For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె గురించి తెలుసుకోవాల్సిన అంశాలు

|

శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె అని అందరికీ తెలిసిన విషయమే. మనిషి మనుగడకు గుండె ఆధారం. శరీరంలో గుండె ఆరోగ్యం.. వివిధ అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. శరీరానికంతటికి రక్త సరఫరాతో పాటు.. అనేక రకాల విధులను నిర్వర్తిస్తుంది మానవ హృదయం. వరల్డ్స్ హార్ట్ డే సందర్భంగా గుండె పనితీరు.. గుండె గురించి తెలుసుకోవలసిన కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు.. తెలుసుకుందాం..

హృదయ స్పందన

హృదయ స్పందన

మానవ హృదయం రోజుకు సుమారు లక్ష సార్లు కొట్టుకుంటుంది. పురుషులతో పోల్చితే.. స్త్రీలలో హృదయ స్పందన చాలా వేగంగా ఉంటుంది. స్త్రీలలో నిమిషానికి గుండె 78 సార్లు కొట్టుకుంటే పురుషులలో నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది. మనుషుల సగటు జీవిత కాలంలో గుండె దాదాపు 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. గుండెలోని నాలుగు కవాటాలు మూసుకుని ఉండటం వల్ల శబ్ధం వినిపిస్తుంది.

రక్త పంపిణీ

రక్త పంపిణీ

రోజుకి 2 వేల గాలాన్ల రక్తాన్ని శరీరం మొత్తానికి గుండె పంపిణి చేస్తుంది. మనుషులు బతికినంత కాలం గుండె రక్తాన్ని శరీర భాగాలకు చేరుస్తూ ఉంటుంది. అయితే.. ఎంత మొత్తంలో పంపిణీ చేస్తుందో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. మనిషి సాధారణ జీవితకాలంలో సుమారు 3 సూపర్ ఆయిల్ ట్యాంకర్ కన్నా ఎక్కువ మొత్తంలో రక్తాన్ని అవయవాలకు పంపిణీ చేస్తుంది. గుండెకి ఏదైనా ప్రమాదం జరిగితే.. రక్త పంపిణీలో అవకతవలు ఏర్పడతాయి. దీంతో కవాటాలు రక్తం పంపిణీ చేయలేకపోతాయి. కాబట్టి గుండె పదిలంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.

గుండె విధులు

గుండె విధులు

మనుషుల మనుగడకు గుండె చాలా కీలకం. మనుషులు బతకడానికి హార్ట్ చాలా ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. రక్త పంపిణీయే కాకుండా.. కండరాలకు సంబంధించిన విధులను కూడా నిర్వర్తిస్తుంది. మనుషుల శరీరంలో ఉండే సుమారు 75 ట్రిలియన్ ల కణాలకు కావలసిన ఆహారాన్ని గుండె సరఫరా చేస్తుందంటే నమ్మసక్యం కాదు.

చిన్న సైజు

చిన్న సైజు

శరీరంలో అద్భుతంగా పని చేసే యంత్రం గుండె. గుండె పనితీరుని, హృదయ స్పందనని బట్టి గుండె కొట్టుకునే శబ్దం వినిపిస్తుంది. పిడికిలి పరిమాణంలో ఉండే గుండె.. 60 వేల మైళ్ల వరకు రక్త నాళాల ద్వారా రక్త ప్రసరణ చేసి.. అవయవాలలోని ప్రతి కణానికి రక్తం అందేలా చేస్తుంది.

గర్భంలో ఉండగానే పని ప్రారంభం

గర్భంలో ఉండగానే పని ప్రారంభం

సాధారణంగా మనుషుల గుండె.. గర్భంలో ఉండగానే.. పని ప్రారంభిస్తుంది. గర్భంలో ఉన్న బిడ్డకు నాలుగు వారాలు రాగానే గుండె కొట్టుకోవడం మొదలుపెడుతుంది. గుండె శబ్ధం.. పనితీరుని బట్టి గర్భస్త శిశువు ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు వైద్యులు.

English summary

Know Facts About Heart: health in telugu

Know Facts About Heart. If you can’t attend one of the many worldwide activities scheduled for this Sunday, you can still do your part to celebrate World Heart Day.
Desktop Bottom Promotion