For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక వ్యాధులను నివారించడానికి ఎఫెక్టివ్ మార్గాలు

By Super
|

లైంగిక వ్యాధులు లేదా సాధారణంగా STDs అంటూ వ్యాధులు సన్నిహితం వల్ల ఒకవ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికీ అంటుతాయి. ఈ రోగం రావడానికి వయసుతో పనిలేదు, కానీ ఒక వ్యక్తి శృంగార పరంగా బాగా చురుకుగా ఉన్నపుడు సాధారణంగా ఎక్కువ వస్తుంది. ఈ కారణం వల్ల, లైంగిక వ్యాధులను అరికట్టడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

దీనివల్ల సిగ్గుపడడం కంటే ఎక్కువగా ప్రమాదకర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీనిపై సరైన చర్య తీసుకోకపోతే, అంధత్వం, ఇంకా ఎక్కువ అయినపుడు మరణం వంటి శాశ్వతమైన రోగాలు కూడా రావచ్చు. కానీ, భయపడకండి! లైంగిక వ్యాధులను అరికట్టే మార్గాలు ఉన్నాయి.

ఈ జబ్బు రావడానికి కేవలం లైంగిక సంభోగ౦ మాత్రమె కారణం కాదు. సర్పి, జననేంద్రియ దద్దులు వంటి చర్మ స్పర్సల వల్ల మరొక వ్యక్తికీ అంటుతాయి. అలాగే రక్తమార్పిడి వల్ల కూడా మీ శరీరంలో వైరస్ ప్రవేసించవచ్చు. ఆ వ్యాధి ఉన్న తల్లి నుండి పిండంపై కూడా ప్రభావితం చూపోచ్చు.

ఆ వ్యాధి సంక్రమించిన ప్రమాదకర సూచనలు బైటపడే వరకు, చాలా సంవత్సరాలు దాని గురించి తెలుసుకోకపోతే STD వల్ల చాలా ప్రమాద౦ సంభవిస్తుంది. ఒకే భాగస్వామి, కండోంని ఉపయోగించడం, ఆరోగ్యకర శృంగారం వంటివి STD ని నివారించడానికి తీసుకోవాల్సిన అత్యంత సాధారణ సూచనలు. లైంగిక సంపర్కం వల్ల వచ్చే వ్యాధులను నివారించడం ఎలాగో కింద ఇచ్చిన మార్గాలను తెలుసుకుందాం.

To Prevent Sexually Transmitted Diseases

చిన్నవయసులో శృంగారంలో పాల్గొనకపోవడం
STDs కి ప్రధాన కారణాలలో ఒకటి చిన్న వయసులో శృంగారంలో పాల్గొనడం. ఒక వ్యక్తీ ఎంత చిన్న వాడితే, దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది.

శృంగార భాగస్వాములు
భాగస్వాముల సంఖ్యా పెరిగితే, ఆ వ్యాధి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైంగిక వ్యాధులను నివారించడానికి ఏకైక ఆరోగ్యకర భాగస్వామి ఉండడమే సరైన మార్గం.

To Prevent Sexually Transmitted Diseases

పరిశుభ్రంగా ఉండడం
లైంగిక వ్యాధులను అరికట్టడానికి పరిశుభ్రంగా ఉండడం చాలా అవసరం. లోదుస్తులను, టవల్స్ ను ఇతరులకు ఇవ్వకండి. సంభోగానికి ముందు తరువాత జననావయవాలను శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోండి.

అపరిచితులకు దూరంగా ఉండండి
స్పష్టంగా, లైంగిక వ్యాధులు నివారించడానికి ప్రత్యేకంగా ఒక అపరిచిత వ్యక్తీ నుండి దూరంగా ఉండడం మంచిది. చిన్న వయసులో ఉన్న వారికి ఈ సూచన బాగా వర్తిస్తుంది.

To Prevent Sexually Transmitted Diseases

ఒకే భార్యను కలిగి ఉండడం
నమ్మకమైన, అంటువ్యాధి సోకని భాగస్వామిని కలిగి ఉండడం అనేది అంటువ్యాధి ప్రమాదాని తగ్గిస్తుంది. ఆ వ్యక్తితో జీవిత కాల అనుబంధం చాలా సహాయపడుతుంది. ఇది భాగస్వాము లిద్దరికీ ఒక నిబంధన.

ద్రువీకరించుకోవడం
మీరు కొత్త అనుబంధంలో ఉన్నపుడు ఎటువంటి సాన్నిహిత్యన్నైనా నివారించడం ఉత్తమ పనుల్లో ఒకటి. ఇది చాలా కష్టం ఐనప్పటికీ, మంచి కమ్యూనికేషన్ ఈ పరిస్థితికి చాలా సహాయపడుతుంది.

To Prevent Sexually Transmitted Diseases

టీకాలు
కొన్ని STDs ని నివారించడానికి మార్కెట్లో అనేక టీకాలు అందుబాటులో ఉన్నాయి. టీకాలు లైంగిక చర్యలకు ముందే తీసుకోవడం అవసరం. దీనికి అవగాహన, విద్య అవసరం.

కండోమ్స్ ఉపయోగించాలి
కండోమ్స్ ఉపయోగించి కూడా లైంగిక వ్యాధులను నివారించవచ్చు. సహజ పొరలతో తయారుచేసే కండోం లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి.

To Prevent Sexually Transmitted Diseases

మద్యం, ఔషధాలు మానుకోండి
మద్యం అధికంగా తీసుకోవడం, మందులు వాడడం వంటివి ఒక వ్యక్తికి ఈ అంటువ్యాధుల ప్రమాదాన్ని ఎక్కువ చేస్తాయి. ఇది నిజంగా లైంగిక సంబంధం ద్వారా సంక్రమించే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది.

మాట్లాడుకోవడం
మీ భాగస్వామితో సురక్షిత శృంగారంలో పాల్గొనడానికి ఒకరితోనొకరు మాట్లాడుకోవడం ఎప్పుడూ అవసరం. శృంగార విషయాల ఒప్పందాలలో సంబంధాలను చెడగొట్టకుండా ఇది చాలా సహాయపడుతుంది.

To Prevent Sexually Transmitted Diseases

పురుష సుంతీ
ప్రభావిత స్త్రీ నుండి పొందిన వ్యాధుల నుండి పురుషులు ఈ సున్తి ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

శృంగార విద్య
సురక్షిత శృంగారం గురించి పాఠశాల స్థాయి నుండే నేర్చుకోవడం ప్రారంభించాలి. లైంగిక వేధింపులను నివారించే మార్గాలను తెలుసుకోవడానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఇది కూడా STDs కి కారణాలలో ఒకటి.

English summary

To Prevent Sexually Transmitted Diseases

Sexually Transmitted Diseases or commonly referred STDs are infectious diseases that spread from one person to another when there is an intimate contact. There is no age limit for this disease, but are more common when a person is sexually active.
Desktop Bottom Promotion