For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ ఫీవర్: లక్షణాలు, హోం రెమెడీస్ మరియు నివారణ

|

ఒక సీజన్ నుంచి మరో సీజన్ లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్ ఫెక్షన్లు సులభంగా దాడిచేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్ ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్ లో వైరల్ ఇన్ ఫెక్షన్లు, జ్వరాల ఉదృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో ప్రతి పదిమందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన వైలర్ ఇన్ ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఎక్కువ మందిని బాధించే వైరల్ ఇన్ ఫెక్షన్లలో ఫ్లూ జర్వం కూడా ఒకటి.

వాతావరనం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు కుచించుకుపోతాయి. దాని వల్ల రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ ఇన్ ఫెక్షన్లు, జ్వరాలు, పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎక్కువమంది గుమిగూడి ఉండే చోట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. అదే విధంగా రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఫ్లూ జ్వరం బారిన పడే అవకాశం ఉంటుంది.

READ MORE: ప్రాణహాని కలిగించే 10 రకాల జ్వరాలు..వాటి లక్షణాలు..!

వైరల్ ఫీవర్ కు గురైన వారిలో ఒళ్ళు నొప్పులు, జ్వరం, నీరసం, నిస్సత్తువ, స్కిన్ రాషెస్, తలనొప్పి మరియు ఆహారం తీసుకోలేకపోవడం, గొంతునొప్పి, ముక్కు కారడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా వ్యాయామం చేసే వారిలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చాలా వరకూ వైరల్ జ్వారలు వాటికవే 5 నుండి 7రోజుల్లో తగ్గిపోతాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి. అంతే కాదు, కొన్ని హోం రెమెడీస్ కూడా అద్భుతంగా సహాయపడుతాయి. హోం రెమెడీస్ తో వైరల్ ఫీవర్ ను తగ్గించుకోవాలంటే, ముందుగా లక్షణాలను గుర్తించాలి. మరి లక్షణాలేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

వైరల్ ఫీవర్ లక్షణాలు:

వైరల్ ఫీవర్ లక్షణాలు:

వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు వివిధ రకాల లక్షణాలను చూపుతాయి. కానీ ముఖ్యంగా కనిపించే లక్షణాలు, జ్వరం, అలసట, వికారం, ఒళ్లునొప్పుల, రాషెస్, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, ఉదరంలో నొప్పి మొదలగు లక్షణాలు కనబడుతాయి.

 శరీరం మీద వైరల్ ఏవిధంగా ప్రభావం చూపుతుంది:

శరీరం మీద వైరల్ ఏవిధంగా ప్రభావం చూపుతుంది:

శరీరంలోని కణాల మీద వైరస్ అటాక్ అవుతుంది . చాలా వరకూ వైరల్ ఫీవర్ వల్ల శరీరం పైభాగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా శ్వాసవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. వైరస్ చాలా పవర్ ఫుల్ గా ఉంటే నరాల మీద ప్రభావం చూపుతుంది. దాంతో వివిధ రకాలగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

వైరల్ ఫీవర్ తీవ్రంగా ఉన్నప్పుడు:

వైరల్ ఫీవర్ తీవ్రంగా ఉన్నప్పుడు:

వైరల్ ఫీవర్ అతి ప్రమాధకరం. పేషంట్ చాల బలహీనంగా ఉన్నప్పుడు, ఆహారాలు పూర్తిగా తీసుకోలేనప్పుడు, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయించాలి. యాంటీబయోటిక్స్ తో నయం కానప్పుడు వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి.

 డాక్టర్ ను సంప్రదించాలి:

డాక్టర్ ను సంప్రదించాలి:

పైన సూచించిన లక్షణాల్లో ఏఒక్క లక్షణం కనిపించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి . వైరల్ ఫీవర్ యొక్క మరో లక్షణం, శ్వాసలో ఇబ్బంది కలగడం మరియు ఇది ఈ సమస్య మరో 5రోజులు పెరుగుతుంది.

వైరల్ ఫీవర్ ఎలా వస్తుంది:

వైరల్ ఫీవర్ ఎలా వస్తుంది:

వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. లేదా శ్వాససంబంధం ద్వారా వ్వాప్తి చెందుంతుంది వైరల్ ఫీవర్ కు మరో కారణం కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం తీసుకొన్నప్పుడు వైరల్ ఫీవర్ వచ్చే అవకాశాలున్నాయి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కు గురి అవుతామో అప్పుడు బ్లడ్ స్టెమ్ లేదా లిప్ చానల్స్ మీద ప్రభావం చూపుతుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ సెక్స్ ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది

వైరల్ ఫీవర్ వచ్చిన వెంటనే ఏం చేయాలి:

వైరల్ ఫీవర్ వచ్చిన వెంటనే ఏం చేయాలి:

వైరల్ ఫీవర్ ట్రీట్ చేయడానికి, పేషంట్ ఎక్కువగా నీళ్లు త్రాగాలి (దాంతో శరీరం డీహైడ్రేషన్ కు)గురికాకుండా ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లైట్ ఫుడ్స్ తీసుకోవాలి.

వైరల్ ఫీవర్ కు హోం రెమెడీస్:

వైరల్ ఫీవర్ కు హోం రెమెడీస్:

వైరల్ ఫీవర్ ట్రీట్ తగ్గించుకోవడానికి తాజా కొత్తిమీరతో తయారుచేసిన టీ , మెంతి వాటర్ త్రాగడం వల్ల వైరస్ చాలా తర్వాత నాశనం అవుతుంది . మరియు రైస్ వాటర్ లేదా రవ్వ గంజి తీసుకోవచ్చు.

ఇతరుల నుండి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి :

ఇతరుల నుండి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి :

వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ చాల త్వరగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి, కప్పులు, స్పూన్లు మరియు ప్లేట్స్ ను షేర్ చేసుకోకుండా జాగ్రత్తలు

English summary

Viral Fever: Symptoms, Home Remedies & Prevention: Health Tips in Telugu

Viral Fever: Symptoms, Home Remedies & Prevention: Health Tips in Telugu. The change in weather has brought about a lot of infections and one of them is the viral fever. Since there is a higher number of dengue patients, we often confuse and compare viral infections to dengue fever.
Story first published: Tuesday, July 14, 2015, 18:37 [IST]
Desktop Bottom Promotion