For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలెస్ట్రాల్ లెవల్స్ ను వేగంగా తగ్గించే ఇండియన్ ఫుడ్స్

|

శరీరానికి అనేక పోషకాలు అవసరం అవుతాయి. విటమిన్స్, మినిరల్స్ , న్యూట్రీషియన్స్ మాత్రమే కాదు, శరీరానికి ఎంతో కొంత కొలెస్ట్రాల్ కూడా అవసరం అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ హార్మోనులు ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతాయి. అలాగే శరీరంలో విటమిన్ డి కూడా పెరుగుతుంది.

మన శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే కొలెస్ట్రాల్ ను మన శరీరం తయారుచేసుకోగలదు. అది మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారం నుండి తయారవుతుంది. ఇది మాత్రమే కాకుండా మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల ద్వారా కూడా మన శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ అందుతుంది.

కొలెస్ట్రాల్ లిప్పోప్రోటిన్స్ రూపంలో ధమన ద్వారా ప్రవహిస్తుంది. ఈ లిప్పో ప్రోటిన్స్ రెండు రకాలు . వాటిలో ఒకటి లోడెన్సిటి లిప్పో ప్రోటీన్ (ఎల్ డిఎల్ )ఇది చెడు కొలెస్ట్రాల్. ఇది ధమనుల్లో కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. రెండవది హైడెన్సిటి లిప్పో ప్రోటీన్(హెచ్ డి ఎల్ ) . ఇది మంచి కొలెస్ట్రాల్ . ఇది మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది. ఇది కాలేయంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయడుతుంది.

These Indian Foods Help Reduce Cholesterol Quickly

శరీరంలో ఎల్ డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ చేరడం అత్యంత ప్రమాధకరం . ఇది ధమనుల్లో పాచి లాగే ఏర్పడుతుంది. దాంతో రక్త ప్రసరణ సరిగా జరగదు . అది కార్డియో వాస్క్యులర్ డిసీజ్ కు కారణం అవుతుంది.

చెడు కొలెస్ట్రాల్ ను చాలా సింపుల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు . అది కొన్ని సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోం రెమెడీస్ ద్వారానే జరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే కొన్ని పవర్ ఫుల్ ఇండియన్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ధనియాలు:

ధనియాలు:

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను ట్రైగ్లిజరైడ్స్ ను నివారించడంలో ధనియాలు గ్రేట్ గా సహాయపడుతాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అంతే కాదు కాలేయంలో పైత్య రసాలు కూడా పెరిగేలా చేసి, చెడుకొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతాయి.

మెంతులు :

మెంతులు :

కాలేయంలో కొలెస్ట్రాల్ ను బర్న్ చేసే గుణాలు మెండుగా ఉన్నాయి. మెంతులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. మెంతుల్లో ఉండే ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

వెల్లుల్లి :

వెల్లుల్లి :

కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలాంటి మార్పును చూపించకపోయిన, సైటిఫిక్ గా వెల్లుల్లిలో ఉండే పవర్ ఫుల్ గుణాలు మాత్రం కార్డియో వాస్క్యులర్ డిసీజ్ ను తగ్గిస్తుందని సూచిస్తున్నారు. వెల్లుల్లి రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల టోటల్ సెరమ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అయితే హెచ్ డిఎల్ మరియు ట్రై గ్లిజరైడ్స్ మీద అంత ప్రభావాన్ని చూపివ్వదు.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క లిపిడ్ ప్రొఫైల్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో హెచ్ డిఎల్ , ట్రై గ్లిజరైడ్స్ మరియు సెరమ్ గ్లూకోజ్ ను తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ విషయంలో కొన్ని ఎలుకలు, బాయిలర్ కోళ్ళ మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయాన్ని నిర్ధారించారు.

త్రుణ ధాన్యాలు,

త్రుణ ధాన్యాలు,

త్రణ ధాన్యాల్లో బ్రాన్, జెర్మ్ మరియు ఎండో స్పెర్మ్ ను తీసుకుంటారు. త్రుణ ధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. త్రుణధాన్యాలు తినడం వల్ల అందులో ఫైబర్ కంటెంట్ కారణంగా ఎప్పుడూ పొట్ట నిండుగా ఉంటుంది. ఆకలి పెరగకుండా నియంత్రిస్తుంది.

 నట్స్ :

నట్స్ :

బాదం, పిస్తా మరియు వాల్ నట్స్ లో కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఫ్యాట్ అన్ శ్యాచురేడెడ్, మోనో శ్యాచురేట్, మోనో -పాలీ శ్యాచురేటెడ్ ఇవన్నీ హెచ్ డిఎల్ పెరగడానికి సహాయపడుతుంది. అదే విధంగా ఎల్ డిఎల్ ను తగ్గిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే నట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఉల్లిపాయలో ఉండే అల్లిసిన్ , క్యుర్సిటిన్, సపోనిన్స్ మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది. ఎలకల మీద జరిపిన పరిశోధనల్లో మంచి పాజిటివ్ ఫలితాన్నిచ్చిన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలల్లో హెచ్ డిఎల్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ ఎల్ డిఎల్ ను తగ్గిస్తుంది. కాబట్టి, వీటిని ఉడికించినవి లేదా పచ్చివి రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

వర్జిన్ కోకనట్ ఆయిల్ :

వర్జిన్ కోకనట్ ఆయిల్ :

కొబ్బరి నూనెలో ఉండే పాలీఫినాల్స్ శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫాస్పో లిపిడ్స్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

English summary

These Indian Foods Help Reduce Cholesterol Quickly

These Indian Foods Help Reduce Cholesterol Quickly , holesterol is no foe. Only when its quantity goes over the line does it become dangerous to us. Understand cholesterol here.
Story first published: Monday, May 29, 2017, 15:19 [IST]
Desktop Bottom Promotion