For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీల్లో స్టోన్స్ అరికట్టడానికి హోం రెమిడీస్

By Nutheti
|

మారుతున్న జీవనశైలి కారణంగా.. అనారోగ్య సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడటం అనేది ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల కొన్ని సందర్భాల్లో మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా కూడా ఉంటుంది.

మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించడానికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. చిన్నవిగా ఉన్నప్పుడు మందులతోనే నయం అవుతుంది. కానీ.. మందులతో అవసరం లేకుండా.. ఇంట్లోని వస్తువులతోనే.. కిడ్నీల్లో స్టోన్స్ ని సమర్థవంతంగా నివారించవచ్చు.

మాసం, చేపలు తగ్గించాలి

మాసం, చేపలు తగ్గించాలి

యూరిక్ ఆసిడ్ స్టోన్స్ ఉన్నవాళ్లు మాంసాహారాలు తక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే ప్రోటీన్ ల వల్ల శరీరంలో క్యాల్షియం స్థాయిలు పెరిగి.. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటానికి కారణమవుతాయి. కాబట్టి కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నవాళ్లు సార్డెన్ చేపలు, మీట్, వైన్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

నీటికి ప్రాధాన్యత

నీటికి ప్రాధాన్యత

కిడ్నీల్లో స్టోన్స్ ని నివారించాలంటే.. ముందుగా తాగునీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. కెఫీన్, ఆల్కహాన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎక్కువ నీటి పరిమాణం ఉండే పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లు తీసుకోవడం మంచిది.

విటమిన్ ఏ

విటమిన్ ఏ

మూత్రపిండాల ఆరోగ్యానికి విటమిన్ ఏ చాలా అవసరం. మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్ లను తగ్గించి, మూత్రపిండాలలో రాళ్ళను నివారిస్తుంది. క్యారెట్, చిలకడదుంప, గుమ్మడి విత్తనాలు, బ్రొకోలీ వంటి వాటిలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది.

విటమిన్ సీ ని తగ్గించాలి

విటమిన్ సీ ని తగ్గించాలి

రోజులో 3 వేల మిల్లి గ్రాముల కన్నా ఎక్కుల మొత్తంలో విటమిన్ సీ తీసుకునే వారిలో మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి విటమిన్ అవసరం కాబట్టి.. ఎక్కువ మోతాదులో కాకుండా.. అవసరమైన స్థాయిలో తీసుకోవడం మంచిది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గించే మరో హోం రెమెడీ.. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకుని.. తాగి వెంటనే ఓ గ్లాసు నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ల వల్ల కలిగే నొప్పిని తగ్గించటమే కాకుండా రాళ్లను కరించవచ్చు.

ముల్లంగి రసం

ముల్లంగి రసం

ఒక కప్పు ముల్లంగి ఆకులను తీసుకుని రసం తీయాలి. దీన్ని రోజుకి రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

బెండకాయ రసం

బెండకాయ రసం

మూడు పచ్చి బెండకాయలను తీసుకొని, పొడవుగా ముక్కలు చేసి.. రెండు లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే బెండకాయలను తీసేసి, వాటిని పిండితే వచ్చే రసాన్ని ఆ రెండు లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఈ రసాన్ని రెండు గంటల వ్యవధిలో తాగితే మంచిది.

టమోటా రసం

టమోటా రసం

రోజూ ఉదయాన్నే టమోటా రసం తాగినా మంచిది.. ఈ రసానికి కాస్త ఉప్పు జోడిస్తే రుచిగా ఉంటుంది.

English summary

Simple Ways To Prevent Kidney Stones : health tips in telugu

Kidney stones are basically made up of minerals and acidic salt. While stones with smaller size will remain without creating much trouble, some others that have increased in size will cause extreme pain while passing through the urinary system. There are many types of kidney stones, out of which calcium oxalate is the most common form.
Story first published: Tuesday, October 13, 2015, 10:00 [IST]
Desktop Bottom Promotion