For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూత్రంలో వాసనను నివారించే ఉత్తమ హోం రెమెడీలు

|

మూత్ర సమస్యల్లో ఒకటి మూత్రంలో వాసన. ఇంది ఎందుకు వస్తుంది? శరీరానికి సరిపడా నీళ్ళు త్రాగకుండా మరియు మూత్రం వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళకుండా అలాగే కొన్ని గంటలు సమయం ఉండటం వల్ల, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇలాంటి సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. అంతే కాదు ఈ సమస్యకు కొన్ని అంతర్గత జబ్బులు కూడా కారణం అవుతాయి.

అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు ఇబ్బందికి గురి అవుతారు. ముఖ్యంగా ఇతరుల బాత్ రూమ్ లను ఉపయోగించినప్పుడు ఇబ్బందికరంగా మరియు విచారణ కరంగా ఉంటుంది.

ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కొన్ని హోం రెమెడీలు ఉన్నాయి?సాధారణంగా ఈ సమస్యలకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మరియు యూరిన్ లో పస్ సెల్స్ పోవడం, బ్యాక్టీరియా వల్ల మూత్రం వాసన వస్తుంది .

READ MORE: మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే హోం రెమెడీస్

ఈ సమస్య స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ ఉంటుంది. సాధారణంగా ఈ సమస్యను ఎక్కువగా స్త్రీలలో ఉంటుంది. స్త్రీలలో యురెత్రా ఇన్ఫ్లమేషన్ కు గురిఅయినప్పుడు, మూత్రంలో మార్పులు వస్తాయి.

మూత్రం వాసనకు మరో కారణం కూడా ఉన్నది డీహైడ్రేషన్ వల్ల కూడా మూత్రం వాసన వస్తుంది. ఇది మీ ఆరోగ్య స్థితిగతులను తెలియజేస్తుంది . కాబట్టి, మీకు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వెంటనే తగిజ జాగ్రత్తలు తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అందుకు కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

లో దుస్తులు:

లో దుస్తులు:

ఇన్నర్ దుస్తులు మరి బిగుతుగా ఉన్నవి వేసుకోకూడదు. అంతే కాదు ఇన్నర్ దుస్తులను ఎల్లప్పుడు కాటన్ వి మాత్రమే ఉపయోగించాలి. ఇవి ఒక రకంగా పర్సల్ హైజీనిక్ గా సహాయపడుతాయి.

డిటాక్స్:

డిటాక్స్:

శరీరంలో ఎక్కువ టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల కూడా ఇలా ఫూయల్ స్మెల్ వస్తుంది. కాబట్టి,సాద్యమైనంత ఎక్కువగా లెమన్ వాటర్ త్రాగుతూ మీ శరీరాన్ని మరియు జీవక్రియలను డిటాక్సిఫై చేసుకోవాలి . లెమన్ వాటర్ ను ప్రతి రోజూ ఉదయం కాళీ పొట్టతో తీసుకోవాలి.

హైడ్రేట్:

హైడ్రేట్:

మూత్రం ఎందుకంతే దుర్వాసన కలిగి ఉంటుంది? డీహైడ్రేషన్ కూడా ఈ సమస్యకు ఒక ప్రధాణ కారణం . కాబట్టి, రోజులో మీ శరీరానికి సరిపడా నీళ్ళు తీసుకోవాలి. కనీసం 8-12గ్లాసుల నీరు త్రాగాలి.

మజ్జిగ:

మజ్జిగ:

మజ్జిగా ఉల్లిపాయ ముక్కలు లేదా ఉల్లిపాయ పేస్ట్ మరియు అల్లం వేసి ప్రతి రోజు తీసుకుంటే మంచిది . ఒక వేళ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురి అయ్యుంటే, ఈహోం రెమెడీ నివారిస్తుంది . కాబట్టి ప్రతి రోజూ రెండు మూడు సార్లు మజ్జిగ తీసుకోవడం ఉత్తమం.

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్:

మూత్రంలో వాసన ఉంటే, క్రాన్ బెర్రీ జ్యూస్ త్రాగడం వల్ల తక్షణం ఈ సమస్యను తగ్గించుకోవచ్చు . జ్యూస్ లేకపోతే, పండ్లను కూడా నేరుగా తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

English summary

Home Remedies To Cure Smelly Urine

Urine odour can be unpleasant and can also lead to embarrassing situations especially if you are using a bathroom in your guest's place. Well, are there any home remedies to cure smelly urine? In most of the cases, the general cause would be urinary tract infection.
Story first published: Monday, April 27, 2015, 17:54 [IST]
Desktop Bottom Promotion