For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టొమక్ అల్సర్ లేదా పెప్టిక్ అల్సర్ కు ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

ఈ మధ్యకాలంలో చాలా మంది స్టొమక్ అల్సర్ తో బాధపడుతున్నారు. నిత్యజీవితంలో వేధించే ఆరోగ్య సమస్యల్లో స్టొమక్ అల్సర్ కూడా ఒక సాధారణ సమస్యగా ఉన్నది. ఈ పెప్టిక్ అల్సర్ ప్రేగుల్లో పుళ్ళు లేదా జీర్ణవాహికలో కోతలా ఏర్పడుతుంది. ఈ బాధాకరమైన పుళ్ళు లేదా ప్రేగులో రాషెష్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల , బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, వ్యాధినిరోధక అసాధారణతలు మరియు ఆస్పిరిన్ మరియు ఐబ్రూఫిన్ వంటి కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కూడా ప్రేగులో పుళ్ళు ఏర్పడుటకు కారణం అవుతుంది.

READ MORE: అల్సర్ కు ఉపశమనం కలిగించే అత్యుత్తమ ఆహారాలు!
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం జీర్ణ ద్రవాల్లో హైడ్రోలిక్ యాసిడ్స్ మరియు పొట్టలోని పెప్సిన్ ఎంజైమ్స్ వల్ల జీర్ణవాహిక పాడవుతుంది. కాబట్టి ఈ బాధాకరమైన పెప్టిక్ అల్సర్ ను నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ మనకు అందుబాటులో ఉన్నాయి.

ఈ స్టొమక్ అల్సర్ నే గ్యాస్ట్రిక్ అల్సర్ అని కూడా అంటారు. మరియు ఇది ఆంత్రమూలంలో ఏర్పడి ఆంత్రమూలం మొత్తం విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని ఆంత్రమూలం పుండు అంటారు. గ్యాస్ట్రిక్ మరియు ఆంత్రమూలం పుండు రెండింటిని కలిపి పెప్టిక్ అల్సర్ అంటారు.

READ MORE: మౌత్ అలర్స్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే సులభ చిట్కాలు

మరి ఈ బాధాకరమైన సమస్యకు కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి....

మెంతి ఆకులు:

మెంతి ఆకులు:

బాధాకరమైన పెక్టిక్ అల్సర్ ను నివారించుకోవడం కోసం, నీటిలో కొద్దిగా శుభ్రం చేసిన మెంతి ఆకలును వేసి, మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఆ నీటిని గ్లాసులో వడగట్టుకొని, కొద్దిగా ఉప్పు వేసి గోరువెచ్చగా తీసుకోవాలి. ఈ మెంతి వాటర్ ను రోజులో రెండు సార్లు త్రాగినట్లైతే మీ పొట్టను సమస్యలను అదే విధంగా పెప్టిక్ అల్సర్ ను నయం చేస్తుంది.

 క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజ్ జ్యూస్ పొట్ట లైనింగ్ సమస్యలను నయం చేస్తుంది మరియు స్టొమక్ అల్సర్ ను చాలా నేచురల్ గా తగ్గిస్తుంది . ఈ క్యాబేజ్ జ్యూస్ లేదా క్యాబేజ్ సూప్ ను ప్రతి రోజూ నిద్రించడానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

స్టొమక్ అల్సర్ ను నివారించడంలో అరటిపండ్లు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి . ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం ఉండటం వల్ల స్టొమక్ అల్సర్ పెరగకుండా నేచరల్ గా నయం చేస్తుంది.

తేనె:

తేనె:

స్టొమక్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో తేనె గ్రేట్ గా సహాయపడుతుంది . తేనె ఇతర వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అందువల్ల ఒక టేబుల్ స్పూన్ రా హనీ ని బ్రేక్ ఫాస్ట్ తినకముందే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గార్లిక్:

గార్లిక్:

స్టొమక్ అల్సర్ తో బాధపడుతున్నట్లైతే, మీ రెగ్యులర్ మీల్స్ లో తప్పని సరిగా వెల్లుల్లిని చేర్చుకోవాలి. ఇది పొట్ట యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది దాంతో పెప్టిక్ అల్సర్ ను తగ్గిస్తుంది.

పెప్పర్స్:

పెప్పర్స్:

హాట్ పెప్పర్స్ అల్సర్ కు కారణం అయ్యే వాటిని నివారిస్తుంది. మరియు అల్సర్ ను నివారిస్తుంది. హాట్ పెప్పర్ ను వంటల్లో మిక్స్ చేసి తీసుకొన్నప్పుడు పొట్టలోపలిబాగంలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. పెప్టిక్ అల్సర్ కు ఇది ఒక సమర్థవంతమైన హోం రెమెడీ.

విటమిన్ ఇ ఫుడ్స్:

విటమిన్ ఇ ఫుడ్స్:

స్టొమక్ అల్సర్ ను నివారించడంలో విటమిన్ ఇ ఉన్న ఆహారాలు చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. విటమిన్ ఇ అధికంగా ఉండే బాదం మరియు ఫిష్ వంటి ఆహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి.

కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్ పొట్టను చల్లబరుస్తుంది, ముఖ్యంగా అల్సర్ కు ఇన్ఫెక్ట్ అయినప్పుడు చాలా స్మూత్ గా చల్లబరుస్తుంది. కోకనట్ వాటర్లో ఉండే మినిరల్స్ పొట్టసమస్యలు మరియు పొట్ట ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి, మీరు తయారుచేసే వంటకాల్లో కొబ్బరి నూనె లేదా వెజిటేబుల్ ఆయిల్ ను మిక్స్ చేయాలి.

ఫ్రెష్ జ్యూస్:

ఫ్రెష్ జ్యూస్:

పెప్టిక్ అల్సర్ ను నేచురల్ గా తగ్గించడానికి ఫ్రెష్ జ్యూసులు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి . ఆరెంజ్, స్వీట్ లెమన్ మరియు గ్రేప్స్ జ్యూస్ లు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

Ten Home Remedies For Stomach Ulcers Or Peptic Ulcer: Health Tips in Telugu

Ten Home Remedies For Stomach Ulcers Or Peptic Ulcer: Health Tips in Telugu. Stomach ulcers is a common problem faced by many. These peptic ulcers is open sores or erosion on the gastrointestinal tract.
Story first published: Friday, July 17, 2015, 15:43 [IST]
Desktop Bottom Promotion