For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో వేధించే గొంతు నొప్పికి ఉపశమనం కలిగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

హోం రెమెడీస్ తో పాటు, రెగ్యులర్ గా తినే ఆహారాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గొంతు నొప్పితో బాధపడేటప్పుడు చల్లటి పాలు, పులు, కారం వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.గొంతు నొప్పి నివారించడాని సహాయ

|

సంవత్సరంతా ఒకే విధంగా ఉండదు. ప్రతి మూడు నెలలకొక సారి వాతావరణంలో మార్పులు సహజం, ఎండాకాలం, వర్షకాలం, ఆకురాలే కాలం, శీతాకాలం ఇలా వివిధ రకాలా సీజన్స్ ఉన్నాయి. వాతావరణంలో మార్పులను బట్టి, శరీరంలో మార్పులు చోటుచేసుకుంటుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా వేగంగా మార్పులు కనబడుతాయి. ఎక్కువ చలి వల్ల శరీరం తట్టుకోలేని విధంగా చలి, జలుబు, దగ్గు వంటి సమస్యల కనబడుతాయి. జలుబు, దగ్గు అత్యంత సాధారణ సమస్య. జలుబు దగ్గు ఉన్నప్పుడు, చీకాకు , గొంతులో నొప్పి, అసౌకర్యం , మింగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

ఇటువంటి ఇబ్బందికర పరిస్థితిని వెంటనే తగ్గించుకోవాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రమవ్వడంతో ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శీతాకాలంలో వచ్చే సాధరణ వ్యాధులైన జలుబు దగ్గు నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి.

గొంతు నొప్పి, జలుబు, అలర్జీలకు కారణం బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్స్, పొల్యూషన్, అలర్జీ రియాక్షన్ ,బిగ్గరగా అరవడం కారణమవుతుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే గొంతునొప్పి వచ్చిన ప్రతిసారి పిల్స్ మింగడం ఆరోగ్యానికి మంచిదా? ఖచ్చితంగా మంచిది కాదని సూచిస్తున్నారు నిపునులు . శీతాకాలంలో వచ్చే ఇటువంటి సహజ మార్పులు వల్ల జలుబు దగ్గును నివారించుకోవడానికి హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి.

ఈ హోం రెమెడీస్ తో పాటు, రెగ్యులర్ గా తినే ఆహారాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గొంతు నొప్పితో బాధపడేటప్పుడు చల్లటి పాలు, పులు, కారం వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

గొంతు నొప్పి నివారించడాని సహాయపడే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా..

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. వెల్లుల్లి గొంతు నొప్పి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ గొంతు నొప్పికి కారణమయ్యే అల్లీసిన్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిని వంటల్లో జోడించవచ్చు లేదా అలాగే పచ్చివి కూడా తినవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లో ఒక టీస్పూన్ లెమన్ జ్యూస్ ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి, ఈ రెండూ ఒక గ్లాసు వేడినీటిలో మిక్స్ చేసి తాగాలి. దీన్ని వారానికి రెండు సార్లు తాగితే మంచిది.

నిమ్మరసం:

నిమ్మరసం:

సగం నిమ్మ పండును ఒక గ్లాసు వేడి నీటిలో మిక్స్ చేసి, అందులోనే తేనె కూడా మిక్స్ చేసి తాగాలి. ఇలా వారంలో రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

తేనె:

తేనె:

తేనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. సీజనల్ గా వచ్చే వ్యాదుల నివారణకు తేనెను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఒక కప్పు వేడి నీళ్ళలో తేనె మిక్స్ చేసి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. లేదా రాత్రి నిద్రించడానికి ముందు ఒక టీస్పూన్ తేనె తినాలి.

 దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

కొద్దిగా దాల్చిన చెక్క నూనెను తేనెలో మిక్స్ చేసి, రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ పసుపు జోడించి పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు:

మెంతులు:

మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. మెంతులు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. రెండు మూడు టీస్పూన్ల మెంతులను వాటర్ లో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం వడగట్టి తాగాలి.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేయాలి. ఈ వాటర్ నోట్లో పోసుకుని, గార్గిలింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

లికోరైస్ :

లికోరైస్ :

గొంతు నొప్పి నివారించడంలో లికో రైస్ గ్రేట్ గా సహాయపడుతుంది. లికోరైస్ రూట్ తో తయారుచేసిన టీ తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

లవంగాలు:

లవంగాలు:

రెండు మూడు లవంగాలు నోట్లో వేసుకుని, చప్పరించడం లేదా మెత్తబడే వరకూ నమలడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.

చమోమెలీ టీ:

చమోమెలీ టీ:

చమోమెలీ టీ ఒక బెస్ట్ హోం రెమెడీ. ఇది గొంతు నొప్పి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక చిటికెడు చమోమెలీ పౌడర్ ఒక గ్లాసు వేడి నీటిలో వేసి బాయిల్ చేయాలి. 10 నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

అల్లం:

అల్లం:

అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి,. అల్లం గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొద్దిగా వాటర్ బాయిల్ చేసి అందులో ఫ్రెష్ జింజర్ మిక్స్ చేయాలి. అరగంట అలాగే ఉండనిచ్చి తర్ావత ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

English summary

12 Effective Home Remedies For Sore Throat

12 Effective Home Remedies For Sore Throat, When there are sudden changes in season, especially when the chilly weather sets in, most of us tend to get cold and sore throat is very common. It gives us that irritating feeling and pain and causes discomfort, making it difficult to swallow even liquids.
Desktop Bottom Promotion