For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ పెయిన్ నివారించే 7 ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్..!

|

ప్రస్తుత రోజుల్లో మానసికమైన ఒత్తిడి, డిప్రెషన్, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరిగి అనేక వ్యాధులకు గురి చేస్తాయనే విషయం అందరికి విదితమే. అయితే వీటివలస కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్నిరకాల సైకో-పామాటిక్ డిజార్డర్స్ మాత్రమే కాదు సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారి తీయవచ్చును, అందువలననే ఈ మధ్యకాలంలో ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్ళ నొప్పులు).

కీళ్ల నిర్మాణ వ్యవస్థ శరీరాన్ని బలోపేతం చేయడంతో పాటు శరీర కదలికలు, దృఢత్వం, నిలకడ, భంగిమలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వ్యవస్థలో జరుగు జీవక్రియల అసమతుల్యతలను శరీర రోగనిరోధక వ్యవస్థ సాధ్యమైనంత వరకు నిరోధించి తిరిగి సమతుల్యం చేసే ప్రక్రియ సహజంగా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఏర్పడు ముఖ్యలక్షణమే కీళ్లనొప్పి. అయితే కీళ్లనొప్పులను నిర్లక్ష్యం చేసినపుడు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీయవచ్చు. అలా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీయకకీళ్ల నిర్మాణ వ్యవస్థ శరీరాన్ని బలోపేతం చేయడంతో పాటు శరీర కదలికలు, దృఢత్వం, నిలకడ, భంగిమలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వ్యవస్థలో జరుగు జీవక్రియల అసమతుల్యతలను శరీర రోగనిరోధక వ్యవస్థ సాధ్యమైనంత వరకు నిరోధించి తిరిగి సమతుల్యం చేసే ప్రక్రియ సహజంగా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఏర్పడు ముఖ్యలక్షణమే కీళ్లనొప్పి. అయితే కీళ్లనొప్పులను నిర్లక్ష్యం చేసినపుడు దీర్ఘకాలిక అనారోగ్యాలకు(లైఫ్ లాంగ్ డిజార్డర్స్ కు) దారితీయవచ్చు. ఇటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండాలంటే కొన్ని నేచురల్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి రుమటాయిడ్స్ ఆర్థ్రైటిస్ పెయిన్, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.

ఈ నేచురల్ రెమెడీస్ పురాతన కాలం నుండి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ రెమెడీస్, నొప్పులను, కండరాల పట్టివేతను, అసౌకర్యాన్ని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. రుమాటాయిడ్స్ ఆర్థ్రైటిస్ పెయిన్స్, రుమటాయిడ్ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు, నొప్పులు, వాపులను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈక్రింది విధంగా ఉన్నాయి. వీటిని సరైన పద్దతిలో ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

సూచన: ఇదివరకే మీరు ఆర్థ్రైటిస్ నివారణకు మెడిసిన్స్ , చికిత్స తీసుకుంటున్నట్లైతే డాక్టర్ ను కలిసి, నేచురల్ రెమెడీస్ గురించి సలహా తీసుకోవడం మంచిది.

1. హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్:

1. హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్:

ఆర్థరైటిస్ తో బాధపడే వారికి థెరఫిస్ట్ లు ప్రతి రోజూ ఉదయం హాట్ బాత్ లేదా వార్మ్ బాత్ చేసుకోమని సూచిస్తుంటారు. ముఖ్యంగా హాట్ బాత్, వార్మ్ బాత్ చేసేటప్పుడు నొప్పులన్న భాగాలను ఎక్కువ సేపు వేడినీటిలో డిప్ చేయడం వల్ల కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. నొప్పి తగ్గతుంది. జాయింట్ స్టిఫ్ నెస్ నుంచి కొద్దిగా ఉపశమనం కలిగుతుంది. అలాగే ఎలక్ట్రిక్ హీటెడ్ పాడ్స్ కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఐస్ ప్యాక్ వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఐస్ ప్యాక్ ఫ్రోజోన్ వెజిటేబుల్ బ్యాగ్స్ లో వేసి మసాజ్ చేసుకోవాలి. ఈ కోల్డ్ ప్యాక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. నొప్పి తగ్గుతుంది.

