For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలతిరుగుడు, మైకముకు సింపుల్ హోం రెమెడీస్

By Super
|

జీవితంలో ఏదో ఒక సందర్భంలో మైకంగా అనిపించడం వంటి లక్షణాలను ప్రతి ఒక్కరూ అనుభం కలిగి ఉంటారు. దీన్నే తలతిరగడం (డీజినెస్)అంటారు. శరీరం లేదా మనస్సు బ్యాలెన్స్ (సమతౌల్యంను)కోల్పోయినప్పుడు ఇలా జరగడం సహజం అయితే ఇది వ్యాధి మాత్రం కాదు.

ఇది లోబ్లడ్ ప్రెజర్, డీహైడ్రేషన్, మైగ్రేన్ తలనొప్పి, ఆందోళన వంటి డిజార్డర్స్ వల్ల కలిగే లక్షణాలు, అలాగే తలకు గాయాలు తగిలినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి.

మరి ఈ డిజీనెస్(తలతిరగుడు) నుండి ఉపశమనం పొందాలంటే, ఇక్కడ కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ను మీకోసం అందిస్తున్నాము . వీటిని లక్షణాలు కనబడిన వెంటనే తీసుకొన్నట్లైతే వెంటనే ఉపశమనం కలుగుతుంది . ఈ సింపుల్ హోం రెమెడీస్ మన వంటగదిలోనే చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. అల్లం, నిమ్మరసం మరియు మరికొన్ని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు ఇందుకు గ్రేట్ గా సహాయపడుతాయి. తల తిరగడం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.

READ MORE:హై బిపి ఉన్నప్పుడు, ఉప్పుకు బదులు ఈ ఆహారాలు తినండి..

ఈ హోం రెమెడీస్ తో పాటు, తలతిరిగినట్లు అనిపించినప్పుడు, లోతుగా శ్వాస పీల్చి, వదలడం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే, మీకు తలతిరగడం వంటి లక్షణాలు దూరం అవుతాయి. అలాగే హెల్తీ ఫుడ్స్ తినడం, యోగ మరియు మెడిటేషన్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా స్మోకింగ్ మరియు మద్యం తీసుకోవడం వల్ల చెడు అలవాట్లును వెంటనే మానేయడం మంచిది. లేదంటే పరిస్థితి మరింతి తీవ్రతరం చేస్తుంది. READ MORE:ఉప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని అనర్ధాలో...

తలతిరగడానికి తక్షణ ఉపశమనం కలిగించే కొన్ని హోం రెమెడీస్ :

శ్వాసను లోతుగా తీసుకొని వదలాలి:

శ్వాసను లోతుగా తీసుకొని వదలాలి:

మైకంగా, తల తేలికగా అగుపిస్తుంటే, ఒక నిముషం కూర్చొని , విశ్రాంతిగా తీసుకోవాలి. మరియు డీప్ బ్రీత్ తీసుకోవాలి. తలతిరగడం నివారించడానికి డీప్ బ్రీత్ తీసుకోవడం ఒక ఉత్తమ హోం రెమెడీ. ఇది బ్రెయిన్ కు కావల్సినంత ఆక్సిజన్ ను అందిస్తుంది. దాంతో మైకం తగ్గుతుంది.

నీరు త్రాగాలి:

నీరు త్రాగాలి:

డీహైడ్రేషన్ కూడా తలతిరగడానికి ఒక ప్రదాణ కారణం. ముఖ్యంగా వేసవి సీజన్ లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఇలాంటి అసమతౌల్య సమస్యను నివారించుకోవచ్చు. ఇది మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది.

అల్లం

అల్లం

తలతిరగడానికి ఒక ఉత్తమ హోం రెమెడీ అల్లం. ఇది బ్రెయిన్ కు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. అల్లం కూడా మైకము తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇలాంటి లక్షణాలతో పోరాడుతుంది, మనిషిలో వ్యాధినిరోధకతను పెంచుతుంది. తగినంత ఎనర్జీని అందిస్తుంది. తలతిరగడం నివారించడానికి నిమ్మరసం ఒక ఉత్తమ హోం రెమెడీ.

ఆమ్లా:

ఆమ్లా:

తలతిరగడం నివారించడంలో మరో ఉత్తమ హోం రెమెడీ ఉసిరికాయ. ఆమ్లా లేదా ఉసిరికాయలో విటమిన్ సి మరియు ఎ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది . వ్యాధినిరోధకతను పెంచుతుంది . తలతిరుగుతున్నట్లు అనిపించినప్పుడు, ఉసిరికాయతో చేసిన పికెల్ లేదా ఫ్రెష్ గా ఉన్న ఉసిరికాయను నమలాలి.

తేనె

తేనె

తేనె తక్షణం ఎనర్జీని అందించే ఒక ఇన్ స్టాంట్ హోం రెమెడీ. అంతే కాదు ఇది తలతిరుగుడును కూడా నివారించడంలో గొప్పది. ఈ హోం రెమెడీ లెమన్ వాటర్ లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ తో మిక్స్ చేసి తీసుకోవాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

తలతిరగడం నివారించడానికి మరో ఉత్తమ హోం రెమెడీ వెల్లుల్లి. తలతిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఒక వెల్లుల్లి రెబ్బను నమిలి నాలుక క్రింది బాగంలో ఉంచుకోవాలి. ఇలా చేస్తే తలతిరుగుడు నుండి ఉపశమనం పొందవచ్చు.

అలోవెరె

అలోవెరె

అలోవెరా జ్యూస్ ను రోజుకు ఒకసారి తీసుకోవచ్చు. ఈ సమస్యకు మీరు తరచూ గురి అవుతుంటే, ఈ అలోవెరా జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెరా వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు ఎనర్జీని అందిస్తుంది.

 ఆరోగ్యమైన ఆహారాలు తీసుకోవాలి:

ఆరోగ్యమైన ఆహారాలు తీసుకోవాలి:

తలతిరగడానికి ఇది ఒక సింపుల్ హోం రెమెడీ. హెల్తీ ఫుడ్స్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీ డైలీ డైట్ లో చేర్చుకోవాలి. ఇది బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. సమస్యను నివారిస్తుంది

ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి

ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి

బాదం, ఆకుకూరలు,నట్స్, లివర్, టోఫు, ఖర్జూరాలు వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తలతిరిగే సమస్యను దూరం చేసుకోవచ్చు.

English summary

10 Simple Home Remedies For Dizziness

At some point of time in life, we all experience a feeling of light-headedness accompanied with a loss of balance. This feeling is called dizziness or many would say, giddiness. This imbalance is not a disease.
Desktop Bottom Promotion