For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ పెయిన్ తో బాధపడుతున్నారా..?నొప్పిని పోగేట్టే నేచురల్ రెమెడీస్..!

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు. కిడ్నీల ముఖ్యమైన పనేంటంటే...శరీరంలో వ్యర్థాలన్నింటీని యూరిన్ రూపంలో బయటకు నెట్టేస్తుంది.

|

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు. కిడ్నీల ముఖ్యమైన పనేంటంటే...శరీరంలో వ్యర్థాలన్నింటీని యూరిన్ రూపంలో బయటకు నెట్టేస్తుంది.

అలాంటి కిడ్నీలకు ఏదైనా డ్యామేజ్ కలిగిందంటే...శరీరం మొత్తం ప్రక్రియ మీద ప్రభావం చూపుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే మని ఆరోగ్యంగా ఉండగలడు. ఎప్పుడైతే వ్యర్థాలు శరీరంలో నిల్వ ఉండిపోతాయో అప్పుడు, అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. శరీరంలో ఏం జరగుతుందో మనకు తెలియదు. ఉన్న ఫలంగా కిడ్నీలో నొప్పి. కాబట్టి, కిడ్నీలను హెల్తీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

కిడ్నీ స్టోన్స్ నివారించే ఆయుర్వేదిక్ రెమెడీస్

కిడ్నీ పెయిన్ ను ఎలా నివారించుకోవాలి? కిడ్నీ పెయిన్ నివారించుకోవడం కోసం వివిధ రకాల నేచురల్ రెమెడీస్ ఉన్నాయి.

అసలు కిడ్నీ పెయిన్ ఎందుకు వస్తుంది. ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం వల్ల కిడ్నీలో నొప్పి రావచ్చు. కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ ఉన్నట్లైతే లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. తరచూ పెయిన్ క్రమంగా పెరుగుతుంటుంది. ఒక వైపు బుటెక్స్ మరియు లోయర్ రిబ్స్ ఎక్కువ పెయిన్ కు గురి అవుతాయి. అందువల్ల కిడ్నీ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా..

వాటర్ ఎక్కువగా తాగాలి:

వాటర్ ఎక్కువగా తాగాలి:

ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది.యూరినరీ బ్లాడర్ నుండి రాళ్ళను యూరిన్ ద్వారా బయటకు నెట్టేస్తుంది. దాంతో కిడ్నీ పెయిన్ క్రమంగా తగ్గుతుంది.

వాటర్ మెలోన్ సీడ్స్ :

వాటర్ మెలోన్ సీడ్స్ :

వాటర్ మెలోన్ సీడ్స్ లో శరీరంలోని వ్యర్థాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. కిడ్నీలను శుబ్రం చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ వాటర్ మెలోన్ సీడ్స్ ను ఒక గ్లాసు బాయిలింగ్ వాటర్ లో వేసి ఉడికించాలి. 5 నిముషాల తర్వాత క్రిందికి దింపుకుని, గోరువెచ్చగా అయిన తర్వాత వడగట్టి రోజులో రెండు మూడు సార్లు తాగాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

ఒక టీస్పూన్ నిమ్మరసం తీసుకుని, ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి, రోజూ పరగడుపున తాగాలి. నిమ్మరసంలో ఎసిటిక్ యాసిడ్స్ కిడ్నీ స్టోన్స్ ను కిరగిస్తుంది. కిడ్నీలలోని టాక్సిన్స్ ను నివారిస్తుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్లో , ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి రోజూ తీసుకోవడం వల్ల కిడ్నీ పెయిన్ నివారిస్తుంది.

కొత్తిమీర :

కొత్తిమీర :

ఒక టీస్పూన్ ధనియాలు తీసుకుని, మెత్తగా పౌడర్ చేయాలి. తర్వాత దీన్ని ఒక గ్లాసు వేడినీటిలో మిక్స్ చేయాలి. మూత పెట్టి 10 నిముషాలు తర్వాత స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి. తర్వాత తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది కిడ్నీలలోని వ్యర్థాలను తొలగిస్తుంది, నొప్పి నివారిస్తుంది.

ఆవాలు :

ఆవాలు :

ఒక టీస్పూన్ ఆవాలు తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ ల గోధుమ పిండి మిక్స్ చేయాలి. తర్వాత నీళ్ళు లేదా ఎగ్ వైట్ మిక్స్ చేసి, చిక్కట పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను క్లాత్ మీద వేసి ఉంచాలి. ఇప్పుడు నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్రోలియం జెల్లీని రాసి, తర్వాత ఈ క్లాత్ ను అక్కడ కప్పి ఉంచాలి. అరగంట అలాగే నొప్పి ఉన్న చోట ఉంచి, తర్వాత తీసేయాలి. ఇలా నొప్పి తగ్గే వరకూ ప్రయత్నిస్తుండాలి.

క్యాబేజ్ ఆకులు:

క్యాబేజ్ ఆకులు:

రెండు మూడు క్యాబేజ్ ఆకులు, రెండు ఉల్లిపాయలు ముక్లకుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ ను పాన్ లో పోసి వేడి చేయాలి.క్యాబేజ్ , ఉల్లిముక్కలు కూడా వేసి బాగా ఉడికించాలి, వాటర్ పూర్తిగా అయిపోయే వరకూ ఉడికించాలి. తర్వాత క్రిందికి దింపుకుని, గోరువెచ్చగా ఉన్నప్పడు నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, క్లాత్ చుట్టాలి. రాత్రుల్లో రెండు మూడు గంటలా ఇలా చేస్తే నొప్పి తగ్గిపోతుంది.

తులసి :

తులసి :

తులసి ఒక నేచురల్ పదార్థం, ఇది కిడ్నీలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. కిడ్నీ స్టోన్స్ తొలగిస్తుంది. తులసి రసాన్ని తీసుకుని, అందులో ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి, మూడు నాలుగు నెలలు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది.

English summary

Suffering From Kidney Pain? Here Are These Quick Natural Remedies That Actually Work

Listed here are a few of the best natural ways to get rid of kidney pain, that may be caused due to the formation of stones or even infection.
Desktop Bottom Promotion