల్సినటువంటి ఆహారం.

బాయిల్డ్ వెజిటేబుల్స్:

బాయిల్డ్ వెజిటేబుల్స్:

ఉడికించిన వెజిటేబుల్స్ మరియు ఆవిరిలో ఉడికించిన వెజిటేబుల్స్ గొంతు నొప్పి తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి . వీటిని మెత్తగా ఉండికించడం వల్ల మ్రింగేటప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.

సాప్ట్ ఫుడ్స్:

సాప్ట్ ఫుడ్స్:

గొంతు నొప్పి ఉన్నప్పుడు సాప్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. ధాన్యాలు మరియు సాప్ట్ ఫుడ్స్ లో న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది.

వాటర్:

వాటర్:

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ వల్ల గొంతునొప్పి ఎక్కువగా ఉండే దగ్గకు కారణం అవుతుంది. సమస్య నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . గోరువెచ్చని నీటితో రోజంతా త్రాగడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు.

English summary

10 Foods That Heal A Sore Throat: Health Tips in Telugu

The monsoon season is one of the many reasons for diseases thriving in the city and rural areas. The best way to keep diseases at bay is to consume foods that are high in vitamins, to help boost the immunity and thus kill the harmful bacteria.
Story first published: Friday, July 3, 2015, 18:11 [IST]
Desktop Bottom Promotion