For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతక DVT(డివిటి)తో తస్మాత్ జాగ్రత్త...

|

డివిటి (డీప్ వీన్ థ్రాబోసిస్(అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టడం). సిరల్లో రక్త గడ్డకట్టడాన్ని డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. సాధారణంగా కాళ్లలోని రక్తం గడ్డకడుతుంది. దాంతో ఊపిరితిత్తుల్లో అడ్డు ఏర్పడి ప్రాణాహాని కలుగుతుంది. దీనినే ‘పల్మనరీ ఎంబోలిజం'అంటారు.

డివిటి ఎందు వల్ల వస్తుందంటే? సాధారణంగా ఇలాంటి పరిస్థితి శస్త్రచికిత్స చేయించుకుని చాలా రోజులు మంచంపై పడుకోవడం వల్ల, కొన్ని గంటలపాటు విమానాల్లో ప్రయాణించడం వల్ల వస్తుంది. ప్రయాణం చేసే వ్యక్తులు గుండెజబ్బులతో బాధపడేవారైనా, గర్భవతులైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల డీప్ వెయిన్ థ్రోంబోసిస్' (డివిటి)వస్తుంది. డివిటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. ఎవరిలో ఎక్కువగా వస్తుంది అన్న విషయం పై మరింత క్షుణంగా ఈ క్రింది స్లైడ్ లో....

లక్షణాలు:

లక్షణాలు:

డివిటీ వచ్చిన వారిలో కాలు వాపు ఉంటుంది. ఇది డివిటీకి సాధారణ లక్షణం. అలాగే వాపుతో పాటు, గడ్డకట్టిన ప్రదేశంలో ఎర్రగా మరియు సలుపుతున్నట్లు లేదా నొప్పి ఉంటుంది. అయితే ఇది ఎప్పుడూ ఉండదు. అలాగే ఈ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటాయి. దురద్రుష్టవశాత్తు సగానికి సగం మందిలో డివిటీ లక్షణాలు కనిపించవు.

పలిమనిరీ ఎంబాలిజం :

పలిమనిరీ ఎంబాలిజం :

పలిమనరీ ఎంబాలిజం(పిఇ) ఎక్కువ సేపు కదలకపోవడం వల్ల కాళ్లల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి ‘డివిటి' సమస్య తలెత్తుతుంది. అవి పగిలి ఊపిరితిత్తుల గుండా ప్రయాణించడం వల్ల ప్రాణానికి ఎంతో ప్రమాదకరమైన ‘పల్మనరీ ఎంబోలిజం'(పిఇ)కి దారితీస్తుంది. పలిమనిరీ ఎంబాలిజం బ్లడ్ క్లాట్ ఊరితిత్తులకు చేరి అక్కడ బ్లడ్ సప్లేను అడ్డుకుంటుంది. దాంతో పేషంట్ బ్రీతింగ్ సమస్య, లోబ్లడ్ ప్రెజర్, కళ్లు తిరగడం, నిసత్తువ, ఫాస్ట్ హార్ట్ రేట్, ఛాతీలో నొప్పి, మరియు రక్తంతో కూడిన దగ్గు ఉంటుంది. ఈ లక్షణాలు ఏఒక్క లక్షణాన్ని గమనించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

డివిటికి ముఖ్య కారణాలు :

డివిటికి ముఖ్య కారణాలు :

రక్తనాళాల్లో ఏదైనా డ్యామేజ్ అవ్వడం వల్ల డివిటికి కారణం అవుతుంది. సర్జరీ, గాయాలు, లేదా వ్యాధినిరోధకత లోపించడం వల్ల కూడా డివిటికి కారణం అవుతుంది. ఇంకా శరీరంలో రక్తం చిక్కగా ఉన్నా లేదా నిధానంగా ప్రసరిస్తున్నా బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి . అలాగే జనెటిక్ డిజార్డర్ వల్ల కూడా బ్లడ్ క్లాట్ ఏర్పడుతాయి.

డివిటీ ఎవరెవరిలో ఎక్కువగా వస్తుంది:

డివిటీ ఎవరెవరిలో ఎక్కువగా వస్తుంది:

క్యాన్సర్ పేషంట్స్ సర్జరీ చేసుకొన్న వారిలో ఎక్కువ సమయం బెడ్ రెస్ట్ లో ఉండే వారిలో వయస్సైన వారిలో స్మోకర్స్(సిగరెట్స్ త్రాగేవారిలో) అధిక బరువు లేదా ఓబేసిటి ఎక్కువ సమయం కూర్చొనే వారిలో ఫ్లైట్ లో ఎక్కువ సమయం ప్రయాణం చేసే వారిలో

ప్రెగ్నెన్సీ:

