For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో బాధించే ఫ్లూ: నివారించే నేచురల్ హోం రెమెడీస్

|

భారీ ధారాపాతంగా కురిసే వర్షాల వలన తరచుగా అనారోగ్యాలు వస్తాయి. వర్షాకాలంలో సాదారణంగా కోల్డ్, దగ్గు,ఫ్లూ మరియు శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆహారం మరియు నీటి వలన మలేరియా,డెంగ్యూ మరియు అనేక అంటువ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. మీరు సాధారణ వర్షాకాల వ్యాధులు రాకుండా ముందుగానే సురక్షితంగా ఉండడానికి ఈ ముందు జాగ్రత్త చర్యలను చేపట్టవచ్చు.

సాధారణంగా ఫ్లూ వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూజ్వరం వాతావరణంలో మార్పు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, వర్షంలో తడవటం మరియు వైరస్‌వలన వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక వైరస్ వల్ల కలిగే జబ్బు .

READ MORE:ఫ్లూ నివారించడానికి అత్యుత్తమ ఆహారాలు

దీనివల్ల ప్రాణ హాని కలుగదు కాని రకరకాల వ్యాధులకు ఇది దారి తీయవచ్చు. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఇన్‌ఫ్లుయోంజా క్రిములు శరీరంలోకి ప్రవేశించి రెండు మూడు రోజులలోనే అపరిమితంగా వృద్ధిపొందుతాయి. ఆ క్రిములు వెలిగ్రక్కే విషం శరీరంలో హెచ్చు తుంది. అందువల్ల శరీరావయవాలన్నీ క్రుంగిపోతాయి.

వ్యాధి లక్షణాలు: వ్యాధి క్రిములు శరీరంలో ప్రవేశించిన రెండు, మూడు రోజులలో జ్వరం వస్తుంది. కాళ్ళు చేతులు, గొంతు, రొమ్ము ... శరీరం అంతటా నొప్పులు ఉంటాయి. దగ్గినప్పుడు నొప్పి ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. దగ్గినప్పుడు కళ్లె తెగిపడదు. నాలుగైదు రోజుల తర్వాత క్రమంగా వ్యాధి తగ్గుముఖం పడుతుంది.

READ MORE: ఫ్లూ నుండి తక్షణ ఉపశమనాన్నిచ్చే సింపుల్ డైయట్

మనందరికి తెలుసు జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటి సాధారణ జబ్బుల నుండి బయటపడాటానికి వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడానికి, సరైన ఆహార, పానియాలు తీసుకోవాలని. ఐతే అందులో కూడా ఫ్లూ నివారణకు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఫ్లూ మరియు ఇతర ఇన్ఫెక్షన్ కు గురియైనప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇన్‌ఫ్లూయంజా వైరస్ వలన జలుబు వస్తుంది. ఇది సాధారణ ఫ్లూ. ఈ మధ్య 'ఫ్లూ'కి సంబంధించిన ఓ కొత్త విషయం కనిపెట్టారు శాస్తజ్ఞ్రులు. ఆహారంలో మార్పులు చేస్తే 'ఫ్లూ'ని అరికట్టవచ్చని. భారతీయ ఆహార విధానం 'ఫ్లూ'ని సమర్ధవంతంగా అరికడుతుంది. ముఖ్యంగా ఫ్లూని నివారించే నేచురల్ ఫ్లూ ఫైటర్స్ ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా చూద్దాం...

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు, ప్లూ, కోల్డ్ వంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీ డైలీ డైయట్ లిస్ట్ లో ఈ వెల్లుల్లిని చేర్చుకోవచ్చు.

అల్లం:

అల్లం:

వర్షాకాలనికి ఒక ఉత్తమమైన ఎఫెక్టివ్ నేచురల్ ఫ్లూ ఫైటర్ అల్లం. ఇందులో యాంటీ వైరల్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . కాబట్టి, ఇది తలనొప్పి నుండి నాజల్ బ్లాకే వంటి సమస్యలను నివారిస్తుంది. కాబట్టి, అల్లం టీని రెగ్యులర్ గా తీసుకోవాలి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఫ్లూతో పోరాడే మరో హోం రెమెడీ ఉల్లిపాయ. ఇందులో అల్లిసిన్ అనే మూలం ఉండటం వల్ల ఫ్లూ నుండి త్వరగా ఉపశమనం కలిగించి వెంటనే తేరుకొనే చేస్తుంది.

