For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మామిడాకుల్లో లెక్క పెట్టలేనన్ని అద్భుత ఆరోగ్య రహస్యాలు..!!

వేసవిలో మామిడికాయల రుచి చూడాల్సిందే..ఎందుకో తెలుసా పండ్లలో రారాజుగా పిలుచుకునే మామిడిపండ్లు అద్భుతమైన రుచి, వాసన, రంగుతో నోరూరిస్తుంటాయి.

|

వేసవిలో మామిడికాయల రుచి చూడాల్సిందే..ఎందుకో తెలుసా పండ్లలో రారాజుగా పిలుచుకునే మామిడిపండ్లు అద్భుతమైన రుచి, వాసన, రంగుతో నోరూరిస్తుంటాయి. అందుకే సమ్మర్ ఎప్పుడెప్పుడు వస్తుందా...అని ఎదురుచూసే వారుండారంటే ఆశ్చర్యం కలగక మానదు. సమ్మర్లో ధ్యాసంతా మామిడికాయల మీదే కాదు, మామిడి ఆకుల మీద కూడా పెట్టాలంటోంది సైన్స్.

మామిడి ఆకులు మామూలు ఆకులు కాదంటోంది. ఎందుకంటే మామిడి ఆకుల్లో న్యూట్రీషియన్ వ్యాల్యూస్ అధికమట. మామిడి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ తో పాటు కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఫెవోనాయిడ్స్, సాపోనిన్స్, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ ఫెవనాయిడ్స్ , యాంటీ మైక్రోబయల్ కాంపోనెంట్స్ ...అబ్బో ఇకా మరెన్నో న్యూట్రీసియన్స్ దాగున్నయాట.

మామిడి ఆకుల్లో చాలా సైన్స్ దాగుంది కాబట్టే వేల సంవత్సరాలుగా మన ఇంటి గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవడం సంప్రదాయంగా ఉంటూ వస్తోంది .మామిడి ఆకుల వలన కలిగే ప్రయోజనాల గురించి దాదాపు మనలో చాలా మందికి అవగాహన లేదు. పోషకాలను కలిగి ఉండే మామిడి ఆకులు ఫినోలిక్ సమ్మేళనాలు మరియు ఫ్లావనాయిడ్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. వివిధ రకాల రుగ్మతలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉండే మామిడి ఆకులను ఆయుర్వేద వైద్యశాస్త్రంలో వాడతారు. మామిడి ఆకులును నీళ్లలో మరిగించడం లేదా పౌడర్ చేసి ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. మరి మామిడి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటో తెలుసుకుందాం..

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

మామిడి ఆకులు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ కు కారణమయ్యే హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. రోజూ ఒక కప్పు మ్యాంగో లీవ్స్ టీ తాగడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

 డయాబెటిస్ ను నివారిస్తుంది:

డయాబెటిస్ ను నివారిస్తుంది:

ఖచ్చితంగా అవుననే అంటున్నారు నిపుణులు, మామిడి ఆకుల్లో ఉండే టానిన్స్, యాంతో సైనిన్స్ డయాబెటిస్ ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుందని , అలాగే వ్యాస్కులర్ రిలేటెడ్ సమస్యలను కూడా నివారిస్తుందని సూచిస్తున్నారు. కాబట్టి, రోజుకు ఒక కప్పు మ్యాంగో లీప్ టీ తాగడం మర్చిపోకండి.

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

అన్ని రకాల శ్వాస సంబంధి సమస్యలను నివారించడంలో మాంగో లీఫ్స్ టీ గొప్పగా సహాయపడుతుంది. కామన్ కోల్డ్, బ్రొకైటిస్, ఆస్త్మా వంటి సమస్యలతో బాధపడే వారు, మ్యాంగో లీఫ్ టీని తాగడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

చెవి నిప్పిని తగ్గిస్తుంది:

చెవి నిప్పిని తగ్గిస్తుంది:

చెవి నొప్పితో బాధపడుతున్నారా? అయితే మీకో ఎఫెక్టివ్ హోం రెమెడీ ఉంది. మ్యాంగో లీఫ్ జ్యూస్ ను లైట్ గా వేడి చేసి, ఒకటి రెండు చుక్కలు చెవిలో వేసుకోవడం వల్ల అద్బుతంగా పనిచేసి, నొప్పిని తగ్గిస్తుంది.

