For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచే అత్యుత్తమ ఆహారాలు

|

హెమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో ఉంటుంది. ఇది ప్రధానంగా ఇనుముతో కలిసి ఉంటుంది. హెమోగ్లోబిన్, ఊపిరితిత్తుల నుండి శరీర కణజాలానికి ఆక్సిజన్ మోసుకెళ్ళే బాధ్యత నిర్వర్తిస్తుంది. ఇది శరీర కణజాలం నుండి కార్బన్ డయాక్సైడ్ ను ఊపిరితిత్తులకు చేరవేస్తుంది.

హెమోగ్లోబిన్ ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి చాలా ముఖ్యం. రక్తంలో దీని కొరత వలన రక్తహీనతకు దారితీస్తుంది. ఇనుము, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సి మరియు విటమిన్ B12 ఉన్న పోషకాహారం తీసుకోకపోవటం వలన హెమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడానికి దారితీస్తుంది.

అలసట, బలహీనత, శ్వాస, మైకము, తలనొప్పి మరియు చర్మం పలుచగా అవటం వంటివి హెమోగ్లోబిన్ తక్కువ స్థాయి లక్షణాలు. హెమోగ్లోబిన్ స్థాయి ఎలా పెంచాలి? హెమోగ్లోబిన్ స్థాయి పెంచడానికి కొన్ని గృహనివారణోపాయాలు ఉన్నాయి. వాటిని చూడండి.

నేడు, బోల్ద్స్కి హెమోగ్లోబిన్ స్థాయిలు పెంచడానికి కొన్ని ప్రభావవంతమైన గృహనివారణోపాయాలను మీతో పంచుకుంటుంది.

ఐరన్-రిచ్ ఫుడ్స్ (కూరగాయలు)

ఐరన్-రిచ్ ఫుడ్స్ (కూరగాయలు)

మీరు పాలకూర మరియు మెంతి ఆకులు వంటి ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన హెమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇవి తీసుకోవటం వలన శరీరానికి మంచి ఇనుము సరఫరా అయి, హెమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం అన్నది హెమోగ్లోబిన్ స్థాయి పెంచడానికి సమర్థవంతమైన గృహవైద్య చిట్కాలలో ఒకటి.

చిక్కుళ్ళు

చిక్కుళ్ళు

అన్ని రకాల చిక్కుళ్ళలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. చిక్కుళ్ళలో సోయా గింజలు, ఎరుపు రంగు కిడ్నీ బీన్స్, చిక్పీస్, బ్లాక్-ఐడ్ పీస్, బ్లాక్ బీన్స్, పప్పులు, మూత్రపిండాల బీన్స్ మొదలైన రకాలు ఉన్నాయి. మీ రోజువారీ ఆహారంలో చిక్కుళ్ళు తీసుకోవటం అలవాటు చేసుకుంటే, హెమోగ్లోబిన్ లో ఇనుము స్థాయి మెరుగు అవుతుంది.

బీట్రూట్

బీట్రూట్

బీట్రూట్ ఐరన్ కు ఒక గొప్ప మూలం వంటిది. మీరు బీట్రూట్ ను సలాడ్లు, బీట్రూట్ రసం వంటి వివిధ రూపాల్లో తినవచ్చు లేదా బీట్రూట్ ఒక తీపి వంటకంలాగా కూడా తయారు చేసుకుని తీసుకోవొచ్చు . బీట్రూట్, హెమోగ్లోబిన్ స్థాయి పెంచడానికి ఒక ప్రభావవంతమైన గృహనివారణోపాయాలలో ఒకటి.

పుచ్చకాయ

పుచ్చకాయ

పుచ్చకాయలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ సి మరియు విటమిన్ బి అధిక స్థాయిలలో ఉన్నాయి. ప్రతిరోజూ ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవటం వలన అధిక స్థాయిలలో ఇనుము పెరుగుతుంది. ఈ పండు మీ శరీరానికి బలం మరియు శక్తిని అందిస్తుంది.

విటమిన్ సి

విటమిన్ సి

విటమిన్ సి ఆహారాల నుండి శరీరానికి ఇనుమును అందించటంలో సహాయపడుతుంది. అందువలన మీ ఆహారంలో తగినంత విటమిన్ సి లేకుండా, ఆహారం నుండి ఇనుము బాగా అందదు. విటమిన్ సి, అన్ని సిట్రస్ పండ్లు, బొప్పాయి, నారింజ, స్ట్రాబెర్రీలు మరియు ద్రాక్షలలో అధికంగా ఉంటుంది. కాప్సికం, బ్రోకలీ, క్యాబేజీ, టమోటాలు మరియు పాలకూర వంటి కూరగాయలలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది.

