For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవిత కాలాన్ని పెంచే గుండె నేస్తాలు...

|

సాధారణంగా మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఇంధనంలా పని చేస్తుంది. ఆహారం మన శరీరానికి మూడు విధాలుగా ఉపయోగపడుతుంది. అవి శరీర నిర్మాణానికి, శక్తిని చేకూర్చడానికి, శరీర కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి. మన శరీరం పని చేయడానికి ఆహారం, నీరు అతి ముఖ్య మైన పోషకావసరాలు. మన శరీరంలోకి ప్రవేశించే ప్రమా దకరమైన బాక్టీరియాతో పోరాటం సల్పటానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతర శరీర ధర్మాల నిర్వహణకు ఆహారం ద్వారా లభించే రసాయనాల అవసరం ఎంతో ఉంది.

కొన్ని ఆహారాల్లో ఎక్కువగానూ, మరికొన్నింటిలో తక్కువగానూ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. మనం ఎంత తింటున్నామనేది మాత్రమే కాదు, ఏం తింటు న్నామనేది కూడా ముఖ్యమే. అన్ని రుచులు, పదార్థాలు కలిస్తేనే సంపూర్ణ ఆహారం అవుతుంది. కొన్ని పదార్థాలు కళ్లను కాపాడుకుంటే మరికొన్ని బలాన్నిస్తాయి. ఇంకొన్ని శరీరంలోని ఇతర భాగాలకు మంచి చేస్తాయి. అలాంటి వాటిలో గుండెకు మంచి చేసే ఏడు రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం...

గుండెకు మంచి నేస్తాలు...

ఆకు కూరలు: ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలు పాలకూర, మెంతి కూర, వంటి వాటిలో విటమిన్‌ - బి కాంప్లెక్ష్‌, నియాసిన్‌ అధిక మోతా దులో వుంటాయ. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుం డా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లు వంటివాటిలోనూ ఎక్కువగా లభిస్తాయి.

గుండెకు మంచి నేస్తాలు...

గోధుమ: గుండెకు అవసరమయ్యే ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ గోధుమలో పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెకు హాని కలిగించే ఫ్యాట్‌ని నివారిస్తుంది. ఫైబర్‌ కొవ్వుతో కలిసి దానిని బయటికి పంపేందుకు పనిచేస్తుంది.ఇంకా ఫైబర్‌ దొరికే పదార్థాలలో ఓట్స్‌, బార్లీ, రాగి, జొన్న వంటివి ముఖ్యమైనవి.

గుండెకు మంచి నేస్తాలు...

వెల్లుల్లి : వెల్లుల్లి గుణాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇందులో వుండే ఆక్సిడెంట్ల వల్ల గుండెకు ఎంతో మేలు జరుగు తుంది. అంతే కాదు ఇది గుండెకు హాని కలిగించే చెడు కొవ్వును నిరోధించడంలో సాయపడుతుంది. ఇవి రక్తాన్ని సరఫ రా చేసే నాళాలకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని అన్ని రకాల్లో వంటల్లోనూ, వేపుళ్ళలోని వుపయోగిస్తే రుచి పెరుగు తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

గుండెకు మంచి నేస్తాలు...

ఆపిల్స్‌ : విటమిన్స్‌, మినరల్స్‌, ఐరన్‌ ఆపిల్‌లో పుష్కలం గా వున్నాయి. ఇంకా ఇందులో పాస్పరస్‌, పొటాషియం, కాల్షియం, విటమి న్‌ ఏ, బి, సి కూడా ఇందులో అధిక మోతాదులో వుంటాయి. ëఇవి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే నరాలకు ఎంతో మంచి చేస్తాయిí అని న్యూట్రీషనిస్ట్‌ స్నేహా త్రివేది చెబుతున్నారు. ఇందులో గ్లైసెమిక్‌ చాలా తక్కువ మోతాదులో వుంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మంచిది అని చెబుతున్నారు.

గుండెకు మంచి నేస్తాలు...

చేపలు : చేపల్లో వుండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ నరాల్లో రక్త సరఫరాను క్రమబద్ధం చేస్తాయి.ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. ఇవి శరీరంలో ఇమ్యునిటీ శక్తిని కూడా పెంపొందిస్తాయి. గుండెకు మంచి చేసే కొవ్వును పెంపొందిస్తాయి. అంతేకాదు శరీరంలో రక్తం గడ్డకట్టకుండా వుండేందుకు ఇది ఎంతో అవసరం.

గుండెకు మంచి నేస్తాలు...

పాల ఉత్పత్తులు: పాలు, పాల ఉత్పత్తులు ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి వుంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పోలీఫెనల్స్‌ కూడా వీటిలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తాన్ని చేరవేసే నాళాలలో బ్లడ్‌ ఫ్రెషర్‌ని తగ్గిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తాయి.

గుండెకు మంచి నేస్తాలు...

ఆలివ్‌ ఆయిల్‌ : ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు వుపయోగపడతాయి.ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో వున్నాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు వుపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.

English summary

7Best Foods for Your Healthy Heart | గుండెకు మంచి నేస్తాలు...


 Diet is important when it comes to heart health. What you eat affects your cholesterol , blood pressure and overall heart health—so make sure you’re eating the right stuff! These seven foods have been shown to be loaded with fiber, antioxidants, healthy fats and other nutrients that nourish and protect the heart.
Desktop Bottom Promotion