For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రకాల బ్రెడ్ లలో గుండె ఆరోగ్యానికి ఏ బ్రెడ్ మేలు...?

|

ప్రధానంగా బ్రెడ్ ను ధాన్యాలతో తయారు చేస్తారు. అందువల్లే వాటి కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు, తీపి పదార్థాలు కలిగిన పిండి పదార్థాలు ఉంటాయి. అందుకే బ్రెడ్ కొంచెం అంటుకొనేలా జిగటగా అనిపిస్తుంది ఇటువంటివి గుండె ఆరోగ్యానికి మంచివి కాదు. కానీ మీరు బ్రెడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారా?అయితే ఏం భయంలేదు. కొన్ని రకాల బ్రెడ్స్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ ను మరియు ఫైబర్ ను అధికంగా పొందవచ్చు.

నిజానికి, బ్రెడ్స్ లో వివిధ రకాలున్నాయి. అందులో చాలా వరకూ గుండెకు ఆరోగ్యకరం. సాధారణంగా మనం అందరం ఎక్కువగా చూసేది వైట్ బ్రెడ్ ఇందులో క్రొవ్వులు మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అదేవిధంగా లోఫ్యాట్ బ్రెడ్ కూడా ఉన్నాయి. వీటిని సాధారణంగా బ్రౌన్ బ్రెడ్ అని పిలుస్తుంటాం. ఈ బ్రౌన్ బ్రెడ్ ను సోయాతో తయారు చేస్తారు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఇతర బ్రెడ్ రకాలు తృణధాన్యాలతో తయారు చేసే బ్రెడ్(గోధుమ బ్రెడ్ మరియు రే బ్రెడ్).

తృణధాన్యాలలో ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లే వీటితో గుండె ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్ లను తయారు చేస్తారు. మరికొన్న రకాల బ్రెడ్ లు చిరుధాన్యాలు(ఫ్లాక్స్ సీడ్స్ మరియు వాల్ నట్స్ తో తయారు చేస్తారు. ఎందుకంటే వీటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు వీటిలో మంచి కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉంటుంది. ఈ రకమైన బ్రెడ్ కూడా గుండె ఆరోగ్యానికి మంచిదే.

గుండెను ఆరోగ్యంగా ఉంచే కొన్ని బెస్ట్ బ్రెడ్స్ మీకోసం....

ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్...!

గోధుమ పిండితో తయారు చేసే బ్రెడ్: ఈ గోధుమ బ్రెడ్ ను ముతక లేదా పాలిష్ పట్టని గోధుమలతో తయారు చేస్తారు. అందువల్లే ఇది ఆరోగ్యానికి మంచిది మరియు ఇందులో ఫైబర్స్ మరియు పిండిపదార్థాలు అధికంగా ఉండి, గుండెకు మేలు చేస్తాయి.

ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్...!

బ్రౌన్ బ్రెడ్: బ్రౌన్ బ్రెడ్ ను తరచుగా గోధుమ మరియు సోయా పిండి కలయికతో తయారు చేస్తారు. అందుకే అది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇది జిగట లేని కారణంగా ఇది లోఫ్యాట్ కలిగి ఉండటం చేత గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్...!

మల్టీ గ్రెయిన్ బ్రెడ్: మల్టీ గ్రెయిన్ బ్రెడ్ అంటే ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల ధాన్యాల (గోధుమలు, రే, మిల్లెట్ మొదలగు)తో తయారు చేస్తారు. అందువల్లే ఇందులో డైటేరియన్ ఫైబర్ అధికంగా ఉండి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్...!

రై బ్రెడ్: మనకు అందుబాటులో ఉండే, ఆరోగ్యవంతమైన బ్రెడ్ రకాలలో ఇది ఒకటి. కానీ ఇందులోని తృణధాన్యాలతో తయారు చేసిన రుచి అందిస్తున్నదా లేదా అని నిర్ధారించుకోవాలి.

ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్...!

ఓట్స్ బ్రెడ్: సహజంగా ఓట్స్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.ఇంకా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్లే ఈ బ్రెడ్ ను ఓట్స్ తో తయారు చేస్తారు.

ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్...!

వాల్ నట్ బ్రెడ్: నట్స్ లో ఆరోగ్యకరమైనవాటిలో వాల్ నట్స్ ఒకటి. వాల్ నట్స్ గుండె ఆరోగ్యానికి కావల్సిన ఓమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ ను పుష్కలంగా అంధిస్తుంది.

ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్...!

పంపర్ నికెల్ బ్రెడ్: ఇది కూడా రై బ్రెడ్ లాంటిదే. అయితే రై బ్రెడ్ లో కంటే ఇందులో సోయా మరియు ఇతర ధాన్యాలతో తయారు చేస్తారు. అందుకే ఈ డార్క్ బ్రెడ్ ఆరోగ్యకరమైన వాటిలో ఇది ఒకటి.

ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్...!

పిటా బ్రెడ్: పిటా బ్రెడ్ ఆరోగ్యకరమైన బ్రెడ్ రకాలలో ఇది ఒకటి. ఈ బ్రెడ్ ను తీసుకొనే వ్యక్తులు గుండె వ్యాధులు అభివృద్ధి 50 శాతం తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్...!

ఫ్లాక్స్ సీడ్స్ బ్రెడ్: ఫ్లాక్స్ సీడ్స్ బ్రెడ్ తినడానికి కరకరలాడుతుంటుంది. అంతే కాదు మంచి కొలెస్ట్రాల్ ను అంధిస్తుంది. ఈ ఫ్లాక్ సీడ్స్ లో కూడీ ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డైయటేరియన్స్ తప్పనిసరిగా తీసుకోవచ్చు.

English summary

9 Types Of Bread That Are Heart Healthy | ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల బ్రెడ్...!

Breads are basically made with grains. They are thus carbs that have fats and sugars. Thus breads are glutinous and do not qualify as heart healthy foods under normal circumstances. But if you love to eat breads, then don't fret. Breads can be heart healthy too. There are many types of bread that are filled with good cholesterol and healthy fibrous carbs.
Story first published: Tuesday, March 5, 2013, 14:23 [IST]
Desktop Bottom Promotion