లేటెస్ట్ స్టడీ: 80శాతం హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించే సింపుల్ టిప్స్..!

50శాతం హార్ట్ ఎటాక్స్ అనుకోకుండా వచ్చేవే. ఎలాంటి వార్నింగ్ సంకేతం ఇవ్వకుండా.. వస్తాయి. గుండెలోని ఒక భాగానికి రక్తం సరఫరా కాకుండా.. బ్లాక్ అయినప్పుడు.. హార్ట్ ఎటాక్ వస్తుంది.

Posted By:
Subscribe to Boldsky

కరోనరీ ఆర్టరీ డిసీజ్.. వల్ల సాధారణంగా గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ ఎటాక్ సమస్యలు వస్తాయి. 50శాతం హార్ట్ ఎటాక్స్ అనుకోకుండా వచ్చేవే. ఎలాంటి వార్నింగ్ సంకేతం ఇవ్వకుండా.. వస్తాయి. గుండెలోని ఒక భాగానికి రక్తం సరఫరా కాకుండా.. బ్లాక్ అయినప్పుడు.. హార్ట్ ఎటాక్ వస్తుంది.

heart attack risk

హార్ట్ ఎటాక్ ని కూడా అరికట్టవచ్చు. కొన్ని అలవాట్ల వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ కి దూరంగా ఉండవచ్చని.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. డైట్ లో, లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ప్రాణాంతకమైన హార్ట్ ఎటాక్ ని అడ్డుకోవచ్చని ఈ స్టడీస్ తేల్చాయి.

మరి హఠాత్తుగా వచ్చి, హడలెత్తించే హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించే హెల్తీ హ్యాబిట్స్ ఏంటో చూద్దాం. అంతే కాదు.. ఈ అలవాట్లు.. దాదాపు 80 శాతం హార్ట్ ఎటాక్ ముప్పుని అడ్డుకుంటాయని ఈ స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి.. వీటిని వెంటనే ఫాలో అయిపోండి.

ఐదు అలవాట్లు

హెల్తీ డైట్, రోజుకి 40 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం, వారానికి కనీసం గంటసేపు వ్యాయామం చేయాలి. నడుము చుట్టుకొలత 95సెంటీమీటర్లు దాటకుండా జాగ్రత్తపడాలి. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. స్మోకింగ్ మానేయాలి.

హెల్తీ డైట్

ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ గురించి చాలామందికి తెలియదు. ఇవి శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కంటే.. చాలా డేంజరస్. ఆరోగ్యకరమైన శ్యాచురేటెడ్ ఫ్యాట్ కంటే.. లో ఫ్యాట్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. రిఫైన్డ్ షుగర్, ప్రాసెస్డ్ ఫ్రక్టోజ్ లలో హానికారక ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. దీనివల్ల ఒబేసిటీ, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు.

గుండె ఆరోగ్యానికి ఎలాంటి డైట్ ?

ప్రాసెస్డ్ ఫుడ్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. హార్క్ ఎటాక్ ముప్పు తగ్గించుకోవాలంటే.. రెస్టారెంట్ ఫుడ్ తీసుకోకూడదు. షుగర్, ప్రాసెస్డ్ గ్రెయిన్స్, ఫ్రక్టోజ్ కి దూరంగా ఉండాలి. పచ్చివి, ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్, మాంసం తీసుకోవాలి.

హెల్తీ ఫ్యాట్ ఎలా పొందవచ్చు ?

కొబ్బరి, కొబ్బరినూనె, అవకాడో, గుడ్డులోని పచ్చసొన, వెన్న, నట్స్, మాంసం, బాదాం, పచ్చి పాల ఉత్పత్తుల ద్వారా హెల్తీ ఫ్యాట్ పొందవచ్చు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి డైలీ డైట్ లో ఉండేలా జాగ్రత్త పడాలి.

ఎక్కువ ప్రూట్స్

రెగ్యులర్ గా ఫ్రూట్స్ తినేవాళ్లలో 40 శాతం హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుంది. ఎక్కువ మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు ఉండే ఫ్రూట్స్ తినడం వల్ల.. ఎలాంటి అనారోగ్య సమస్యా మీ దరిచేరదు.

డయాబెటిస్ డ్రగ్స్

కొన్ని రకాల డయాబెటిస్ మందులు.. థైరాయిడ్ గ్లాండ్ పై ప్రభావం చూపే హార్మోన్లను తగ్గిస్తుంది. దీనివల్ల అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ నివారించడానికి తీసుకునే మందులు హార్ట్ డిసీజ్ రిస్క్ పెంచుతాయట.

హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించుకోవడానికి

ఇటీవల పెరిగిపోతున్న హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించుకోవడానికి.. ఒత్తిడికి దూరంగా ఉండాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. వీలైనప్పుడల్లా.. చెప్పులు లేకుండా.. నడవాలి. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే మందులకు దూరంగా ఉండాలి.. వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విటమిన్ సి.. సరిగా అందేలా జాగ్రత్తపడాలి. రోజుకి మూడు గంటల కంటే.. ఎక్కువసేపు కూర్చోకూడదు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

80% Of Heart Attacks Can Prevent If Everyone Knew These 5 Things

80% Of Heart Attacks Can Prevent If Everyone Knew These 5 Things. Coronary artery disease is one of the commonest heart diseases that can lead to heart attack.
Please Wait while comments are loading...
Subscribe Newsletter