కాలిన గాయాలను మాన్పుతుంది:

కాలిన గాయాలను మాన్పుతుంది:

కాలిన గాయాలను మామిడి ఆకులు గొప్పగా మాన్పుతాయి. మ్యాంగో లీవ్స్ ను కాల్చాలి, కాల్చిన మామిడి ఆకలు పొడి (యాష్)ని కాలిన గాయాల మీద చల్లితే చాలు త్వరిత ఉపశమనం కలుగుతుంది.

యూరిక్ యాసిడ్ , వాటి సంబంధిత డిజార్డర్స్ ను నివారిస్తుంది:

యూరిక్ యాసిడ్ , వాటి సంబంధిత డిజార్డర్స్ ను నివారిస్తుంది:

మామిడిఆకులు గౌట్ సమస్యలను నివారించడంలో ఎపెక్టివ్ గా సహాయపడుతుంది. కొన్ని పచ్చిగా ఉన్న మామిడి ఆకలును తీసుకుని, నీటిలో వేసి అవి ఎల్లో కలర్లోకి మారే వరకూ ఉడికించాలి. ఈ వాటర్ ను రోజూ కొద్దిగా తాగడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల గౌట్ పెయిన్ తగ్గుతుంది.

స్ట్రెస్ తగ్గిస్తుంది:

స్ట్రెస్ తగ్గిస్తుంది:

చాలా మంది విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తుంటారు, అలాంటివారు తరచూ స్ట్రెస్ కు లోనవుతుంటారు, వీరికి స్ట్రెస్ నుండి బయటపడాలంటే పచ్చి మామిడి ఆకులను మరిగించిన టీని తాగడం వల్ల డిఫెరెన్స్ ను ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ టీ నాడీవ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. రిఫ్రెష్ గా ఫీలవుతారు.

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది:

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది:

మామిడి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, వాటర్ తో మిక్స్ చేసి, రోజూ ఉదయం తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ తొలగిపోతాయి. కిడ్నీ స్టోన్స్ ను తొలగించుకోవడానికి ఇది ఒక సింపుల్ ఎఫెక్టివ్ హోం రెమెడీ.

గొంతు నొప్పిని తగ్గిస్తుంది:

గొంతు నొప్పిని తగ్గిస్తుంది:

గొంతు నొప్పి మాత్రమే కాదు, గొంతుకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా మామిడి ఆకులు తగ్గిస్తుంది. కొన్ని మామిడి ఆకులను బర్న్ చేయాలి. బర్న్ అయ్యే సమయంలో వచ్చే వాసను పీల్చడం వల్ల గొంత సమస్యలు నయం అవుతాయి.

దంతసంరక్షణకుం

దంతసంరక్షణకుం

మామిడి ఆకులు నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. చిగుళ్ల సమస్యలు, దంత సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. అందుకు కారణం వీటిలో ఉండే మెడిసినల్ వ్యాల్యూస్ వల్లే..

మామిడి ఆకుల వలన గొప్ప ప్రయోజనాలను, వివిధ రకాల ద్వారా పొందవచ్చు, కానీ, టీలో ఉండే సమ్మేళనాలతో అలర్జీ కలిగి ఉండకూడదు. అంతేకాకుండా, ఆకులు సేకరించే చెట్టుకు ఎలాంటి లాటేక్స్ ను కలిగి ఉండకూడదు. ఎందుకంటే వీటి వలన అనారోగ్యానికి లేదా చర్మంపై గాయాలు అయ్యే అవకాశం ఉంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి.

English summary

These 10 Medicinal Properties Of Mango Leaves Will Amaze You!

If you want to know how mango leaves are beneficial for your health, then you need to read this article. It has plenty of health benefits than you thought!
Story first published: Tuesday, April 11, 2017, 17:11 [IST]
Desktop Bottom Promotion