ప్రెగ్నెన్సీ:

గర్భధారణ సమయంలో మరియు గర్భిణీ స్త్రీలు ప్రసవించిన తర్వాత 4-6వారల్లో డివిటి సమస్య కొంత మందిలో వస్తుంది. వీరిలో ఇలా డీవిటి ఏర్పడటానికి కారణం వీరిలో అధిక స్థాయిలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కావడం వల్ల చాలా సులభంగా రక్తం గడ్డకట్టడానికి కారణం అవుతుంది. యూట్రస్ విస్తరించడంలో యూట్రస్ మీద ఒత్తిడి పెరగడం వల్ల రక్తనాళాల్లో రక్తప్రసరణ ఆలస్యం అయ్యి, రక్త గడ్డకట్టడానికి కారణం అవుతుంది

 హార్మోన్ థెరఫీ :

హార్మోన్ థెరఫీ :

గర్భాధారణ వలే, బర్త్ కంట్రోల్ పిల్స్ మరియు పోస్ట్ మోనోపాజ్ లో మహిళల్లో విడుదల అయ్యే అధిక ఈస్ట్రోజెన్ స్థాయిల వల్ల మహిళ్లో బ్లడ్ క్లాట్స్ అతి సులభంగా ఏర్పడుతుంది . అది డివిటి యొక్క ప్రమాధాన్ని పెంచుతుంది .

గురక వల్ల కూడా

గురక వల్ల కూడా

అంతే కాదు గురక వల్ల కూడా గుండెపోటు వస్తుందని ఇంతకు ముందు జరిగిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. తాజాగా తైవాన్ లోని పరిశోధకులు గురక వల్ల కూడా డీప్ వీన్ థ్రాబోసిస్ కలుగుతుందని తెలిపారు.

దూరప్రాంతాలకు ప్రయాణం చేయడం

దూరప్రాంతాలకు ప్రయాణం చేయడం

దూరప్రాంతాలకు ప్రయాణం చేయడం ఎక్సైటింగ్ గానే ఉండవచ్చు. కానీ, లాంగ్ సిట్టింగ్ వల్ల డివిటి కి దారితీస్తుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, 4గంటల కంటే ఎక్కువ సమయంలో ఒకే సీటులో కదలకుండా అలాగే కూర్చోవడం వల్ల డివిటి రిస్క్ మరింతె పెరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కార్లో, బస్, ఎయిర్, ట్రైన్ ఏదైనా కావచ్చు.

చికిత్స:

చికిత్స:

డాక్టర్ డివిటి లక్షణాలు తెలుసుకుంటారు. అలాగే పేషంట్ యొక్క ఇదివరకటి మెడికల్ హిస్టరీ గురించి తెలుసుకుంటారు, వైద్యపరమైన సమస్యలు గురించి తెలుసుకుంటారు. అలాగే కుంటుంబంలో ఇదివరికీ ఎవరికైనా ఈ సమస్య ఉందేమో కనుక్కుంటారు . డివిటి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆల్ట్రా సౌండ్ స్కాన్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు . ఈ స్కానింగ్ ద్వారా రక్తప్రసరణ యొక్క వేగాన్ని మరియు బ్లడ్ క్లాట్స్ ను కనుగొంటారు.

యాంటీ క్లాంగ్ నట్స్ డ్రగ్స్ ను

యాంటీ క్లాంగ్ నట్స్ డ్రగ్స్ ను

యాంటీ క్లాంగ్ నట్స్ డ్రగ్స్ ను ఉపయోగించి బ్లడ్ క్లాట్స్ కరిగిస్తారు . అలాగే అవి చిక్కగా ఉన్న రక్తాన్ని పల్చగా మార్చేందుకు ఇంజెక్షన్స్, మాత్రలను సూచిస్తారు . వీటి ద్వారా రక్తం చిక్కగా మారకుండా కొత్తగా బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారిస్తాయి . ఇదివరికే వీన్స్ లో ఏర్పడ్డ బ్లడ్ క్లాట్స్ ను బ్రేక్ చేయకపోయినా, మీ శరీరానికి ఆ శక్తిని అందించి వ్యాధినిరోధక శక్తిని పెంచి నిధానంగా సాధారణ రక్తంలో కరిగిపోయేలా మందులు, మాత్రలు సూచిస్తారు. ఈ చికిత్స ద్వారా పిల్స్ లేదా నీడిల్స్ ద్వారా తీసుకోవచ్చు.

English summary

Deep vein thrombosis (DVT)

Deep vein thrombosis (DVT) occurs when a blood clot (thrombus) forms in one or more of the deep veins in your body, usually in your legs. Deep vein thrombosis can cause leg pain or swelling, but may occur without any symptoms.
Desktop Bottom Promotion