For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పులిపిర్లను మాయం చేసే 10 ఉత్తమ హోం రెమెడీస్

|

పులిపిర్లు ఒక విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ వలన వస్తాయి. అయితే వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతివారిలోనూ వస్తాయని చెప్పలేం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి లోనై రోగనిరోధక శక్తి లోపించినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే పులిపిర్లు వస్తాయి. సాధారణంగా పులిపిర్లతో ఏ సమస్య ఉండదు కాని కొన్నిసార్లు నొప్పి, దురద, రక్తం కారటం వంటి ఇబ్బందులు ఉండవచ్చు. పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వలన మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ మెడికేషన్ ద్వారానే పులిపిర్లను పూర్తిగా తగ్గించటం మంచిది.

పులిపిర్లు చర్మంలో ఏ భాగంలోనైనా రావచ్చు. వీటి సంఖ్య, పరిమాణాన్ని బట్టి చికిత్స చేస్తుంటారు. చాలా వరకు పుటిపిర్లు చిన్న చిన్న పొక్కులగా చర్మం రంగులో కలిసి పెరుగుతుంటాయి. ఒక్కోసారి నొప్పి, అసౌకర్యంగా కూడా కలుగుతుంది. వీటికి స్పర్శ కూడా తక్కువే. ఇవి సాధారణంగా ఒరిపిడికి గురయ్యే చోట ఎక్కువగా పెరుగుతాయి. ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువ. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటిని నయం చేయడం కొంచెం కష్టమే. అయితే కొన్ని హోం రెమెడీస్ ద్వారా వీటిని నయం చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెంచి, పులిపుర్లు మాడిపోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం....

బేకింగ్ పౌడర్ :

బేకింగ్ పౌడర్ :

బేకింగ్ పౌడర్ మరియు ఆముదం నూనెను బౌల్లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని పులిపుర్లు ఉన్న చోట అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. ఇది అప్లై చేసిన తర్వాత బ్యాండేజ్ చుట్టాలి. తగ్గే వరకూ ఇలా చేస్తుంటే, తప్పకుండా మార్పు వస్తుంది.

వెల్లుల్లి రెబ్బ:

వెల్లుల్లి రెబ్బ:

పులిపుర్లను నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది ఒక ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, అయితే, ఈ హోం రెమెడీతో పులిపుర్లను నివారించడం కొంత సమయం తీసుకుంటుంది.

విటమిన్ ఇ:

విటమిన్ ఇ:

విటమిన్ క్యాప్స్యూల్ ను బ్రేక్ చేసి,పులిపుర్ల మీద మర్దన చేయాలి . తర్వాత బ్యాండేజ్ ను చుట్టాలి. రాత్రుల్లో ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరియు ఉదయం కూడా అప్లై చేయవచ్చు.

ఆముదం:

ఆముదం:

పులిపుర్లను నివారించడంలో ఆముదం చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా ముఖం, చేతుల మీద ఉండే చాలా చిన్నని మరియు చదరంగా ఉండే పులిపుర్లను నివారించడానికి ఆముదం గ్రేట్ గా సహాయపడుతుంది . కాటన్ బాల్స్ ను ఆముదంలో డిప్ చేసిన పులిపుర్ల మీద అప్లై చేయాలి.

క్యారెట్స్:

క్యారెట్స్:

క్యారెట్ తురుములో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను పులిపుర్ల మీద అప్లై చేయాలి . అరగంట ఉండనిచ్చి తర్వాత తొలగించాలి. ఇలా వారం రోజులు, రోజువిడిచి రోజు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఫిగ్ మాస్క్:

ఫిగ్ మాస్క్:

పులిపిర్లను నివారించడంలో ఫిగ్ మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. తాజాగా ఉండే ఫిగ్ ను మెత్తగా పేస్ట్ చేసి దీన్ని పులిపిర్లమీద అప్లై చేసి, అరగంట తర్వాత వాష్ చేయాలి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడాను నీటిలో వేసి కరిగిన తర్వాత ఆ నీటితో పులిపిర్లను కడగాలి. తర్వాత పొడి వస్త్రం లేదా టిష్యుతో శుభ్రం చేయాలి.

కలబంద:

కలబంద:

తాజాగా ఉండే అలోవెర జెల్ ను పులిపిర్ల మీద అప్లై చేయాలి. తర్వాత బ్యాడేజ్ చుట్టాలి . పులిపుర్లు తగ్గే వరకూ దీన్ని అప్లై చేయవచ్చు.

హెర్బ్స్:

హెర్బ్స్:

మీ రెగ్యులర్ డైట్ లో హెర్బ్స్ ను జోడించాలి . ఇది మీలో వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో ఎటువంటి వైరస్ లేకుండా నిరోధిస్తుంది. వ్యాదినిరోధకతను పంచుకోవడం ఒక ఉత్తమ పరిష్కార మార్గం.

 నిమ్మరసం:

నిమ్మరసం:

సిట్రిక్ యాసిడ్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండే ఎఫెక్టివ్ ఏజెంట్ నిమ్మ. దీన్ని పులిపిర్ల మీద అప్లై చేసినప్పుడు పులిపిర్లు మాయం అవుతాయి. నిమ్మరసం అప్లై చేసి తర్వాత ఉల్లిపాయ ముక్కను పెట్టాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

10 Home Remedies For Warts

Bed time stories always refer witches with a wart on their face. But, do we humans get warts? Of course, yes! Warts are caused by the human papillomavirus (HPV) and it is found that there are more than 60 varieties of it. Skin-to-skin contact is the common way of contracting this disease.
Desktop Bottom Promotion