For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను రెగ్యులర్ గా మార్చే 10 నేచురల్ రెమెడీస్ ..!

మహిళ ఆరోగ్య సమస్యల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి. చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొని ఉంటారు. మహిళల్లో ప్రతి 28 రోజులకొకసారి రుతుక్రమం వస్తుంది.

|

మహిళ ఆరోగ్య సమస్యల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి. చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొని ఉంటారు. మహిళల్లో ప్రతి 28 రోజులకొకసారి రుతుక్రమం వస్తుంది. అయితే కొంత మందిలో 28 రోజులు దాటిన ఒక వారం కూడా వస్తుంటాయి, దీన్ని కూడా నార్మల్ గా పరిగణిస్తారు, అయితే ఒక వారంపైన దాటితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవల్సి ఉంటుంది.

ఇంకా, కొంత మంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో అసాధారణ లక్షనాలు కనబడుతుంటాయి. పీరియడ్స్ సమయంలో కొంత మంది మహిళల్లో ఓవర్ బ్లీడింగ్ అయితే , మరికొంత మందిమహిళల్లో అసలు బ్లీడింగ్ కాకుండా, కొన్ని డ్రాప్స్ మాత్రమే కనబడుతుంటాయి. ఇంకొ మంది మహిళల్లో పీరియడ్స్ ఎక్కువ రోజులు మిస్ అవ్వడం మాత్రమే కాకుండా ఒకటి, రెండు నెలలు ఆలస్యం అవుతుంటాయి. కాబట్టి, ఇటువంటి అసాధారణ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోకపోతే, ఫ్యూచర్లో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుంది. గైనకాలజిస్టులను కలవాడాని కంటే ముందు కొన్ని నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Suffering From Irregular Periods ? Try These Natural Remedies, It Helps !

మహిళల పీరియడ్స్ సమస్యలను నివారించి, పీరియడ్స్ ను క్రమబద్దం చేయడంలో నేచురల్ లేదా హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ లేదా ఆర్టిఫిషియల్ గా తయారుచేసినవి కావు కాబట్టి, మహిళల ఆరోగ్యానికి మరే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఆలోచించకుండా నిరభ్యరంతరంగా వీటిని తీసుకోవచ్చు. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను క్రమబద్దం అయ్యేందుకు సహాయపడుతాయి. ఈ నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించిన తర్వాత కూడా పీరియడ్స్ సరిగా రాకుండా ఉంటే అప్పుడు డాక్టర్స్ ను తప్పనిసరిగా కలిసి, కారణాలు తెలుసుకుని, సరైన చికిత్సను తీసుకోవడం చాలా అవసరం.

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను రెగ్యులర్ చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..

పచ్చిబొప్పాయి

పచ్చిబొప్పాయి

పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు, ముఖ్యంగా స్ట్రెస్ వల్ల పీరియడ్స్ డిలే అయితే, పచ్చిబొప్పాయి ముక్కలను తినడం వల్ల పీరియడ్స్ కు సంబంధించిన కండరాల మీద ఒత్తిడి పెంచుతుంది, దాంతో పీరియడ్స్ త్వరగా అవుతారు. అందుకు పచ్చిబొప్పాయి తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

కాకరకాయ:

కాకరకాయ:

కాకరకాయను తీసుకుని క్లీన్ గా కడిగి, తర్వాత కొన్ని ముక్కలుగా కట్ చేసి, జ్యూస్ తయారుచేసి, రోజుకు ఒకటి లేదా రెండు సార్లు పీరియడ్స్ వచ్చే వరకూ తాగాలి.

అలోవెర:

అలోవెర:

ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అలోవెర జ్యూస్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి, తర్వాత దీన్ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి, ఇలా రెండు మూడు నెలలు చేస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను ఎఫెక్టివ్ గా రెగ్యులర్ గా మార్చుతుంది. అయితే పీరియడ్స్ సమయంలో దీన్ని ఖచ్చితంగా తీసుకోకూడదు.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను రెగ్యులేట్ చేయడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఒకటి ,రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని, నీళ్ళలో మిక్స్ చేసి ప్రతి రోజూ తాగాలి.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

పీరియడ్స్ సమయంలో వచ్చే క్రాంప్స్, పెయిన్ ను నివారించడంలో దాల్చిన చెక్క గ్రేట్ గా సహాయపడుతుంది. అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు పాలలో మిక్స్ చేసి, రోజూ కొన్ని వారాల పాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

నువ్వులు:

నువ్వులు:

కొన్ని నువ్వులు తీసుకుని, రోస్ట్ చేయాలి. మెత్తగా పొడి చేసి, అందులో కొద్దిగా బెల్లం పొడి మిక్స్ చేసి రోజూ ఒక టీస్పూన్ తింటుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ కాంబినేషన్ ను రెండు వారాల కంటే ముందు నుండి తినాలి. పరగడుపున తింటే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

క్యారెట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది హార్మోనుల ప్రక్రియను నార్మల్ చేస్తుంది. రెండు మూడు నెలలు రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల పీరియడ్స్ ను రెగ్యులర్ చేయడానికి సహాయపడుతుంది.

 సోంపు :

సోంపు :

సోంపు పీరియడ్స్ ను రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ సోంపును ఒక గ్లాసు వాటర్ లో మిక్స్ చేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వడగట్టి, పరగడుపున తాగాలి.

అల్లం:

అల్లం:

అల్లంలో మెడిసినల్ గుణాలు అధికంగా ఉన్నాయి, కొద్దిగా అల్లం తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి, నీటిలో వేసి బాయిల్ చేయాలి. వడగట్టి రోజూ భోజనం తర్వాత తాగాలి. దీనికి తేనె కలిపితే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది

పసుపు :

పసుపు :

పసుపు శరీరంలో వేడి పుట్టిస్తుంది హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. పసుపు కొద్దిగా తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.

English summary

Suffering From Irregular Periods ? Try These Natural Remedies, It Helps !

Irregular periods are something that most of the menstruating women might have experienced. A day or two here and there after their exact 28 days of period cycle can be fine, but if the period occurs a week ahead of their normal time or is delayed by over a week, then it might be a cause of concern.
Story first published: Friday, October 21, 2016, 16:34 [IST]
Desktop Bottom Promotion