For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తినకూడని ఆహారాలు..

కామన్ కోల్డ్ , జ్వరం మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవడానికి హిస్టమైన్ అధికంగా ఉన్న ఆహారాలు లేదా శరీరంలో హిస్టైమైన్ లెవల్స్ ను పెంచే ఆహారాలకు ఖచ్చితంగా నో చెప్పాలి.

|

సాధారణంగా ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్‌ఫెక్షన్లు సులభంగా దాడిచేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ప్రతి పదిమందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన వైరల్ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఎక్కువమందిని బాధించే వైరల్ ఇన్‌ఫెక్షన్లలో ఫ్లూ జ్వరం కూడా ఒకటి.

ఫ్లూ లక్షణాలేంటి
ఫ్లూ వ్యాధి వంటి వైరల్ జ్వరాలకు గురైనవారిలో ఒంటినొప్పులు, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఆహారం తీసుకోలేకపోవడం, గొంతునొప్పి, ముక్కు కారడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారిలో జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చాలావరకు వైరల్ జ్వరాలు వాటికవే 5 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి, వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి. ఫ్లూ జ్వరానికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం ఒక ఇంజెక్షన్ వేయించుకుంటే ఇక ఏ ఇబ్బందీ ఉండదు.

 Foods You Should Avoid When You Have Viral Flu

చిన్నారుల్లోనే ఎక్కువ
చల్లని వాతావరణంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య పడిపోతుంది. శరీర వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. పిల్లలకు స్కూళ్లు కూడా ఈ సీజన్‌లోనే ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎక్కువమంది గుమిగూడి ఉండే చోట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్నారుల్లో వైరల్ జ్వరాలు ఎక్కువ. అదేవిధంగా పుణ్యక్షేత్రాల వంటి ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఫ్లూ జ్వరం బారిన పడే అవకాశం ఉంది.

కామన్ కోల్డ్ , జ్వరం మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవడానికి హిస్టమైన్ అధికంగా ఉన్న ఆహారాలు లేదా శరీరంలో హిస్టైమైన్ లెవల్స్ ను పెంచే ఆహారాలకు ఖచ్చితంగా నో చెప్పాలి. అదే విధంగా శరీరంలో గల్ల(మ్యూకస్)ఉత్పత్తిని ప్రోత్సహించే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఇవి పొట్టలో ఆమ్లాలాల ఉత్పత్తికి మరియు శరీరంలో అసిడిక్ రిఫ్లెక్షన్ కు దారితీస్తుంది. ఫ్లూ, జ్వరం, కోల్డ్, ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు, మనం తీసుకునే కొన్ని రకాల ఫుడ్స్ జబ్బులను నయం చేయకపోగా మరింత జబ్బుపడేలా చేసే ఈ క్రింది తెలిపిన ఆహారాలకు నో చెప్పండి...వైరల్ ఫ్లూ నుండి తేరుకోండి...

పాలు

పాలు

డైరీ ప్రొడక్ట్స్ లో పాలు ఒకటి. శరీరంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కు కారణం అవుతాయి ఈ డైరీ ప్రొడక్ట్స్ . డైరీ ఫ్రొడక్ట్స్ లో ఉండే క్యాల్షియం శరీరంలో మ్యూకస్ ఏర్పడటానికి కారణం అవుతుంది . కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. వీటికి ప్రత్యామ్యాయంగా లోఫ్యాట్ కలిగిన ఫ్రోజ్ పెరుగు తీసుకోవచ్చు.

రెడ్ మీట్ :

రెడ్ మీట్ :

అసిడిక్ ఫుడ్స్ కు కంప్లీట్ గా దూరంగా ఉండాలి. అసిడిక్ ఫుడ్స్ లో రెడ్ మీట్ లో ఎక్కువ అసిడిక్ లక్షనాలుండి, నేచురల్ అసిడ్స్ తో కలిసిపోవడం వల్ల త్వరగా జబ్బుపడేందుకు కారణం అవుతాయి . జలుబు చేసినప్పుడు అసిడిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అధికంగా ఇన్ఫ్లమేషన్ కు మరియు శరీరంలో మరిన్ని ఆమ్లాలాలు ప్రసరణకు కారణం అవుతుంది.

స్పైసీ ఫుడ్స్:

స్పైసీ ఫుడ్స్:

స్పైసీ ఫుడ్స్ ను తినడం వల్ల వైరల్ ఫీవర్, ఫ్లూవంటి లక్షణాలు త్వరగా తగ్గవు. కాబట్టి, బాగా జీర్ణమయ్యే ఆహారాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే శరీరంలోని పోషకాలు త్వరగా షోషింపబడే ఆహారాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ పోషకాలను అందించే ఆహారాలను మాత్రమే ఎపింక చేసుకోవాలి. స్పైసీ ఫుడ్స్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

ఆయిల్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ :

ఆయిల్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ :

ఆయిల్ ఫుడ్స్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వైరల్ ఫ్లూ ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలు త్వరగా జీర్ణమవ్వవు. అంతే కాదు ఇలాంటి ఆహారాలు తిన్నప్పుడు, జీర్ణమవ్వడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది.

చీజ్ :

చీజ్ :

డైరీ ప్రొడక్ట్స్ లో మరో పదార్థం చీజ్ , ఫ్లూతో బాధపడే వారు, తప్పనిసరిగా చీజ్ కు కూడా దూరంగా ఉండాలి. . దీన్ని తినడం వల్ల మ్యూకస్ ప్రొడక్షన్ కు దారితీస్తుంది.

టీ లేదా కాఫీ

టీ లేదా కాఫీ

విశ్రాంతి కొరకు బెడ్ రెస్ట్ తీసుకునే వారు , ఫ్లూ , ఫీవర్ వంటి లక్షణాలున్నప్పుడు కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. ఇది స్ట్రాంగ్ డ్యూరియాటిక్ . ఇవి శరీరంలో నీరును పూర్తిగా తొలగించేసి, డీహైడ్రేషన్ కు గురిచేస్తాయి. కాబట్టి, ఫ్లూ, ఫీవర్ ఉన్నప్పుడు టీ కాఫీలకు దూరంగా ఉండాలి

English summary

Foods You Should Avoid When You Have Viral Flu

Viral flu is caused by the influenza virus. This infectious viral illness can be spread by coughs and sneezes. Having flu is an irritating experience, but you will get better within one week with proper rest and by opting for the right kinds of foods.
Desktop Bottom Promotion