For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన గుండెకు పది సూత్రాలు..

|

10 Usefull Tips for Healthy Heart...
ఆరోగ్యకరమైన ఆహారం తినడం: ఆహారంలో ఎక్కువగా పళ్లు, కూరగాయలు ఉండేట్టు చూసుకుంటే అది ఆరోగ్యకరమైన ఆహారంకింద లెక్క. అయితే శాచురేటెట్ నూనెలు వాడకూడదు. ఎక్కువ ఉప్పు ఉండే ప్రాసెస్ ఫుడ్స్ ను బాగా తగ్గించాలి.

1. చరుగ్గా ఉండాలి: అంటే కదులుతూ ఉండడమే. రోజూ అరగంట పాటు నడక, లేదా ఏ ఇతర్ సులభమైనటువంటి వ్యాయామం చేస్తే గుండెపోటు, పక్షవాతం రాకుండా నిరోధించవచ్చు.

2. పొగకు దూరంగా: ఒక సంవత్సరం పాటు పొగతాడం మానేస్తే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగం తగ్గుతుంది. కొన్నేళ్ళు పొగతాగకుండా ఉంటే ఆ రిస్క్ పూర్తిగా పోతుంది కూడా..

3. ఆరోగ్యకరమైన బరువు: అధిక బరువు తగ్గితే, దాంతో పాటు ఉప్పు వాడకం తగ్గిస్తే రక్తపోటు తగ్గుతుంది. పక్షవాతం రావడానికి ముఖ్య కారణం అధిక రక్తపోటే. సగం గుండెపోటు, పక్షవాతాలకు కారణం అధిక రక్తపోటు.

4. మీ ఆరోగ్య సంఖ్యలు తెలుసుకోవాలి: అంటే ఎంత రక్తపోటు, ఎంత కొలెస్ట్రాల్, ఎంత షుగర్ ఉండాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నడుం-పిరుదుల చుట్టుకొలత, బాడీ మాస్, ఇండెక్స్ కూడా అందరూ తెలుసుకోవాలి. వీటిని తెలుసుకోవడం కోసం మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాలి. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపరచుకొనేందుకు ఒక ప్రణాళికను పెట్టుకోవాలి.

5. ఆల్కహాల్ హానీకరం: ఎక్కువగా తాగేవాళ్లకు స్థూలకాయం వచ్చే అవకాశముంది. అలాగే వారి రక్తపోటు కూడా పెరుగుతుంది. ఆరోగ్యం కావాలంటే తాగడం మానేయాలి.

6. ధూమపానం: మీరు పనిచేసే స్థలంలో సిగరెట్ తాగొద్దని చెప్పండి. మీరు తాగకపోయినా వారు తాగి పీల్చే పొగ వల్ల వారికంటే ముందు మీరు జబ్బుపడతారు.

7. శారీరక శ్రమ: అంటే మీరు ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమను కూడా భాగం చేసుకోవాలి. అంటే సైకిల్ తొక్కడం, మెట్లను ఎక్కడం, వీలైనప్పుడంతా నడవడం చేయాలి. శుభ్రమైన గాలి పీల్చడానికి కాసేపు నడవాల్సి వస్తే నడవండి. రోజుకు రెండు సార్లు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఐదు నిమిషాలపాటు చేయొచ్చు. ఈ చిన్ని చిన్న శ్రమలన్నీ మీ ఆరోగ్య ఖాతాలో పడతాయి.

8. బయట ఆహారం: బయట తినేటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. క్యాంటీన్ లో, హోటళ్లలో ఏదంటే అది తినొద్దు.

9. మానసిక ఒత్తిడి: గుండెపోటుకు గానీ, పక్షవాతానికి గానీ మానసిక ఒత్తిడి ప్రత్యక్షకారణం కాదు. కానీ మానసిక ఒత్తిళ్ళ వల్ల పొగతాడం, ఆల్కహాలు తీసుకోవడం, ఏవంటే అవితినడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గుండెపోటు రావడానికి దోహదం చేస్తాయి.

10. కొవ్వు తక్కువగా వుండే స్నాక్స్ తినండి. బర్గర్లు, పిజ్జాలు, వేపుడు బేకరీ ఆహారాలైన ఫాస్ట్ ఫుడ్స్ తినకండి ఇవి మీకు ఆరోగ్యానికి పనికిరావు. వీటిలో కొవ్వు శాతం అధికం. వాటికి బదుటుగా పండ్లు, తాజా కూరగాయలు, కార్బోహైడ్రేట్లు వుండే రైస్, పస్తా, బ్రెడ్ తినండి. తక్కువ కేలరీలు వుండే పానీయాలు తాగండి.

English summary

10 Usefull Tips for Healthy Heart... | గుండె ఆరోగ్యానికి 10 సూత్రాలు..

There are many steps people can take to try to prevent heart disease. You can start by concentrating on key lifestyle areas such as eating, exercise, smoking and drinking, and considering other factors like family history, diabetes and stress. Here are 10 top tips for a healthy heart
Story first published:Monday, October 22, 2012, 16:19 [IST]
Desktop Bottom Promotion