For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తరచూ మూత్రవిసర్జనకు కారణం అయ్యే ఆహారాలు...!: మూత్రవిసర్జన సమస్యలు

|

రోజులో నాలుగైదు సార్లు మూత్రవిసర్జన చేయడం సాధారణం, కానీ నార్మల్ గా కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తే, మరియు ఒక సారి వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తున్నారు, అనారోగ్యానికి ఏదో ఒక సూచికగా గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిద్రలేమి సమస్యలు కూడా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు కారణం అవుతుంది.

తరచూ మూత్రవిసర్జన చేయడానికి వివిధ కారణాలున్నా కూడా..మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలు కూడా కారణం అవుతాయనడంలో ఆశ్చర్య పడాల్సిన విషయమే. ఖచ్చితంగా అవుననే చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కూడా తరచూ మూత్రవిసర్జన వెళ్ళడానికి కారణం అవుతున్నాయి.

READ MORE:మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే హోం రెమెడీస్

అయితే ఫ్రీక్వెంట్ యూరినేషన్ తీవ్రమైన సమస్య కాకపోయినా, అందుకు గల ఖచ్చితమైన సమస్యను గుర్తించడానికి డాక్టర్ ను మీట్ అవ్వడం తప్పనిసరి. అలాగే కొంత మంది ఫ్లూయిడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవల్సి ఉంటుంది. నిజానికి ప్రెగ్నెన్సీ మరియు డయాబెటిస్ ప్రధానకారణం అవుతుంది.

READ MORE: మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్తుంది

మరి మెడికేషన్స్, అనారోగ్య సమస్యల కారణం కాకుండా సహజంగా తరచూ మూత్రవిసర్జన వెళ్ళేలా చేసే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుని, డాక్టర్ ను సంప్రదించి అలాంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ నుండి మినహయించుకోవచ్చు.

 కాఫీ మరియు కెఫిన్ ఉన్న ఆహారాలు:

కాఫీ మరియు కెఫిన్ ఉన్న ఆహారాలు:

రెగ్యులర్ గా కాఫీ త్రాగేవారు రోజులో రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ త్రాగేవారు, మరియు కేఫినేటెడ్ ఆహారాలు, చాక్లెట్స్, కెఫినేటెడ్ డ్రింక్స్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కు దారితీస్తుంది . ఇది యాంటీ డ్యూరియాటిక్ హార్మోన్స్ ను పెంచి ఎక్కువ యూరిన్ వెళ్ళడానికి కారణం అవుతుంది.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

కాఫిలోని కెఫిన్ లాగే, ఆల్కహాల్ కూడా శరీరంలో ఎడిహెచ్ లెవల్స్ ను పెంచడం వల్ల తరచూ మూత్ర విసర్జనకు వెళ్ళాలనిపిస్తుంది.

సోడాలు:

సోడాలు:

సోడాలు ముఖ్యంగా ప్లెయిన్ బెవరేజ్ అయినా..సాఫ్ట్ డ్రింక్ అయినా ఏదైనా సరే ఇది బ్లాడర్ కు ఇబ్బంది కలిగిస్తుంది. దాంతో తరచూ మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంది.

శరీరంలోని సోడియం(ఉప్పు)ఎక్కువగా కోల్పోయినప్పుడు:

శరీరంలోని సోడియం(ఉప్పు)ఎక్కువగా కోల్పోయినప్పుడు:

ఎప్పుడైతే శరీరంలో ఉప్పు చెమట రూపంలో కోల్పోతామో, అప్పుడు ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది.

 చాక్లెట్స్ :

చాక్లెట్స్ :

చాక్లెట్స్ లో ఉండే కొన్ని పదార్థాలు బ్లాడర్ కు చీకాకు కలిగిస్తాయి. మరియు చాక్లెట్స్ కిడ్నీలోని నీటిని ఎక్కువగా గ్రహించేస్తాయి. ఇది అతిగా మూత్రవిసర్జన చేయడానికి కారణం అవుతుంది.

టమోటో:

టమోటో:

టమోటో వంటి అసిడిక్ ఫుడ్స్ వల్ల బ్లాడర్ కు ఇబ్బంది కలిగించి వెంటనే మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంది.

జ్యూసులు:

జ్యూసులు:

కొన్ని రకాల జ్యూసుల్లో సార్బిటాల్ అధికంగా ఉంటుంది. ఇది డ్యూరియాటిక్ మీద ప్రభావం చూపుతుంది . ఇది తరచూ మూత్రవిసర్జనకు గురి చేస్తుంది.

English summary

Foods That Make You Urinate: frequent urination: Urination Problems

Foods That Make You Urinate: frequent urination: Urination Problems
 Foods That Make You Urinate: frequent urination: Urination Problems,Though frequent urination isn't so serious, it is important to meet a doctor to get the real problem diagnosed. Some people who consume lots of fluids may also experience this condition. In fact, pregnancy and diabetes can also be the reasons
Story first published: Monday, November 30, 2015, 16:07 [IST]
Desktop Bottom Promotion