For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి కారణమయ్యే మోడ్రన్ హ్యాబిట్స్..!!

By Swathi
|

చాలాకాలం పాటు కన్సీవ్ అవకపోతే.. ఫెర్టిలిటీ స్టేటస్ తెలుసుకోవడానికి భార్యాభర్తలు.. డాక్టర్ ని సంప్రదిస్తారు. ఎందుకంటే ఇన్ఫెర్టిలిటీని ముందుగా గుర్తించలేం. ఇతర అనారోగ్య సమస్యల మాదిరిగా.. ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కొన్ని రకాల మోడ్రన్ హ్యాబిట్స్ మాత్రం మగవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతాయని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

మగవాళ్లు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని హానికర లక్షణాలు..!

ప్రస్తుతం చాలామంది ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఇన్ఫెర్టిలిటీతో పాటు, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, స్పెర్మ్ స్ట్రాంగ్ గా లేకపోవడం, స్పెర్మ్ డ్యామేజ్ అవడం వంటి రకరకాల సమస్యలు మగవాళ్లను సతమతపెడుతున్నాయి. ఇవన్నీ కేవలం హెల్త్ కండిషన్ ని బట్టి కాదని.. మనం ఫాలో అవుతున్న కొన్ని అలవాట్ల వల్ల కూడా ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మగవాళ్ల డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాల్సిన ఫుడ్స్

ముఖ్యంగా మగవాళ్ల పనితీరు, వాళ్ల అలవాట్లు, ప్రతిదీ స్పెర్మ్ పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కాబట్టి మగవాళ్లు చాలా అలర్ట్ గా ఉండటం చాలా అవసరం. మగవాళ్లను ఎక్కువగా ఇబ్బందిపెడతున్న ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతున్న మోడ్రన్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎక్కువ సమయం కూర్చోవడం

ఎక్కువ సమయం కూర్చోవడం

ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే లైఫ్ స్టైల్ చాలా రకాలుగా అనారోగ్యానికి కారణమవుతోంది. అయితే ఇది రకరకాల అనారోగ్య సమస్యలను మాత్రమే కాదు.. మిమ్మల్ని శక్తిహీనుడిగా కూడా మార్చేస్తుంది. గంటల తరబడి కూర్చోవడం వల్ల వృషణాలకు ఎక్కువ వేడి తగిలి.. స్పెర్మ్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతుంది.

టెక్నాలజీ

టెక్నాలజీ

ల్యాప్ టాప్ లు ఎక్కువ సమయం పాటు ఉపయోగించడం, ముఖ్యంగా వాటిని తొడలపై ఎక్కువ సమయం పెట్టుకోవడం వల్ల వృషణల ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంది. 5 డిగ్రీల ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీనివల్ల తక్కువ స్పెర్మ్ కౌంట్, అన్ హెల్తీ స్పెర్మ్ కౌంట్ కి కారణమవుతుంది.

వాతావరణ కాలుష్యం

వాతావరణ కాలుష్యం

అనారోగ్యకరమైన కాలుష్యం కూడా.. మగవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది. పెస్టిసైడ్స్, కొన్ని ఇండస్ట్రీల టాక్సిన్స్, మెటల్స్, ఆహారం ద్వారా కూడా వాతావరణం.. స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతోంది.

దుస్తులు

దుస్తులు

స్కిన్నీ జీన్స్, బిగుతుగా ఉండే అండర్ వేర్ కూడా మగవాళ్లకు హానిచేస్తాయట. అయితే ఇవి డైరెక్ట్ గా ఇన్ఫెర్టిలిటీకి కారణం కాకపోయినా.. రెగ్యులర్ గా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల వృషణాలకు హాని చేస్తాయి. తక్కు స్పెర్మ్ కౌంట్ మగవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది.

హార్మోనల్ ఇంబ్యాలెన్స్

హార్మోనల్ ఇంబ్యాలెన్స్

హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కేవలం ఆడవాళ్లకు సంబంధించినది కాదు. మగవాళ్లు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య ఎదుర్కొంటారు. దీనికి మందులు లేదా ఫిజిలాజికల్ రీజన్స్ కారణమవుతాయి. దీనివల్ల తక్కువ స్పెర్మ్ కౌంట్, లో లిబిడో, ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి.

ఒత్తిడి

ఒత్తిడి

హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒత్తిడి పెరిగి.. ఇన్ఫెర్టిలిటీకీ కారణమవుతుంది. ఒత్తిడి మగవాళ్ల సెక్సువల్ హెల్త్ పై చాలా దుష్ర్పభావం చూపుతుంది. ఆందోళన వల్ల లిబిడో తగ్గడం, స్పెర్మ్ క్వాలిటీ తగ్గడానికి కారణమవుతుంది.

ఆహారపు అలవాట్లు

ఆహారపు అలవాట్లు

అన్ హెల్తీ ఆహారపు అలవాట్లు కూడా ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతాయి. ఆహారపు అలవాట్లు.. హార్మోనల్ రియాక్షన్స్ కి కారణమై.. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్ కూడా ఇన్ఫెర్టిలిటీకి ప్రధాన కారణాలు.

English summary

7 modern day habits that can cause male infertility

7 modern day habits that can cause male infertility. Most of the times a man comes to know about his fertility status only after a thorough check-up when the couple is unable to conceive.
Story first published:Wednesday, May 25, 2016, 15:58 [IST]
Desktop Bottom Promotion