హేర్బల్ టీ:

హేర్బల్ టీ:

ఫ్లూతో బాధపడుతున్నప్పుడు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఈ హెర్బల్ టీలో కొన్నితులసి ఆకులు మరియు కొద్దిగా అల్లం ముక్క, బ్లాక్ పెప్పర్ చేర్చి బాగా మరింగించి గోరువెచ్చగా వెంటవెంటనీ తీసుకొన్నట్లైతే కోల్డ్ నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

తేనె:

తేనె:

కఫ్ సిరఫ్ గా తేనె తీసుకుంటే రాత్రికి రాత్రే ఫ్లూ నుండి ఉపశమనం పొందవచ్చు . తేనె తీసుకోవడానికి వివిధ మార్గాలున్నాయి . దీన్ని నేచురల్ స్వీట్నర్ గా టీలో మిక్స్ చేయవచ్చు లేదా దాల్చిన చెక్క పౌడ్ మిక్స్ చేసి తీసుకోవచ్చు.దాంతో గొంతునొప్పి ఫ్లూ నివారించబడుతుంది.

 బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

ఫ్లూ, నాజల్ బ్లాకేజ్ తో బాదపడుతున్నట్లైతే పెప్పర్ రసం తీసుకోవచ్చు. పెప్పర్లో ఉండే క్యాప్ససిప్ అనే మూలకం ముక్కుదిబ్బడను వదిలిస్లుంది . దాంతో నాజల్ ప్యాసేజ్ క్లియర్ గా కనబడుతుంది. దాంతో మీరు శ్వాస బాగా పీల్చుకోవచ్చు.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ పొట్టను స్ట్రాంగ్ గా మార్చుతుంది మరియు క్రిమలను నాశనం చేయడానికి సహాయపడుతుంది. అల్లం మరియు తేనె మిక్స్ చేసి గ్రీన్ టీ తీసుకుంటే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఓరిగాన్:

ఓరిగాన్:

ఓరిగాన్: యాంటీవైరల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల ఓరిగానో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . యాంటీఆక్సిడెంట్స్ మీలో వ్యాధినిరోధకను బలోపేతం చేస్తుంది.

ఎల్డర్ బెర్రీ:

ఎల్డర్ బెర్రీ:

ఫ్లూ తో పోరాడే పాపులర్ నేచురల్ రెమెడీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంథోసినిన్స్ ఉండటం వల్ల ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . మ్యూకస్ ను డ్రైగా మార్చుతుంది శ్వాసబాగా ఆడుటకు సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ వ్యాధినిరోధక శక్తిని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

 లెమన్ వాటర్:

లెమన్ వాటర్:

గోరువెచ్చని లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకను పెంచుతుంది . అందుకో కొద్దిగా తేనె మిక్స్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

మింట్ సిరఫ్:

మింట్ సిరఫ్:

ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ మరియు ఇది ఫ్లూతో పోరాడుతుంది . వికారంగా ఉన్నప్పుడు ఒక కప్పు మింట్ టీ తాగితే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పుదీనాలో ఉండే యాంటీ పాస్పోడిక్ కండరాలను రిలాక్స్ చేస్తుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగు తింటే పొట్ట నింపుతుందని అనుకుంటారు. కానీ ఇది ఫ్లూను నేచురల్ గా తగ్గిస్తుంది మరియు డయేరియాను నివారిస్తుంది.

English summary

Twelve Natural Flu Fighters For Monsoon: Health Tips in Telugu

It starts with a simple sneezing and slowly temperature rises and you are under the grip of flu. The monsoon season brings the same picture every year. Especially, in case of children, it becomes difficult to keep them away from influenza.
Desktop Bottom Promotion