For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న చిన్న పొరపాట్లే గుండె వ్యాధులకు దారితీయచ్చు..!

By Super
|

భారీకాయాన్ని సైతం నియంత్రించగల శక్తి గుప్పేడంత గుండెకు ఉంది. "లబ్ డబ్" అంటూ మనిషి జీవితాన్ని అనుక్షణం కాపాడే చిన్ని గుండెకు జబ్బు చేస్తే.... ఆగిపోతే... మనిషి మనుగాడే ప్రశ్నార్థకమవుతుంది. గుండెకు జబ్బు చేయడానికీ, ఆగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ పురుషులకే గుండె జబ్బులు అధికంగా వస్తాయన్న అపోహ ఉండేది. అది నిజం కాదని అంటున్నారు కార్డియాలజిస్టులు. గుండె జబ్బులు స్త్రీలకైనా, పురుషులకైనా ఒకటే. అయితే ఇప్పటి వరకు పురుషుల కుండే అలవాట్లు, వారి జీవన సరళి గుండె జబ్బులు రావడానికి దోహద పడ్డాయి.

స్త్రీల జీవన విధానంలో పెను మార్పులు వచ్చాయి. కార్పోరేట్ కల్చర్ అభివృద్ది చెందినా ఈ పదేళ్ళ కాలంలో పురుషులతో పాటు స్త్రీలూ ధూమపానం, మధ్య పానం చేస్తున్నారు. ఈ అలవాట్లే కాకుండా పని ప్రదేశాలలో ఒత్తిడి కూడా వారికీ గుండెజబ్బు రావడానికి కారణమవుతోందని వైద్యులు చెపుతున్నారు హస్పిటల్స్ లోని కార్డియాలజీ విభాగానికి వచ్చే రోగులలో పురుషులతో సమ౦గా స్త్రీల సంఖ్య కూడా ఉంటోంది. సగటున ప్రతి రోజూ 40మంది స్త్రీలు హాస్పిటల్స్ లోని హృద్రోగ విభాగానికి వస్తున్నారని ఓ సర్వేలో తేలింది.

గుండెజబ్బులు రావడానికి కారణాలను డాక్టర్లు కింది విధంగా విశ్లేషిస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, సిగరెట్లు, మందు తాగడం, శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడ౦, ఉబకాయం ఇవన్నీ గుండెజబ్బులకు దారితీస్తాయని వైద్యులు చెపుతున్నారు. దశాబ్ద కాలం క్రితం వరకూ ఆసుపత్రిలో హృద్రోగంతో బాధపడే స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు పురుషులతో సమానంగా స్త్రీల సంఖ్య కూడా ఉంటోంది. దీనికి ఒకటే కారణం అంటున్నారు నిపుణులు. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా సిగరెట్లు, మద్యం తాగడం. ఒకసారి మీరు పొరపాట్లు చేసినట్లయితే అది మీ గుండెకు పెద్ద సవాళ్లు గా ఏర్పడవచ్చు. అటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఈ క్రింది విధంగా చేయాలి..

రెగ్యులర్ చెకప్

రెగ్యులర్ చెకప్

గుండె వ్యాధితో బాధపడుతున్న అనేకమంది ప్రజలకు స్పష్టమైన కారణాలు తెలియవు. కాబట్టి 20 సంవత్సరాలు ప్రారంభమైనప్పటినుంచి మీరు పూర్తి కొలెస్ట్రాల్ చెకప్ ను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. అలాగే మీ రక్తపోటును కనీసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి. అంతేకాక శరీర ద్రవ్యరాశి సూచికను వైద్యుడితో సందర్సించిన ప్రతి సారి లేక్కొంచుకోవాలి. మీ వయస్సు 45 సంవత్సరాలు అయితే రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి.

