For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రోక్ నివారించడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు

By Super
|

శరీర ఆరోగ్యం, జీవితం పట్ల శ్రద్ధ విషయంలో ప్రస్తుతం చైతన్యం ఎక్కువైంది. ప్రజలు సాధారణ జీవితాన్ని ప్రభావితం చేసే వివిధరకాల విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.

AIDS, కాన్సర్, మానసిక రుగ్మతల తోపాటు కొన్ని ప్రమాదకర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే, కొన్ని రకాల సాధారణ ఆరోగ్య సమస్యలను తప్పించుకోవడానికి కారణాలు ఏమీ లేవు.

అన్ని వయసుల వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ లు చాలా సాధారణం. స్ట్రోక్ నుండి ఉపసమానాన్ని పొందడానికి ప్రజలు వివిధ నివారణ లను తెలుసుకోవడం తప్పనిసరి. ఏ క్షణంలోనైనా స్ట్రోక్ రావచ్చు అనే విషయం తెలుసుకుని, స్ట్రోక్ ని ఎలా తగ్గించుకోవలో ప్రతివారూ వివిధ మార్గాలను తెలుసుకుని ఆశ్చర్యపోతారు.

ఈ స్ట్రోక్ కు కారణాలైన పరిస్థితులను నివారించుకోవడానికి ఈ క్రింది నివారణలను గమనించండి.

స్ట్రోక్ ను తగ్గించడానికి ఈ నివారణలు సానుకూల ప్రభావాన్ని తీసుకురావడ౦లో విజయాన్ని సాధించాయి. ఇవి గొప్ప గుండె సంబంధ నిపుణుల సూచనలతో, ప్రపంచం మొత్తం లోని వేలమ౦ది పై పరీక్ష చేయబడినవి.

రక్తపోటు నియంత్రణ

రక్తపోటు నియంత్రణ

అధిక రక్తపోటు గుండెకు చాలా ప్రమాదం. రక్తపోటును తగ్గించుకోవడం, దాన్ని సున్నితంగా నిర్వహించుకోవడం స్ట్రోక్ ను నివారించడానికి అత్యంత ఫలవంతమైన ఉపశమనం. ఆధునిక జీవనశైలిలో వత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. క్రమపధ్ధతిలో వైద్యుడిని సంప్రదించడం, రక్తపోటుని పరీక్షించుకోవడం చాలా అవసరం. ఉప్పును తీసుకోవడం తగ్గిస్తే రక్తపోటు తగ్గుతుంది. వైద్యుల సలహామేరకు ప్రతిరోజూ మందులు తీసుకోవాలి.

బరువు తగ్గడం

బరువు తగ్గడం

అధిక బరువు వాళ్ళ ఊబకాయం వస్తుంది. ప్రపంచం మొత్తంలో ఎక్కువమంది పిల్లలు వూబకాయంతో బాధపడుతున్నారు. దీనివల్ల గుండెజబ్బులు, స్ట్రోక్ లు వస్తాయి. అధిక బరువును తగ్గించడానికి మీరు తీసుకునే ఆహారపు అలవాట్లు, ఇతర కార్యక్రమాల పట్ల ప్రత్యెక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. మీరు మీ BMI స్థాయి 25 కంటే తక్కువ ఉండేట్టు చూసుకోవడం అవసరం. పరిమిత ఆహరం తీసుకుంటూ, ప్రత్యేకంగా గుండె సంబంధ నిపుణుడైన వైద్యునితో సంప్రది౦చడం అవసరం. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడం ఎలా అనేది చాలా అద్భుతమా? అధిక బరువును తగ్గించుకోవడం. ఈ సూచనను గుర్తుంచుకోండి.

