థైరాయిడ్ హార్మోనులు రెగ్యులేట్ చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...

Subscribe to Boldsky

శరీరంలో జీవక్రియలు ముఖ్యమైన విధులను నిర్వహించడానికి థైరాయిడ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్న విషయం మీకు తెలుసా? అటువంటి థైరాయిడ్ హార్మోన్స్ అసమతుల్యత వల్ల థైరాయిడ్ కు సంబంధించిన సీరియస్ వ్యాధులకు కారణమవుతుంది. థైరాయిడ్ హార్మోనులను సమతుల్యం చేయడానికి కొన్ని పురాతకాలం నాటి హోం రెమెడీస్ గొప్పగా సహాయపడుతాయి.

శరీరంలో జీవక్రియలు పనిచేయాలంటే థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. అదే విధంగా, శరీరంలో థైరాయిడ్ గ్రంథి మరో ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంథి కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది.

This Ancient Home Remedy Can Regulate Your Thyroid Hormones!

థైరాయిడ్ గ్రంథి అనారోగ్యానికి గురైనప్పుడు, శరీరంలో జీవక్రియల మీద తీవ్రదుష్ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోతే, హార్మోనుల్లో అసమతుల్యతలు ఏర్పడుతాయి.

natural remedies for thyroid hormones

థైరాయిడ్ కు సంబంధించిన రెండు రకాల వ్యాధులు ఎదుర్కోవల్సి వస్తుంది. థైరాయిడ్ గ్రంథులు ఇన్ యాక్టివ్ గా ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం , మరియు థైరాయిడిజం గ్రంథులు ఓవరాక్టివ్ గా ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం సమస్యలు వస్తాయి.

థైరాయిడ్ కు సంబంధించిన వ్యాధుల యొక్క లక్షణాలు, ఆందోళన, ఎక్కువగా చెమటలు పట్టడం, వాసన గ్రహించలేకపోవడం, బరువు పెరగడం, సెడెన్ గా బరువు తగ్గడం, అలసట, తరచూ మానసికంగా మార్పులు, డిప్రెషన్ వంటివి ఎదుర్కోవల్సి వస్తుంది.

natural remedies for thyroid hormones

అందువల్ల థైరాయిడ్ గ్రంథులు ఆరోగ్యకరంగా ఉంచుకోవడం చాలా అవసరం. హెల్తీ థైరాయిడ్ గ్రంథుల కోసం కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే.థైరాయిడ్ హార్మోన్స్ ను సమతుల్యం చేసుకోవడానికి హోం రెమెడీస్ ను ఎలా తయారుచేయాలి.ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం...

కావల్సినవి:

అల్లం జ్యూస్ : 1టేబుల్ స్పూన్

క్రాన్ బెర్రీ జ్యూస్: 1/2కప్పు

ఆరెంజ్ జ్యూస్ : 1/2కప్పు

నిమ్మరసం : 1టీస్పూన్

natural remedies for thyroid hormones

ఈ రిసిపి థైరాయిడ్ హార్మోన్స్ ను సమతుల్యం చేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా హెల్తీ డైట్ ను ఫాలో అయినప్పుడు, రెగ్యులర్ వ్యాయమం వల్ల థైరాయిడ్ సమస్యలను నివారించుకోవచ్చు.

అల్లం, క్రాన్ బెర్రీ, ఆరెంజ్ మరియు నిమ్మ కాంబినేషన్ జ్యూస్ శరీరానికి నేచురల్ డిటాక్సిపైయర్ గా పనిచేస్తుంది., శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది. శరీరంలో మలినాలు లేకుండా చేస్తుంది. థైరాయిడ్ గ్రంథులు నార్మల్ గా పనిచేయడానికి ఇవి చాలా అవసరం.

అదనంగా ,ఈ హోం మేడ్ రిసిపిలో థైరాయిడ్ హార్మోన్స్ ను హెల్తీగా ఉత్పత్తి అవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది.

natural remedies for thyroid hormones

తయారీ:

ఒక గ్లాసులో పైన సూచించిన విధంగా పదార్థాలన్నింటిని తీసుకోవాలి.

స్పూన్ తో మొత్తం బాగా మిక్స్ చేయాలి.

అంతే హెల్తీ థైరాయిడ్ డ్రింక్ తాగడానికి రెడీగా ఉంది.

ఈ హెల్త్ డ్రింక్ తయారుచేయడానికి పంచదార, ఇతర ఫ్లేవరింగ్ ఏజెంట్స్ జోడించకూడదు.

ఈ హెల్త్ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం పరగడపున ఒక నెలరోజుల పాటు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

This Ancient Home Remedy Can Regulate Your Thyroid Hormones!

Did you know that thyroid hormone imbalance can cause serious thyroid-related disorders? Well, there is an ancient remedy that can help regulate your thyroid hormones!
Please Wait while comments are loading...
Subscribe Newsletter