For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరిగా నిద్ర పట్టట్లేదా...? చాలా చాలా సింపుల్ టిప్స్ ..!!

నిద్రలేమి, లేదా సరిగ్గా నిద్రపట్టకపోవటం అనేది చాలా మామూలు సమస్య మీ ఆహారంలో మార్పు చేసుకొని, భోజనంలో అమినొ ఆసిడ్ల మోతాదు సరిగ్గా చూసుకొంటే మీకు చక్కగా నిద్రపట్టే మార్గం లభించినట్టే. బాగా నిద్రపట్టాలంటే

|

రాత్రి నిద్ర సరిగా లేకపోతే, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇక ఆ రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. ఏ పనీ చేయబుద్ధి కాదు. మరి రాత్రి వేళ గాఢంగా నిద్రించాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా చెప్పాలంటే, మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటినిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. పరిశీలించండి.

సాధారణంగా చాలా మందిని మనం గమనించినట్లైతే.. కారణం లేకుండా నిద్రపట్టక ఇబ్బంది పడేవారు. పడుకొన్న వెంటనే హాయిగా నిద్రపట్టాలని భావించేవారు కొందరు ఉన్నారు. మన మెదడుకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నపుడే మనకు చక్కని నిద్ర పడుతుంది. మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటే అరుగుదల లేకపోవటం వలన నిద్రాభంగం అవుతుంది.

నిద్రలేమి, లేదా సరిగ్గా నిద్రపట్టకపోవటం అనేది చాలా మామూలు సమస్య మీ ఆహారంలో మార్పు చేసుకొని, భోజనంలో అమినొ ఆసిడ్ల మోతాదు సరిగ్గా చూసుకొంటే మీకు చక్కగా నిద్రపట్టే మార్గం లభించినట్టే. బాగా నిద్రపట్టాలంటే కొన్ని కామన్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

చెర్రీస్ :

చెర్రీస్ :

చెర్రీస్ లో మెలటోనిన్ అనే కెమికల్ శరీరంలో ఇంటర్నల్ క్లాక్ గా పనిచేస్తుంది. ఇది ఒక ఎక్సపరిమెంటల్ గా పనిచేస్తుంది. రాత్రి నిద్రించడానికి ముందు ఫ్రెష్ గా ఉండే చెర్రీస్ తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. చెర్రీస్ అందుబాటులో లేనప్పుడు చెర్రీ జ్యూస్ కూడా తాగవచ్చు. ప్రతి ఫంక్షన్ బోజనలలో కిల్లితో పాటు ఈ చెర్రీ పండుని అందించడం ఎక్కువుగా చూస్తున్నాం. ఇవి కాశ్మీర్ లో పండుతాయి. ఇందులో పొటాషియం ఎక్కువుగా లబిస్తది. చెర్రీ రసంలో మెలటోనిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రని క్రమబద్ధం చేసే హార్మోను. రాత్రి నిద్రించేముందు చెర్రీ రసం తీసుకోవటం వలన నిద్ర సమస్యలను తొలగిస్తుంది. దీనివలన మరింత మంచిఫలితం కావాలంటే ప్రతిరోజు ఒక క్రమపద్ధతిలో దీనిని తీసుకోవాలి. చెర్రీ పండ్లలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉండటం వల్ల నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.

గోరు వెచ్చని పాలు:

గోరు వెచ్చని పాలు:

గోరువెచ్చని పాలు నిద్రని ఆహ్వానిస్తాయని మన పెద్దలకాలంనుంచీ వస్తున్న ఆనవాయితీ. మెదడును శాంతపరిచి నిద్ర కలిగించే నాడీప్రసారకాలు(న్యూరోట్రాన్స్ మీటర్), ట్రైటోపాస్ దాదాపు అన్ని పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుంది. ఒక గ్లాసు పాలు (చక్కెర గాని మరే తీపి పధార్థమైన కాని చేర్చకుండా) రాత్రి బాగా పొద్దుపోయాక తాగినా, లేదా మీ రాత్రి భోజనంలో పనీర్లాటివి తీసుకున్నా మీకు అందవలసినంత ట్రైటొఫాన్ అందుతుంది. పాలతో తయారైన అన్ని పదార్థాల్లోనూ ట్రైటొఫాన్ ఉంటుంది.

 డైరీ ప్రొడక్ట్స్-

డైరీ ప్రొడక్ట్స్-

రాత్రిపూట నిద్ర పట్టక సతమతమవుతూంటే ట్రిప్టోఫాన్ కలిగిన ఆహారాలు తినటం మొదటి చర్య. ట్రిప్టోఫాన్ అనేది ఒక అత్యవసర ఎమినో యాసిడ్ ఇది శరీరంలోని సెరోటోనిన్ మరియు మెలటోనిన్ స్ధాయిలను అధికం చేస్తుంది. రెండూ కూడా గాఢ నిద్ర పట్టించేవే. ఈ రెండూ వుండే ఆహారాలు పెరుగు, పాలు వంటి డైరీ ఉత్పత్తులు.

జాస్మిన్ రైస్:

జాస్మిన్ రైస్:

అమెరికన్ జనరల్ క్లీనికల్ న్యూట్రీషియన్ రీసెర్చ్ ప్రకారం, రాత్రి డిన్నర్ లో ఇతర రైస్ తినే వారితో పోల్చితే జాస్మిన్ రైస్ తినే వారు బాగా గాఢంగా నిద్రించినట్లు కనుగొన్నారు . జాస్మిన్ రైస్ బ్లడ్ లో ట్రైప్టాపాన్స్ సెరటోనిన్ లు నిద్రను ప్రోత్సహిస్తాయి . మెదడులోని నాడులను విశ్రాంతి పరిచి, నిద్రను ప్రోత్సహిస్తాయి.

అరటిపండ్లు :

అరటిపండ్లు :

అరటిపళ్లలో మెగ్నీషియం, పొటాషియం హెచ్చుమోతాదులో ఉన్నాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కని నిద్రపట్టేలా చేస్తాయి. అరటి పండు మనం నిద్రిస్తున్నపుడు రక్తపోటుని కూడా నియం త్రించగలుగుతుంది. అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు. అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.

తున ఫిష్ :

తున ఫిష్ :

చాలా వరకూ అన్ని రకాల చేపలు ముఖ్యంగా సాల్మన్ మరియు తున చేపల్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండి నిద్రపట్టేందుకు బాగా సహకరిస్తాయి. కాబట్టి నిద్ర పట్టాలంటే ఈ ఫుడ్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే..

బాదం :

బాదం :

బాదంలో మెగ్నీషియం పుష్కలంగా నిద్రకు బాగా సహాయపడుతాయి. అంతే కాదు మజిల్స్ రిలాక్స్ అయ్యేలా సహకరిస్తాయి. కాబట్టి నిద్రించే ముందు వీటిని ఒక స్పూన్ ఫుల్ గా తిని గాఢ నిద్రను పొందండి.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

ఆశ్చర్యం కదా!అంటే డీ కేఫీనెటెడ్ టీ అనగా చమోమైల్ టీ లేదా గ్రీన్ టీ వంటివి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. వీటిలో థైమిన్ అనే మూలకం నిద్రపొందుటకు బాగా సహాయపడుతాయి.

English summary

These Common Foods Will Help You Fall Asleep Faster

If you're having sleep problems, there might be a simple solution. Particular foods can considerably increase your chances of a successful night's slumber. Eat these common foods to fall asleep faster and to get good sleep at night.
Story first published: Monday, February 20, 2017, 17:15 [IST]
Desktop Bottom Promotion