For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె వేగంగా కొట్టుకోవడం మంచిది కాదు..

|

ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలకు ఎక్కువగా గురిఅవుతున్నారు. గుండె పోటో ఒక వ్యక్తికి మాత్రమే వచ్చే సమస్య కాదు. ప్రస్తుత రోజుల్లో ఒత్తిడితో కూడకొన్న జీవన శైలితో అనేక మంది గుండె సమస్యలకు గురిఅవుతున్నారు. అందుకు కారణం హై హార్ట్ రేట్(అధిక హృదయ స్పందన) ఎక్కువ కావడం వల్ల. మనం ఏదైనా ఒత్తిడికి,ఆందోళన, జాగింగ్, శారీరక కార్యకలపాలు తలపెట్టినప్పడు ఇటువంటి సమయంలో మన హార్ట్ ఎక్కువగా ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది.

అయితే, మీ హార్ట్ రేట్ క్రమంగా పెరుగుతూ ఉంటే కనుక, తప్పనిసరిగా డాక్టర్ చెకప్ చేయించుకోవల్సి ఉంటుంది. టాచికార్డియా అనేది ఊహించని హార్ట్ రేట్ కారణంగా తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మానవులందరి లో సహజం గా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని మనకందరికీ తెలుసు కదా! దీనిని హార్ట్ రేట్ (heart rate) అంటారు. (గుండె యాభై నుంచి వంద సార్లు ,నిమిషానికి కొట్టుకోవడాన్ని నార్మల్ హార్ట్ రేట్ అంటారు. అంటే యాభై కంటే తక్కువ సార్లు కానీ , వంద కంటే ఎక్కువసార్లు కానీ కొట్టుకుంటుంటే అది అసాధారణం అనబడుతుంది. అప్పుడు వైద్య సలహా తీసుకోవాలి).

స్థిరమైన అధిక హృదయ స్పందన రేటు వల్ల గుండె పోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా దీన్ని వేగవంతమైన హృదయ స్పందన అని కూడా పిలుస్తారు. గుండె సంబంధిత సమస్యలను పెంచడంలో ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. మీ గుండె వేగంగా కొట్టుకున్నట్లు లేదా గుండె చప్పుడుతో బాధపడుతున్నట్లు మీకు అనిపిస్తే కచ్చితంగా కార్డియాలజిస్ట్ ను సంప్రదించి హై హార్ట్ రేట్ ను తగ్గించుకోవడం లేదా నియంత్రించుకోవడం చేయాలి. మందులతోనే కాకుండా హై హార్ట్ ను తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలు కూడా సహాయపడుతాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉండమే కాదు టాచికార్డియా సమస్య రాకుండా నిరోధిస్తుంది, నయం చేయడానికి సహాయపడుతుంది.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

టోఫు: టోఫు పన్నీర్ కు ప్రత్యామ్నాయం వంటిది. ఇందులో క్యాల్షియం మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. టోఫు గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు డైటర్స్ కూ బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి కూడా చాలా ఆరోగ్యకరం.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

అరటి పండు: అరటి పండులో అధిక శాతం పొటాషియం నిల్వ ఉంటుంది. ఈ పోషకాంశాలు హై హార్ట్ బీట్ ను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్షలో కూడా అధిక పొటాషయం ఉంటుంది. మరియు సోడియం తక్కువ. ఇవి టిచికార్డియా(గుండె సమస్యలకు కారణం అయ్యే)ను సహజంగా నివారిస్తుంది.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

ఆకుకూరలు: ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం తక్కువ కావడం వల్ల కూడా హై హార్ట్ రేట్ పెరగడానికి మరియు ఇతర హార్ట్ సమస్యలు ఏర్పడటానికి కారణం అవుతుంది.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

బ్రాజిల్ నట్స్: ఇవి హార్ట్ హెల్తీ నట్స్. ఇందులో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం. ఈ హెల్తీ నట్స్ సహజంగానే హై హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

బాదాం: బాదం కూడా హార్ట్ హెల్తీ కోసం తీసుకొనే ఆహారాల్లో ఒక భాగమే. ఇందులో అధిక శాతంలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ ఉండి, గుండె సమస్యలను నివారిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఆకలిని పెంచదు.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

పాలు: పాలలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్లే, వీటి రెగ్యులర్ గా తీసుకొంటే ఆరోగ్యంకరంగా ఉంటారు. ఆరోగ్యానికి మాత్రమే కాదు గుండె కూడా సేఫ్. హై హార్ట్ రేట్ కు క్యాల్షియంలోపం కూడా ఒక కారణమే. మరి వేగవంతమైన హృదయ స్పందన సహజంగా తగ్గించుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా క్యాల్షియం రిచ్ ఫుడ్ మరియు డ్రింక్స్ తరచూ తీసుకోవాలి.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

గుమ్మడి: ఇది కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉన్నటువంటి మరో రిచ్ ఫుడ్. ఇది హార్ట్ రేట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

చేపలు: ఫాటీ ఫిష్(తున, సాల్మన్, మెకెరేల్, హెరింగ్స్ మరియు సార్డిన్స్)వీటిలో ఓమేగా 3 ఫాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. హార్ట్ రేట్ ను కంట్రోల్లో ఉంచడానికి ఇవి బాగా సహాయపడుతాయి.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

అవొకాడో: గుండెతో సహా శరీరం మొత్తం శక్తివంతంగా పనిచేయడానికి పొటాషియం చాలా అవసరం. అది ఇందులో పుష్కలంగా ఉంది.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

టమోటో: హర్ట్ రేట్ తగ్గించడంతో పాటు, గుండెలో మంటను తగ్గిస్తుంది. టమోటోలను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

వెల్లుల్లి: వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి. బాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది. అంతే కాదు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను శరీరం నుండి బయటకు పంపడానికి బాగా సహాపడుతాయి.

హై హార్ట్ రేట్ ను తగ్గించుకోవడానికి ఈ ఆహారాలను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి. అలాగే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వేగవంతమైన హై హార్ రేట్ ను తక్కువ చేస్తుంది. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెంచడమే కాదు, గుండెకు హానికలిగించే శరీరంలోని క్రొవ్వు నిల్వలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. మరి లోయర్ హార్ట్ రేట్ సహజంగా ఉండటానికి కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు...

English summary

Foods To Lower Heart Rate Naturally | గుండె వేగంగా కొట్టుకుంటే ఏమౌతుంది..?

There are many heart problems that we all suffer from. Heart attack is not the only worst thing that can happen to an individual. High heart rate is a rising heart problem that people are suffering from these days. Our heart beats faster during anxiety, stress, physical activities like running, jogging and so on.
Story first published: Monday, March 18, 2013, 12:39 [IST]
Desktop Bottom Promotion