అపెండిసైటిస్: భరించలేని పొట్టనొప్పిని నివారించే 8 బెస్ట్ ఫుడ్స్

అపెండిసైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం . పరిస్థితిని బట్టి వెంటనే డాక్టర్ చికిత్స అందిస్తారు. అపెండిసైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సైడ్ బ

Posted By:
Subscribe to Boldsky

అపెండిక్స్ ఇన్ఫ్లమేషన్ కు గురైనప్పుడు అపెండిసైటిస్ వస్తుంది. అపెండిసైటిస్ వచ్చినప్పుడు భరించలేనంత పొట్ట నొప్పి వస్తుంది. ఈ నొప్పి పెద్దప్రేగులవ వరకూ విస్తరిస్తుంది. మన శరీరంలో అంతర్గత అవయవాల్లో అపెండిక్స్ ఒకటి, ఇది ఏం పనిచేస్తుందన్న విషయం చాలా మందికి తెలుసుండకపోవచ్చు. కానీ దాని నొప్పిని మాత్రం ఇతరుల పడుతున్నప్పుడు మన గమనించే ఉంటాము. చాలా అరుదుగా మన చుట్టుూ ఉన్నవారిలో ఎవరో ఒకరు ఈ అపెండిక్స్ భారిన పడటం వెంటనే ఆపరేషన్ చేయించుకోవడం చూస్తుంటాము.

అపెండిక్స్ సమస్యకు వెంటనే చికిత్స తీసుకోకపోతే బ్రస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పొట్ట ఉదరంలో ప్రమాదరక గాయం ఏర్పడే అవకాశం ఉంది. పెరిటోనిస్ క్యావిటీకి దారితీస్తుంది. అపెండిసైటిస్ సమస్య ఉన్న వారిలో కనిపించే లక్షణాలు , మొదట పొట్ట ఉదరంలో కుడివైపు భాగంలో విపరీతమైన నొప్పి బాదిస్తుంది. ఆకలి తగ్గిపోతుంది, వాంతులు, డయోరియా వంటి సమస్యలు ఎదుర్కుంటారు.

కాబట్టి, అపెండిసైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం . పరిస్థితిని బట్టి వెంటనే డాక్టర్ చికిత్స అందిస్తారు. అపెండిసైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సైడ్ బై సైడ్ తినడం వల్ల కూడా కండీషన్ ను మెరుగుపరుచుకోవచ్చు.

అపెండిసైటిస్ కు సూటబుల్ అయ్యే కొన్ని హోం రెమెడీస్ , టాప్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

వెల్లుల్లి :

వెల్లుల్లిలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇదినొప్పి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లి రెబ్బలను ఉదయం పరగడుపున తినడం వల్ల పొట్టనొప్పి, అపెండిసైటిస్ లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు.

ఫైబర్ ఫుడ్స్ :

అపెండిసైటిస్ కారణంగా మలబద్దక సమస్య. ఈ సమస్య అపెండిసైటిస్ లక్షణాలను , ఇన్ఫ్లమేషన్, నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఫైబర్ ఫుడ్స్ సరిగా తినకపోవడం వల్ల అపెండిసైటిస్ పెరిగే చాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. వీన్స్, బీట్ రూట్, క్యారెట్, బ్రొకోలీ, బ్రౌన్ రైస్, సన్ ఫ్లవన్ సీడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అపెండిసైటిస్ లక్షణాలను నివారించుకోవచ్చు.

ఆముదం నూనె:

అపెండిసైటిస్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది బ్లాకేజ్ ను నివారిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఆముదం నూనెను నోట్లో వేసుకుని తాగడం వల్ల మలబద్దక సమస్యను నివారించుకోవచ్చు. ఆబ్డామినల్ పొట్ట మీద కొద్దిగా ఆముదం నూనె వేసి మసాజ్ చేయడం వల్ల నొప్పిని క్రమంగా తప్పించుకోవచ్చు.

నీళ్ళు ఎక్కువగా తాగడం :

రోజుకు మన శరీరానికి ఎంత నీరు అసవరమో అంత తాగడం వల్ల బాడీ మొత్తం ఆరోగ్యానికి మంచిది. నీళ్ళు మలబద్దకం నివారిస్తుంది. టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇంకా ఫ్రూట్ జ్యూసులు తాగడం, ఫ్రెష్ వెజిటేబుల్స్ తినడం మంచిది. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి

మెంతులు :

అపెండిసైటిస్ ను నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్రేగుల్లోనే వేస్టేజ్ ను తేలికగా, తొలగిస్తుంది. దాంతో నొప్పిని తగ్గించుకోవచ్చు. మెంతులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి రోజుకు రెండు మూడు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

పుదీనా

అపెండిసైటిస్ నివారించడంలో పుదీనా గ్రేట్ రెమెడీ. ఇది వాంతులు , వికారం మాత్రమే తగ్గించడం కాదు, ఇది పొట్టలో గ్యాస్ ను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.  మింట్ టీకి కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది

అల్లం:

అపెండిసైటిస్ నివారించడంలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది.  కాబట్టి రోజుకు మూడు సార్లు జింజర్ టీ తాగడం మంచిది. అలాగే నొప్పి ఉన్న ప్రదేశంలో జింజర్  ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఉపశమనం పొందుతారు. 

నిమ్మరసం :

నిమ్మరసం మలబద్దకం, మరియు అజీర్తి సమస్యల నుండి గ్రేట్ గా ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటిని పెంచుతుంది. నిమ్మరసంకు కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

If You Are Having Appendicitis Pain, Try These 8 Foods To Get Relief

Appendicitis is an inflammation of the appendix which extends from the large intestine. Nobody knows what is the function of appendix, but we certainly know how painful appendicitis can be.
Please Wait while comments are loading...
Subscribe Newsletter