For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్ని మెడిసిన్స్ వాడినా దగ్గు తగ్గలేదా ? ట్రై హోంమేడ్ సిరప్

By Swathi
|

దగ్గు.. వచ్చిందంటే చిన్నైనా, పెద్దైనా ఇబ్బంది పడాల్సిందే. మనిషినంతటినీ అల్లాండిచేస్తుంది దగ్గు. పొడి దగ్గు, కోరింత దగ్గు ఇలా రకరకాల దగ్గులున్నాయి. ఏ దగ్గైనా సరే.. దగ్గేటప్పుడు పొట్ట నుంచి ధమనుల వరకు అన్నీ షేక్ అవుతాయి. దీనివల్ల శరీరమంతా నిస్సత్తువకు లోనవుతుంది. ఒక్కసారి దగ్గు వచ్చిందంటే.. ఎన్ని మందులు, ట్యాబ్లెట్స్ తాగినా వదిలిపెట్టదు. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా ?

మిడ్ నైట్ కఫ్ తో జాగరణా..?ఐతే కారణాలేంటో తెలుసుకోండి...

సింపుల్ దగ్గు తగ్గడానికి మార్కెట్ లో దొరికే సిరప్ లను తాగడం కంటే.. ఇంట్లోనే న్యాచురల్ గా తయారు చేసుకోవడం వల్ల పిల్లలకు, పెద్దలకు ఈజీగా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇంట్లో తయారు చేయడమంటే ఏదో పెద్ద ప్రాసెస్ అని ఫీలవకండి. ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఫలితాలు ఎక్కువగా పొందవచ్చు. దగ్గును త్వరగా తగ్గించే.. రెండురకాల రెసిపీలు ఇప్పుడు చూద్దాం.

గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబు నివారించే మార్గాలు

ఈ సిరప్ లో ఉపయోగించే అల్లం, తేనె, గ్లిజరిన్ న్యాచురల్ గా పనిచేసి.. గొంతులో గరగరను తగ్గిస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ గుణాలు దగ్గును దూరం చేస్తాయి. తేనె గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. గ్లిజరిన్ న్యాచురల్ ప్రిజర్వేటివ్ లా పనిచేస్తుంది. ఇక నిమ్మ దగ్గు, జలుబుతో పోరాడుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది.

సిరప్ 1

సిరప్ 1

పావు కప్పు గ్లిజరిన్ తీసుకుని ఒక కప్పులో వేసుకోవాలి. అందులో పావు కప్పు తేనె కలపాలి. అలాగే పావు కప్పు నిమ్మరసం కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. అంతే ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో నిల్వ ఉంచుకోవాలి. ఒక టీ స్పూన్ ఈ దగ్గు మందును రోజంతా తరచుగా తీసుకుంటూ ఉంటే.. దగ్గు ఈజీగా తగ్గిపోతుంది.

సిరప్ 2

సిరప్ 2

ముందుగా అల్లం పొట్టు తీసి.. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 నిమ్మకాయలు తీసుకుని కట్ చేయకుండా, రసం తీయకుండా.. అలాగే తురిమేయాలి. ఒక కప్ నీటిని సాస్ ప్యాన్ లో పోయాలి.

నిమ్మ

నిమ్మ

ఆ నీటిలో అల్లం ముక్కలు కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల నిమ్మకాయ తురుము కలపాలి. ఇదంతా బాగా ఉడుకుతున్నప్పుడు.. 5 నిమిషాలు మంట తగ్గించి బాగా మరగనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

తేనె

తేనె

ఒక కప్పు తేనె తీసుకుని సాస్ ప్యాన్ లో వేసి.. సన్నని మంటపై కొద్దిగా వేడి చేయాలి. కానీ.. ఉడకనివ్వరాదు. అందులోకి ముందు కాచి వడగట్టిన మిశ్రమం కలపాలి. ఇప్పుడు రెండు నిమ్మకాయల రసం అందులో కలపాలి.

హోంమేడ్ సిరప్

హోంమేడ్ సిరప్

సన్నని మంటపై ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. అయితే గెరిటతో.. కలుపుతూనే ఉండాలి. కాస్త డార్క్ కలర్ లోకి మారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో తీసిపెట్టాలి. అంతే దగ్గు మందు ఇంట్లోనే రెడీ అయిపోయింది.

ఎవరికి ఎంత మోతాదు

ఎవరికి ఎంత మోతాదు

5 ఏళ్లలోపు పిల్లలకైతే అర టీస్పూన్ 2 గంటలకు ఒకసారి ఇవ్వాలి. 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు 1 నుంచి 2 టీస్పూన్లు 2 గంటలకు ఒకసారి ఇవ్వాలి. 12 ఏళ్లు పైబడిన వాళ్లు 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు 4 గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండే.. దగ్గు తగ్గిపోతుంది.

Story first published:Wednesday, February 10, 2016, 16:46 [IST]
Desktop Bottom Promotion