మీ కుటుంబ చరిత్రను మర్చిపోకుండా ఉండాలి

మీ కుటుంబ చరిత్రను మర్చిపోకుండా ఉండాలి

మీ కుటుంబంలో గుండె వ్యాధి ఉంటే తెలుసుకోవాలి. మీరు మీ తల్లిదండ్రులకు అనారోగ్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. మీ తాతామామల వైద్య చరిత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఏ వయస్సులో ఎలా మరణించారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారి జీవనశైలి,అలవాట్లు తెలుసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ తోబుట్టువులు గుండె వ్యాధి చిహ్నాలను కలిగి ఉంటే మీకు ముఖ్యంగా చిన్న వయసులోనే ఈ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాసం ఉండవచ్చు.

దంత పరిశుభ్రత

దంత పరిశుభ్రత

దంత ఆరోగ్యం మరియు గుండె ఆరోగ్యం కలిసికట్టుగా ఉంటాయి. నిజానికి దీని మీద తక్కువ పరిశోధన మాత్రమే జరిగింది. దంత ఆరోగ్యం మరియు చిగురువాపు గుండె వ్యాధికి తోడ్పడుతుందని సూచిస్తుంది. చిగుళ్ళు పొరల్లో జరిగే దీర్ఘకాలిక శోథను మీ శరీరం ద్వారా దీర్ఘకాలిక శోథను ఏర్పాటు చేస్తుంది. నిజానికి బ్యాక్టీరియా కొద్దిగా బరస్ట్ అయ్యి మీ రక్తప్రవాహంలో కలవవచ్చు. కేవలం అద్భుతమైన దంత పరిశుభ్రత కలిగి, తరచుగా బ్రష్ చేసే ప్రజలకు గుండె వ్యాధి అపాయం తక్కువగా ఉంటుంది.

తగినంత పాల వినియోగం

తగినంత పాల వినియోగం

ఇటీవలే జరిపిన ఒక అధ్యయనం ప్రకారం వైద్యులు 82,000 మంది ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలను ఎనిమిది సంవత్సరాల పాటు పరిశీలన చేశారు. వారిలో అత్యధిక పాల ఉత్పత్తులను తీసుకొన్న మహిళలకు పాల ఉత్పత్తులు అతి తక్కువగా తీసుకొన్న మహిళలతో పోలిస్తే రకం 2 మధుమేహం వచ్చే ప్రమాదం 50 శాతం తగ్గిందని కనుగొనబడినది. మీరు కేలరీలు తగ్గించుకోవటానికి,మీ ఆహారంలో కొవ్వు తగ్గించేందుకు పాల ఉత్పత్తులను తగ్గించటం అనేది మంచి మార్గం కాదు.

కొంత సూర్యకాంతిని పొందండి

కొంత సూర్యకాంతిని పొందండి

మండే సూర్యుని వద్ద ఉండటానికి సిఫారుసు చేయబడలేదు. అయితే మీ శరీరంలో విటమిన్ D సూర్యకాంతి సమక్షంలో మీ చర్మంలో తయారు చేయబడుతుంది. ఈ ముఖ్యమైన విటమిన్ తగినంత స్థాయిలో నిర్వహించడానికి కొంత సూర్యరశ్మి అవసరం అవుతుంది. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం విటమిన్ D తక్కువ స్థాయిలు గల వ్యక్తుల రక్తంలో విటమిన్ D అధిక స్థాయిలో ఉన్న వారిలో కంటే వారి రక్తనాళాలు ఏర్పాటు ఫలకం ఎక్కువగా ఉన్నట్లు కనుకొన్నారు. వైద్యుల సలహాతో సూర్యకాంతి సమక్షంలో 5 నుండి 30 నిమిషాల వరకు ఉండవచ్చు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు మీ శరీరంలో విటమిన్ డి తగినంత మొత్తంలో ఉత్పత్తికి సహాయం చేస్తుంది.

బీన్స్ విస్మరించడం

బీన్స్ విస్మరించడం

బీన్స్ యొక్క రకాలు సంతృప్త కొవ్వు లేకుండానే ప్రోటీన్ యొక్క ఒక గొప్ప మూలంను అందిస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ముఖ్యంగా కరిగే ఫైబర్ యొక్క అత్యుత్తమ వనరులలో ఒకటిగా ఉన్నది. వోట్మీల్ మరియు బార్లీ లలో కరిగే ఫైబర్ మంచి వనరులుగా ఉన్నాయి. ఇవి రక్తనాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ ను బయటకు పంపటానికి సహాయం చేస్తాయి.