2. ఎప్సమ్ సాల్ట్ బాత్:

2. ఎప్సమ్ సాల్ట్ బాత్:

తరచూ ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటే ఎప్సమ్ సాల్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది. రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ పెయిన్ నివారించడంలో ఎప్సమ్ సాల్ట్ బాత్ గ్రేట్ గా సహాయపడుతుంది. రెగ్యులర్ గా సాల్ట్ బాత్ చేస్తుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

3. టర్మరిక్ అండ్ జింజర్ టీ:

3. టర్మరిక్ అండ్ జింజర్ టీ:

రెగ్యులర్ వంటల్లో తప్పనిసరిగా పసుపును చేర్చాలి. ఆర్థరైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే పసుపును మరింత ఎక్కువగా ఉపయోగించడం మంచిది . పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది జాయింట్ పెయిన్ మరియు స్టిఫ్ నెస్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. జింజర్ టీలో కొద్దిగా అల్లం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక నొప్పుల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. వేడి పాలలో పసుపు కలుపుకొని తాగటం వలన లేదా రోజులో 3 నుండి 4 సార్లు కాప్సిల్ ల రూపంలో లభించే పసుపును తీసుకోవటం వలన ఆర్థరైటిస్ వ్యాధి తీవ్రతలు గణనీయంగా తగ్గుతాయని చెప్పవచ్చు.

4.డ్యాండలిన్ రూట్ మరియు ఆకులు:

4.డ్యాండలిన్ రూట్ మరియు ఆకులు:

మరో రిమార్కబుల్ రెమెడీ, దీర్ఘకాలిక కీళ్ళనొప్పులను నివారించుకోవడంలో డాండలిన్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి, ఈ ఆకుల్లో ఉండే నయం చేసే గుణాలు, నొప్పులను , వాపులను, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

5. ఫిష్ ఆయిల్:

5. ఫిష్ ఆయిల్:

ఫిష్ ఆయిల్లో ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు . ఈ ఫ్యాటీ యాసిడ్స్ బోన్స్ కు పోషణ అందిస్తుంది మరియు జాయింట్స్ పెయిన్స్ తగ్గుతాయి . ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ ను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాల్సి వుంటుంది.

6. వ్యాయామం:

6. వ్యాయామం:

ఆర్థరైటిస్ తో బాధపడే వారికి, సూచించే సలహా ప్రతి రోజూ రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి . ప్రతి రోజూ కనీసం 30నిముషాల వ్యాయాం చేయడం వల్ల జాయింట్స్ మరింత ఫ్లెక్సిబుల్ గా మారుతాయి .దాంతో కండరాల పట్టివేత నుండి ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు వ్యాయామం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మరియు శరీరం ఫిట్ గా ఉంటుంది.

7. అల్లం:

7. అల్లం:

అల్లం శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు అల్లం రసం తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పి తగ్గటానికి ఉపయోగపడుతుంది. అల్లం కీళ్ళ నొప్పులు మరియు కండరాల నొప్పులను తగ్గించటానికి ఉపయోగకరంగా ఉంటుంది. అల్లం క్రిమినాశక లక్షణాలను కూడా కలిగి ఉంది. అల్లం రసం చేతులు మరియు వేళ్లు లో నొప్పి నివారణ కోసం ఒక గృహ ఆధారిత పరిహారంగా ఉంది.

English summary

7 Natural Remedies For Rheumatoid Arthritis Pain

Rheumatoid arthritis is a chronic inflammatory disease that millions of people all over the globe are suffering from. This incurable disease adversely affects the functionality and movement of the joints in the hands and feet. Listed in this article are natural remedies for rheumatoid arthritis pain.
Story first published: Saturday, October 22, 2016, 13:40 [IST]
Desktop Bottom Promotion