For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రెస్ తగ్గించుకోవడానికి, బాడీలో ఈ ప్రెజర్ పాయింట్స్ ను నొక్కిపెట్టండి..!!

|

అనారోగ్య సమస్యల్లో ఒకటి స్ట్రెస్ (ఒత్తిడి). స్ట్రెస్ వల్ల మొత్తం ఆరోగ్యం పాడవుతుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, విశ్రాంతి లేకపోవడం వల్ల త్వరగా ఒత్తిడికి లోనవుతుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో స్ట్రెస్ ఎక్కువగా కనబడుతుంటుంది. ఇంట, బయట ఒత్తిడితో పనిచేయటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. స్ట్రెస్ మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. స్ట్రెస్ ఎనర్జీ లెవల్స్ పూర్తిగా తగ్గించేస్తుంది. ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి.

ఆరోగ్యం మీద తీవ్రంగా ప్రభావం చూపించే స్ట్రెస్ తగ్గించుకోవడానికి వివిధ రకాల మార్గాలున్నాయి. వాటిలో ఆక్యుప్రెసర్ చాలా సింపుల్ పద్దతి. ఆక్యుప్రెజర్ వల్ల స్ట్రెస్ ను త్వరగా తగ్గించుకోవచ్చు. ఆక్యుప్రెజర్ వల్ల స్ట్రెస్ నుండి ఇన్ స్టాంట్ రిలీఫ్ ను కలిగిస్తుంది. బాగా స్ట్రెస్ గా ఫీలవుతున్నప్పుడు, స్ట్రెస్ కు కారణమయ్యే కొన్ని బాడీ పార్ట్స్ (ప్రెజర్ పాయింట్స్)మీద కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకోవడం లేదా ప్రెజర్ కలిగించడం వల్ల ఒత్తిడి నుండి తక్షణ ఉపశమనం పొందుతారు . ఏసియాలో చాలా దేశాల్లో ఆక్యుప్రెజర్ ను హీలింగ్ ఆర్ట్ గా ఉపయోగిస్తున్నారు .

స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇన్ స్టాంట్ గా పిల్స్ లేదా యాంటీ డిప్రెసెంట్స్ తీసుకోవడం వల్ల సీరియస్ సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి. కాబట్టి, స్ట్రెస్ తగ్గించుకుని, రిలాక్స్ అవ్వడానికి ఆక్యుప్రెజర్ పద్దతిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం....

1. చెవి:

1. చెవి:

బాగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు చెవి మీద (లోపలి వైపు) పెన్ తో కానీ లేదా చేతి వేళ్ళతో కానీ నొక్కి పట్టుకుని డీప్ గా శ్వాస తీసుకుని వదలాలి. ఇలా చేయడంవల్ల స్ట్రెస్ త్వరగా తగ్గుతుంది.

2. పొట్ట:

2. పొట్ట:

స్ట్రెస్ గా ఉన్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు పొట్ట మీద ప్రభావం పడుతుంది, ఆ సమయంలో డయాప్రమ్ వదులవ్వడం వల్ల రిలాక్స్ చెందడానికి సహాయపడుతుంది.

3. స్కాల్ఫ్:

3. స్కాల్ఫ్:

తల వెనుగ బాగం (క్రింది బాగం) మెడకు దగ్గరగా రెండు చేతుల వేళ్ళతో సున్నితంగా ప్రెజర్ చేయడం వల్ల లేదా వత్తి పట్టుకోవడం వల్ల , మెడటీ తలక్రింది బాగంలో 20 నిముషాలు సున్నితమైన మసాజ్ చేయడం వల్ల స్ట్రెస్ ఫ్రీగా రిలాక్స్ అవుతారు.

4. అరచేతిలో :

4. అరచేతిలో :

అరచేతిలో కొద్దిసేపు వేళ్ళతో ఒత్తి పట్టుకోవడం వల్ల స్ట్రెస్ నుండి తక్షణం ఉపశమనం కలుగుతుంది. ఈ ప్రెజర్ పాయింట్ ప్యాక్రియాటిక్, లివర్ మరియు హార్ట్ కు అనుసందానం కలిగి ఉంటుంది, వాటి మీ ప్రెజర్ తగ్గిస్తుంది. దాంతో స్ట్రెస్ తగ్గుతుంది.

5. చెస్ట్ :

5. చెస్ట్ :

చేతి మూడు వేళ్ళతో చెస్ట్ కు మద్య బాగంలో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల భావోద్రేకాల నుండి ఉపశమనం కలిగించడంతో పాటు, ఆందోళన తగ్గిస్తుంది . నాడీ వ్యవస్థను ప్రశాతం పరుస్తుంది . దాంతో స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.

6. పాదం :

6. పాదం :

ఫోటోలో చూపిన విధంగా పాదాల్లో కొన్ని ప్రెజర్ పాయింట్స్ లో జాగ్రత్తగా ప్రెజర్ కలిగించాలి. ఇలా చేయడం వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. దాంతో శరీరం మరియు మనస్సు రిలాక్స్ అవుతుంది. దాంతో స్ట్రెస్ తగ్గుతుంది.

7. పాదాలు:

7. పాదాలు:

ఫోటోలో చూపిన విధంగా రెడ్ మార్క్ చేసిన ప్రదేశంలో సున్నితంగా ప్రెజర్ ను కలిగించాలి. రెడ్ పాయింట్ ప్రదేశంలో వేళ్ళతో ఒత్తి పట్టుకోవడం వల్ల నరాలు వదులవుతాయి. దాంతో ఆందోళన మరియు వర్రీస్ క్లియర్ అవుతాయి.

8. మని కట్టు :

8. మని కట్టు :

బాగా స్ట్రెస్ గా అనిపించినప్పుడు మనికట్టు వద్ద ప్రెజర్ కలిగిస్తే స్ట్రెస్ తగ్గించడంతో పాటు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది .

9. భుజాలు:

9. భుజాలు:

షోల్డర్ (భుజాల మీద కొద్దిగా ప్రెజర్ కలిగిస్తే స్ట్రెస్ మరియు ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు.

10. ముంజేయి:

10. ముంజేయి:

బాగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు ముంజేయి ప్రాంతంలో కొద్దిగా ప్రెజర్ కలిగిస్తే ఆందోళన మరియు స్ట్రెస్ తగ్గుతుంది. రెండు చేతుల యొక్క ముంజేయి వద్ద ప్రెజర్ కలిగిస్తే స్ట్రెస్ , యాక్సజైటి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

English summary

Press These Points And Get Rid Of Stress!

A bit of stress may help you do your job well and achieve your targets but too much of stress can spoil your health. Also, it can affect your energy levels and may change your attitude too. Though there are a lot of ways to reduce stress, trying acupressure could be the simplest way to relieve yourself from stress instantly.
Story first published:Wednesday, August 24, 2016, 14:07 [IST]
Desktop Bottom Promotion