For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

25ఏళ్ళలోపు జుట్టు రాలడానికి గల ముఖ్యమైన ఆరోగ్య కారణాలు

|

పెద్దవారిలో 25ఏళ్ళ కంటే తక్కువ వయస్సున్న వారిలో ఒత్తిడి, మంచి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం., క్కువ మందులు వాడటం వంటివి జుట్టు రాలడానికి ముఖ్యమైన కారణాలు. మీరు స్నానం చేసేప్పుడు ఎక్కువగా జుట్టు చేతిలోకి ఊడి వస్తున్నా, లేదా తల దువ్వే టప్పుడు ఎక్కువ జుట్టు రాలుతున్నా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొనే సమయం వచ్చిందని గమనించండి.

జుట్టు రాలే సమస్యను గుర్తించి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాలిపోయిన జుట్టు తిరిగి పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా హెయిర్ ఫాల్ కంట్రోల్ కాకపోతే వెంటనే ఎక్స్ పర్ట్స్ ను కలవండి.

READ MORE: జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు

ఈ రోజుల్లో, మన జీవితాల్లో ఒత్తిడి ప్రధాన సమస్యగా ఉంది . ఒత్తిడిని నుండి బయటపడలేక పోతున్నారు. దాంతో చివరకు అనేక ఆరోగ్య సమస్యలు, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం స్థికి కూడా చేరుకుంటున్నారు. కాబట్టి, మన ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది ఒత్తిడి, అనారోగ్యానికి గురి చేయడంతో పాటు, జుట్టు రాలడానికి ముఖ్య కారణం అవుతోంది ఒత్తిడి. కాబట్టి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

READ MORE: పురుషుల్లో జుట్టు రాలడం నివారించే 11 నేచురల్ మార్గాలు

చిన్న వయస్సులో 25 ఏళ్ళ లోపు ఉన్నవారిలో విపరీతంగా జుట్టు రాలడానికి 13 కారణాలున్నాయి. కారణాలు తెలుసుకొని వెంటనే పరిష్కరించుకోవాలి.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడి సైలెంట్ కిల్లర్. 25ఏళ్ళలోపు జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడి వల్ల ప్రతి ఒక్క యవ్వనస్తుల్లో టాలోజెన్ ఎఫ్ల్యువిమ్ అనే ఎంజైమ్ జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి ఒత్తిడి పెంచుకోకుండా... ప్రశాంతంగా జీవించాలి.

ప్రెగ్నెన్సీ :

ప్రెగ్నెన్సీ :

గర్భధారణ సమయంలో ప్రతి మహిళలోనూ జుట్టు రాలే సమస్యలున్నాయి. ఇది ఒక చిహ్నాంగా గుర్తించాలి. జుట్టు ఎంత ఎక్కువగా రాలుతుంది మరియు ఎంత వేగంగా రాలుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి. మూడు నెలల తర్వాత కూడా జుట్టు రాలిపోతుంటుంది స్పెషలిస్ట్ ను తప్పకుండా సంప్రదించాలి.

విటమిన్ ఎ

విటమిన్ ఎ

ఎప్పుడైతే శరీరంలో విటమిన్స్ తక్కువైతాయో అప్పుడు శరీరంలో కనిపించే ఒకటి రెండు లక్షణాలు జుట్టు రాలడానికి ముఖ్య కారణాలు. 25ఏళ్ళలోపు అకస్మాత్తుగా ఎక్కువ జుట్టు రాలుతున్నట్లైతే . ఖచ్చితంగా విటమిన్ టెస్ట్ చేయించుకోవాలి.

ప్రోటీన్ల లోపం:

ప్రోటీన్ల లోపం:

ప్రోటీన్లు మన శరరీంను ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. మీ శరీరంలో ప్రోటీన్ల లోపం ఉంటుంది. క్రమంగా హెయిర్ ఫాల్ పెరుగుతుంది. కాబట్టి, డైలీ డైట్ ద్వారా ప్రోటీన్లను శరీరానికి అందివ్వడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

హెరిడిటి

హెరిడిటి

25ఏళ్ళలోపు ఉన్న వారిలో జుట్టు ఎక్కువగా రాలుతుంటే అది జన్యుపరమైన సమస్యలు అయ్యుండవచ్చు. అయితే ఈ సమస్య చాలా రేర్ గా ఉంటుంది. 1-50లో మాత్రమే కనుగొనవచ్చు.

హర్మోన్స్ లోపం

హర్మోన్స్ లోపం

హార్మోనుల అసమతుల్యత వల్ల జీవక్రియలు దెబ్బతినడంతో పాటు, జుట్టుకూడా ఎక్కువగా రాలుతుంది. 25ఏళ్ళలోపు ఎక్కువ జుట్టు రాలుతున్నట్లైతే అందుకు హార్మోనులు కూడా ప్రధాణ కారణం. జుట్టు రాలడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

అనీమియా

అనీమియా

ఐరన్ లోపం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తుంది. . శరీరంలో ఐరన్ తక్కువైనప్పుడు, శరీరం చాలా డిఫరెంట్ గా పనిచేస్తుంది. జుట్టు రాలడం మాత్రమే కాదు, చర్మం పెళుసుగా మారుతుంది, బలహీనత మరియు తలనొప్పి మరికొన్ని లక్షణాలు కనబడుతాయి.

థైరాయిడ్

థైరాయిడ్

జుట్టు రాలిపోడానికి మరో ముఖ్య కారణం థైరాయిడ్. కండరాల నొప్పులు, బరువు పెరగడం మరియు ఇతర లక్షణాలతో పాటు జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

విటమిన్ బి లోపం

విటమిన్ బి లోపం

శరీరంలో విటమిన్ బి లోపం ఏర్పడినప్పుడు మీరు జుట్టును కోల్పోతారు. శరీరం యాక్టివ్ గా ఉండటానికి విటమిన్ బి ముఖ్య పాత్రపోషిస్తుంది. ఇంకా విటమిన్ బి రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషఫన్ కు అవసరం అవుతుంది. గుడ్లు, వెజిటేబుల్స్, చేపలు మరియు చేపలు తినడం వల్ల విటమిన్ లెవల్స్ పెరుగుతాయి.

బరువు తగ్గడం:

బరువు తగ్గడం:

రెగ్యులర్ డైట్ తో పాటు కొన్ని ఎఫెక్టివ్ వ్యాయామాలు చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . ముఖ్యంగా హెయిర్ ఫాల్ ఉండదు. అయితే చాలా మంది ఈ విషయాన్ని నమ్మరు. 25ఏళ్ళ లోపు బరువు తగ్గడం వల్ల జుట్టును కోల్పోతారు.

పిసిఓడి

పిసిఓడి

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రో ప్రతి 10మందిలో 4గురికి ఈ సమస్య ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫేషియల్ హెయిర్ గ్రోత్ మరియు బరువు పెరగడం, హెయిర్ ఫాల్ కూడా మరో చిహ్నం.

మెడికేషన్స్:

మెడికేషన్స్:

కొన్ని రకాల మందులు కూడా జుట్టు రాలడానికి ప్రధాణ కారణం. బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ను ఉపయోగించే వారు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటారు.

English summary

13 Health Reasons For Loss Of Hair Under 25

Stress, wrong diet, lack of exercise, heavy medications are some of the major health reasons for the loss of hair in adults who are less than 25. If you are witnessing a bunch of strands loosen in your hand while taking a shower or while combing, it is something to worry about.
Desktop Bottom Promotion