For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి సీజన్ లో డయోరియాను నివారించడానికి మార్గాలు

|

ప్రస్తుతం వేసవి సీజన్. ఈ సీజన్ లో ప్రజలు ఎక్కువ అనారోగ్య సమస్యలకు గురి అవుతుంటారు. .అందులో భాగంగానే ప్రజలు ఈ వేసవి వాతావరణంలో జ్వరాలు, డయోరియా, మలేరియా వంటి వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉంది.పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రజలు ఈ వ్యాధులు బారిన పడకుండా ఉండవచ్చు.

ముఖ్యంగా వేసవి కాలంలో డయోరియా వివిధ రకాలుగా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది వాతావరణంలోని వేడి వల్ల వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో చాలా త్వరగా గురి అవుతుంటా. నిజానికి, పెద్దవారిలో కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల క్రోనిక్ డయోరియాకు గురి అవుతుంటారు .

ఎప్పుడైతే ప్రేగులు మరియు పొట్టలో మైక్రోస్కోపిక్ ప్యారాసైట్స్ చేరుతాయో, అప్పుడు వాతావరణ వేడి తోడై డయోరియాకు కారణం అవుతుంది . డయోరియా కారణంగా వికారం, వాంతులు మరియు జ్వరం వంటి డిజార్డర్స్ ఆరోగ్యం పరంగా గందరగోళం సృష్టిస్తుంది.

READ MORE: జీర్ణక్రియకు హాని కలిగించి, హార్ట్ బర్న్, ఎసిడిటికి గురిచేసే10 ఆహారాలు

కలుషిత ఆహారం మరియు నీరు తీసుకోవడం వల్ల అంటువ్యాధుల వ్యాప్తికి ప్రధాణ కారణమవుతున్నాయి. కాబట్టి ఈ అంటువ్యాదులు సంక్రమించకుండా నివారణ చర్యలు ముందుగానే తీసుకొన్నట్లైతే వేసవి కాలంలో వచ్చే జబ్బులను ఎదుర్కోవచ్చు.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

రెడ్ మీట్ మీరు తినాలనుకుంటే బాగా శుభ్రం చేసి, బాగా వండిన పదార్థాలను తీసుకోవాలి. ఎందుకంటే రెడ్ మీట్ లో ప్యారాసైట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది డయోరియాకు గురి చేస్తుంది.

చేతులు శుభ్రం చేసుకోవాలి:

చేతులు శుభ్రం చేసుకోవాలి:

కొన్ని ప్రత్యేకమైన పరాన్న జీవుల వల్ల డయోరియాకు కారణం అవుతుంది . అందుకోసం చేతులను తరుచు శుభ్రం చేసుకుంటుండాలి . మరియు వేసవి సీజన్ లో చెమటలు పడుతాయి. పబ్లిక్ ప్లేసులకు వెళ్ళి వచ్చిన తర్వాత మీ శరీరాన్ని మరియు చేతుల శుభ్రంగా కడుక్కోవాలి.

స్పైసీ ఫుడ్:

స్పైసీ ఫుడ్:

ఎసిడిటికి కారణం అయ్యే ఆహార పదార్థాలను ముఖ్యంగా కారంగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. వీటితో పాటు కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి. వీటిలో డయోరియాకు దారితీస్తుంది.

పూల్స్:

పూల్స్:

వేసవిలో స్విమ్మింగ్ చేయడం ఎక్కువ. అయితే స్విమ్మిగ్ పూల్ లోని వాటర్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు స్విమ్మింగ్ చేసిన ప్పుడు వాటర్ లో ఉండే మైక్రోఆర్గానిజమ్స్ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి చాలా సులభంగా చేరుతాయి . మీరు స్విమ్ చేసిన తర్వాత ఇంట్లో స్నానం చేయడం చాలా మంచిది.

నీళ్ళు:

నీళ్ళు:

వేసవి సీజన్ శరీరానికి అవసరం అయ్యేంత నీరు తీసుకోవాలి. డీహైడ్రేషన్ కారణంగా కూడా డయోరియాకు కారణం అవుతుంది. కాబట్టి, డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవడానికి ఎక్కువ నీరు తీసుకోవాలి. నీరు కలుషిత కాకుండా చూసుకోవాలి. బాగా కాచి చల్లార్చిన నీరు త్రాగాలి.

సలాడ్స్:

సలాడ్స్:

మీరు సలాడ్స్ తినడానికి ఇష్టపడుతున్నట్లైతే, సలాడ్స్ కోసం ఉపయోగించే పచ్చి కూరలు మరియు పండ్లను తినడానికి ముందు వాటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పచ్చికూరల్లో మైక్రోఆర్గానిజమ్స్ అధికంగా ఉంటాయి.

English summary

How To Prevent Diarrhea In Summer

Diarrhea could cause lots of inconvenience. It would surely be a pain when it comes to handling diarrhea in summer. When the heat is severe, children would easily get affected by this disorder. In fact, even in adults bacterial infections can cause chronic diarrhea in summer.
Story first published: Thursday, April 30, 2015, 11:42 [IST]
Desktop Bottom Promotion