For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్త్మా, జలుబు, గొంతునొప్పి, వికారం &నోస్ బ్లీడింగ్ నివారణకు ఎఫెక్టివ్ రెమెడీస్

సహజంగా మన వంట గదిలో ఉండే కొన్ని పదార్థాలు అంటే సాల్ట్ , పెప్పర్, లెమన్, టర్మరిక్ వంటివి వంటలు రుచిగా ఉండటం కోసం మాత్రమే ఉపయోగిస్తుంటాము. అయితే వీటిని హోం రెమెడీస్ లో కూడా ఉపయోగిస్తారన్న విషయం మీకు తెల

|

సహజంగా మన వంట గదిలో ఉండే కొన్ని పదార్థాలు అంటే సాల్ట్ , పెప్పర్, లెమన్, టర్మరిక్ వంటివి వంటలు రుచిగా ఉండటం కోసం మాత్రమే ఉపయోగిస్తుంటాము. అయితే వీటిని హోం రెమెడీస్ లో కూడా ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా..?

Remedies For Nosebleed, Asthma, Sore Throat, Nausea & Cold

వాస్తవానికి పెప్పర్, లెమన్, హనీ, సాల్ట్ వంటివి వివిధ రకాల హోం రెమెడీస్ లో ఉపయోగించడానికి ముఖ్యకారణం వాటిలో ఉండే ఔషధ గుణాలే. ఈ ఔషధ గుణాలు మన శరీరంలో వచ్చే అనేక వ్యాధులను నివారించడంలో , నయం చేయడంలో గొప్పగా సహాయపడుతాయి. ముఖ్యంగా బరువు తగ్గించడం దగ్గర నుండి, ఆస్త్మా వరకూ చిన్న ఇన్ఫెక్షన్స్ నుండి పెద్ద జబ్బుల వరకూ అన్ని రకాల వ్యాధులను నివారించడంలో ఇవి హోం రెమెడీస్ గా ఉపయోగపడుతాయి.

అంతే కాదు, ఇంకా ఇవి గొంతు నొప్పి, దగ్గు, వికారం, జలుబు, దగ్గు, దంత సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి. పైన సూచించిన పదార్థాలను హోం రెమెడీస్ గా ఉపయోగించడం వల్ల ఎలాంటి వ్యాధులను నివారించుకోవచ్చో తెలుసుకుందాం..

ముక్కు నుండి రక్త కారడాన్ని నివారిస్తుంది:

ముక్కు నుండి రక్త కారడాన్ని నివారిస్తుంది:

ముక్కు డ్రైగా మారితే ముక్కు నుండి రక్త కారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే, ఒక స్పూన్ లెమన్ జ్యూస్ లో కాటన్ డిప్ చేసి ముక్కు రంద్రాల వద్ద పెట్టుకోవాలి. ఈ వాసనకు ముక్కు నుండి రక్తస్రావం ఆగిపోతుంది.

జలుబు:

జలుబు:

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల నిమ్మరసం మూడు టీస్పూన్ల తేనె మిక్స్ చేసి, రోజుకు రెండు సార్లు తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.

గొంతు నొప్పి :

గొంతు నొప్పి :

ఒక గ్లాసు నీటిలో చిటికెడు పెప్పర్ పౌడర్ మరియు 3 టీస్పూన్ల నిమ్మరసం, చిటికెడు ఉప్పు మిక్స్ చేసి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గాలని కోరుకునే వారు, అర టీస్పూన్ పెప్పర్, ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం ఫ్యాట్ చేరడాన్ని నివారిస్తుంది.

ఆస్త్మా అరికడుతుంది:

ఆస్త్మా అరికడుతుంది:

ఆస్త్మా నివారించుకోవడానికి, కొన్ని తులసి ఆకులు తీసుకుని, అందులో ఒక టీస్పూన్ పెప్పర్, 4 లవంగాలు వేసి తక్కువ మంట మీద 15 నిముషాలు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత రోజుకు మూడు టీస్పూన్లు తాగితే చాలు ఆస్త్మా నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

దంతాల నొప్పి:

దంతాల నొప్పి:

కొన్ని చుక్కల లవంగం నూనె మరియు చిటికెడు పెప్పర్ పౌడర్ మిక్స్ చేసి, నొప్పి కలిగించే దంతాల మీద అప్లై చేసి మర్ధన చేయాలి. ఇది దంతాల నొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

వికారం:

వికారం:

వికారంగా ఉన్నప్పుడు, ఒక టీస్పూన్ పెప్పర్ పౌడర్ ను ఒక కప్పు గోరువెచ్చనీ నీటిలో మిక్స్ చేయాలి. అలాగే ఒక టీస్పూన్ లెమన్ జ్యూస్ కూడా మిక్స్ చేసి తాగడం వల్ల వికారం నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

English summary

Remedies For Nosebleed, Asthma, Sore Throat, Nausea & Cold

Some ingredients like lemon, honey, salt and pepper can do miracles. Here are some remedies for nosebleed, asthma & sore throat...
Story first published: Friday, February 10, 2017, 17:45 [IST]
Desktop Bottom Promotion