ఎర్రటి మాంసం

ఎర్రటి మాంసం

హెమోగ్లోబిన్ స్థాయి ఎలా పెంచాలి? ఎర్రటి మాంసంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఎర్రటి మాంసం, మొక్కల మూలాలతో పోలిస్తే సులభంగా ఇనుమును గ్రహిస్తుంది. బీఫ్, మటన్, పిల్ల కాలేయం, చికెన్ కాలేయం వంటివాటిలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది హేమోగ్లోబిన్ పెంచే ఉత్తమ ఆహారాలలో ఒకటి.

ఎండిన మూలికలు

ఎండిన మూలికలు

మీ ఆహారంలో కొత్తిమీర, పూదిన, తులసి, చెర్విల్ , ఎండిన పార్స్లీ, బే ఆకు వంటి ఎండిన మూలికలను జోడించటం వలన హెమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఎల్లప్పుడూ మీ ఆహారంలో ఈ ఎండిన మూలికలను జోడించండి. ఇవి ఇనుము అందించడమే కాకుండా మీ ఆహారానికి మంచి రుచిని అందిస్తాయి.

గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడికాయ విత్తనాలు

వీటిలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు జింక్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మీరు వాటిని విడిగా కుడా తీసుకోవొచ్చు లేదా సలాడ్ తో కూడా కలిపి తీసుకోవొచ్చు.

విటమిన్ B12

విటమిన్ B12

విటమిన్ B12 హిమోగ్లోబిన్ స్థాయి పెంచదానికి చాలా అవసరం. మీరు విటమిన్ B12 మరియు ఫోలేట్ యొక్క తగినంత మొత్తంలో కలిగి ఉన్న ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. మాంసం మరియు గుడ్లలో విటమిన్ B12 చాలా ఎక్కువగా ఉంటుంది.

సీఫుడ్

సీఫుడ్

సీఫుడ్, హెమోగ్లోబిన్ ఉన్న ఒక అద్భుతమైన మూలం. తున , క్లామ్స్, క్యాట్పిష్, సాల్మొన్, గుల్లలు మరియు సర్డైన్స్ వంటి సముద్ర ఆహారాలలో హెమోగ్లోబిన్ సమృద్ధిగా లభిస్తుంది. హెమోగ్లోబిన్ పెంచే ఆహారాలలో సీఫుడ్ కూడా ఉన్నది.

డైరీ ఉత్పత్తులు

డైరీ ఉత్పత్తులు

పాలు, మజ్జిగ, జున్ను మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తుల వంటివాటిలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది మరియు హెమోగ్లోబిన్ స్థాయిలు పెరుగటంలో సాయపడే మంచి వనరులు.

ద్రాక్ష

ద్రాక్ష

మీరు హెమోగ్లోబిన్ స్థాయిని ఎలా పెంచుకోగలరు? ద్రాక్ష ఇనుము పుష్కలంగా లభించే ఒక అద్భుతమైన మూలం, ముఖ్యంగా నల్ల ద్రాక్ష. మీరు మీ హెమోగ్లోబిన్ స్థాయిల పెరుగుదల కోసం తీసుకునే ఇతర పండ్లతో ద్రాక్ష చేర్చుకోవటం మర్చిపోకండి.

డ్రై పండ్లు

డ్రై పండ్లు

ఆప్రికాట్లు, ప్రూనే, డేట్స్ మరియు రైసిన్స్ వంటి ఎండిన పండ్లు వంటివి హెమోగ్లోబిన్ లభించే అద్భుతమైన వనరులు. ఎండిన పండ్లలో అదికంగా ఉన్న ఇనుము పదార్ధం హెమోగ్లోబిన్ పెంచటానికి సహాయపడుతుంది. ఇవి శరీరానికి కావలసిన ఇతర పోషకాలు మరియు విటమిన్లు కూడా అందిస్తాయి.

మసాలా దినుసులు

మసాలా దినుసులు

థైమ్, జీలకర్ర, ఆరేగానో, తులసి, దాల్చిన చెక్క మరియు సేజ్ వంటి మసాలా దినుసులలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. అందువలన, మీ ఆహారం లో ఈ మసాలా దినుసులను చేర్చుకోవటం మర్చిపోకండి.

నువ్వుల విత్తనాలు

నువ్వుల విత్తనాలు

వీటిలో హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడే ఇనుము సమృద్ధిగా ఉంటుంది. మీరు వీటితో తీపి వంటకం చేసుకోవచ్చు లేదా నువ్వు గింజలతో వంటకం చేసుకోవచ్చు.

English summary

15 Home Remedies To Increase Hemoglobin Level

Hemoglobin is present in red blood cells. It is mainly composed of iron. Hemoglobin is responsible for carrying oxygen from the lungs to the body tissues. It carries carbon dioxide from the body tissues to the lungs and then out of the system.
Story first published: Thursday, January 22, 2015, 9:59 [IST]
Desktop Bottom Promotion