శక్తి పానీయాలు

శక్తి పానీయాలు

శక్తి మరియు ఎయిరేటేడ్ పానీయాలు చక్కెర మూలం మరియు మీ రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెంచడం కోసం బాధ్యత వహిస్తాయి. నిజానికి ట్రైగ్లిజరైడ్స్ మీ రక్తాన్ని మందంగా తయారు చేసే కొవ్వులలో ఒక రకం. మీకు ఇప్పటికే మీ ధమనులలో కొంత కొలెస్ట్రాల్ కలిగి ఉంటే ఆపై మీరు అక్కడ మందంగా ఉన్న రక్తాన్ని ముందుకు నెట్టే ప్రయత్నంలో కొన్ని సమస్యలు సులభంగా ఏర్పడతాయి. మీకు బాగా దాహం వేసినప్పుడు నిమ్మకాయ,లైమ్ లేదా ఇతర పండ్ల రసాలను త్రాగాలి. చెరకు రసం కూడా ఒక గొప్ప శక్తి బూస్టర్ గాఉంటుంది.

అస్థిమితంగా ఉండే నిద్ర అలవాట్లు

అస్థిమితంగా ఉండే నిద్ర అలవాట్లు

మీరు రాత్రి వేళ చాలా ఆలస్యంగా పడుకొని ఉదయం తొందరగా లెగుస్తున్నారు. అప్పుడు మీకు తగినంత నిద్ర లేక మీ గుండెకు నష్టం కలగవచ్చు. రాత్రి వేళ మంచి నిద్ర ఉంటె తక్కువ రక్తపోటు ప్రోత్సహిస్తుంది మరియు క్రమరహిత గుండెచప్పళ్ల సంభావ్యతను తగ్గిస్తుంది. మంచి నిద్ర అలవాట్లు ఉన్నవారు గుండె వైఫల్యం మరియు గుండె దాడులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీకు మంచి నిద్ర అంటే ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సరిపోతుంది. రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోం లేదా స్లీప్ అప్నియా,నిద్రలేమికి ఒక వైద్యపరమైన కారణం ఉంటె నిర్ణయించడానికి మీకు మీ వైద్యుడు సహాయపడవచ్చు.

రంగురంగుల ఆహారం వదిలిపెట్టాలి

రంగురంగుల ఆహారం వదిలిపెట్టాలి

పండ్లు మరియు కూరగాయలలో ఫైబర్ తో పాటుగా,విటమిన్లు,ఖనిజాలు మరియు అనామ్లజనకాలు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. రక్తపోటు నిర్వహణ విషయానికి వస్తే మీరు తినే ఆహారంలో పొటాషియం పెంచడం,సోడియం తగ్గించడం చాలాముఖ్యం. పొటాషియం, సోడియం ప్రభావాలు తక్కువ,అధిక రక్తపోటులకు సహాయం చేస్తాయి. సిట్రస్ పండ్లు,అరటిపండ్లు,బంగాళాదుంపలు,టమోటాలు మరియు బీన్స్ లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే తెలుపు ఆహారాలను తీసుకోవాలి. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం తెల్ల పండ్లు మరియు కూరగాయలు (ఆపిల్స్,బేరి,దోసకాయలు మరియు కాలీఫ్లవర్ వంటి) లను అధికంగా తిన్న ప్రజలు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 52 శాతం తగ్గిందని తెలిసింది.

తగినంత వాకింగ్

తగినంత వాకింగ్

మీరు తక్కువ దూరాలను కారు కి బదులుగా నడవటానికి ప్రయత్నించాలి. పార్క్ లో మీ కారు పెట్టి బ్యాంకు, లాండ్రీ లేదా పార్లర్ కి నడిచి వెళ్ళాలి. మీరు ఒక రోజు మొత్తంలో 10,000 స్టెప్పులు నడిస్తే అది ఒక గంట 45 నిమిషాల వ్యాయామానికి సమానము.

English summary

Little mistakes lead to big heart disease

Little mistakes you make over time can pile up to pose big challenges for your heart
Desktop Bottom Promotion