ప్రతిరోజూ వ్యాయామం చేయడం

ప్రతిరోజూ వ్యాయామం చేయడం

మీరు ప్రతిరోజూ వ్యాయామం చేయకపోతే పరిమిత ఆహరం తీసుకున్న బరువు తగ్గరు. స్ట్రోక్ ను నివారించడానికి ప్రతిరోజూ బైట పనిచేసి, చమట బైటికి రావడం అనేవి అద్భుతమైన మార్గాలు. జిమ్ లో చేరడం అనేది ప్రతి ఒక్కరికీ అవసరం కాదు. వ్యాయామం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే, స్ట్రోక్ ను తగ్గించడానికి మీ శరీరానికి ఎలాంటి వ్యాయామం అవసరం అనేది తెలుసుకోవడం అవసరం. ఇది అన్ని అద్భుతమైన నియంత్రనలలో ఒకటి, అంతేకాకుండా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి సహజ మార్గం.

మద్యపానం మితంగా తీసుకోవడం

మద్యపానం మితంగా తీసుకోవడం

మీరు వైద్యుల సిఫార్సులను, వైద్యశాస్త్రాన్ని నమ్మేవారయితే మితంగా మందు తీసుకోవడం అవసరం. స్ట్రోక్ నివారించడానికి నాణ్యమైన వైన్ ను ఒక గ్లాసు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. అయితే, వైద్య శాస్త్రం ప్రకారం ఒక గ్లాసు కంటే ఎక్కువ తీసుకుంటే ప్రమాదం. మీరు స్ట్రోక్ ను నివారించాలి అనుకుంటే, ప్రమాదకర స్ట్రోక్ ను నియంత్రించడానికి ఎక్కువ అవకాశాలు కలిగిన ఆశక్తికర మార్గం. సూత్రాన్ని పాటించండి.

బేబీ యాస్పిరిన్ ని తీసుకోండి:

బేబీ యాస్పిరిన్ ని తీసుకోండి:

65 సంవత్సరాల వయసు పైబడిన స్త్రీలలో స్ట్రోక్ ను నివారించడానికి ఇది అత్యంత ప్రసిద్ధ నివారణలలో ఒకటి. ఇది గుండెలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. స్త్రీలలో ఇది సాధారణ సమస్య, దీనివల్ల 60% కంటే ఎక్కువమంది స్త్రీలు స్ట్రోక్ కు గురవుతారు. అయితే, వారు వైద్యుని సూచనల మేరకు మాత్రమే మందులు తీసుకోవాలి.

బ్లడ్ షుగర్/మధుమేహానికి చికిత్స

బ్లడ్ షుగర్/మధుమేహానికి చికిత్స

గణాంకాల ప్రకారం, మధుమేహ గ్రస్తులు స్ట్రోక్ ప్రమాదానికి గురవుతారు. మీకు మధుమేహం ఉన్నా, ఈ జబ్బుకు చికిత్స తీసుకోవడం అవసరం. పరీక్షలో పాజిటివ్ అని వస్తే, వెంటనే వైద్యుని సంప్రదించి, పరీక్షలు చేయించుకుని, మందులు వాడడం ప్రారంభించాలి. ఈ జబ్బుకు దీర్ఘకాల చికిత్స అవసరమని గుర్తుంచుకోండి. మండులేకాకుండా, ప్రతిరోజూ మితాహారం తీసుకోవాలి. మీరు స్ట్రోక్ కు గురవ కూడదు అనుకుంటే, మీ బ్లడ్ షుగర్ ను ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోండి. సూత్రాలను పాటించండి.

ధూమపానం మానేయాలి

ధూమపానం మానేయాలి

మీరు పోగాత్రాగేవారైతే, పొగ త్రాగానివారికంటే స్ట్రోక్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్ట్రోక్ కు గురికాకూడదు అనుకుంటే, వెంటనే ధూమపానం మానేయండి.


English summary

7 Tips To Reduce Stroke

Consciousness towards the healthy body and life has been on the rise at present. People are paying serious attention towards various factors that affect the normal life.
Desktop Bottom Promotion