For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నచిన్న అలవాట్లు మార్చుకోండి..నాజూగ్గా మారండి...

|

‘సహజంగా సన్నగా' కనబడాలనేది అందరి కోరిక. మీ బరువైన అలవాట్లను తగ్గించి, సన్నబడాలి అనే ఆలోచన కలిగించి, సంతృప్తికరమైన భోజనం, స్నాక్స్, పానీయాలను మొహమాటపడకుండా ఎలా తీసుకోవాలో తెలియచేస్తుంది. సహజంగా సన్నగా కనపడడానికి క్రింది నియమాలు పాటించండి.

చర్యలు

1. మీ ఆహరం ఒక బాంక్ ఖాతాలాంటిది. ఇది సహజంగా సన్నబడే కార్యక్రమ౦ వెనుక ఉన్న ఒక ముఖ్యమైన మార్గదర్శక సూత్రం. ఏది తినాలనుకున్నారనేది పెద్ద విషయం కాదు, రోజు మొత్తం మీద సమతుల ఆహార ఎంపిక ప్రధానం.

2. మీరు అన్నీ తినవచ్చు కానీ ఒకేసారి కాదు. జీవితం అంతా ఎంపికలమయం. మీరు ఏది కావాలంటే అది తినవచ్చు, సాధ్యమైన౦తవరకు ఆసక్తి కలిగించేవి, పౌష్టికంగా వుండే వివిధ రకాల ఆహార పదార్ధాలను మీరు తినవచ్చు, అదే సమయంలో ఆహారాల ఎంపిక సరళంగా ఉండటం కూడా అవసరం.

How to Be Naturally Thin

3. ప్రతిదీ రుచిచూడండి, తినకండి., మీ నోటిలోనికి పెద్ద ముద్దలు తీసుకునే బదులు, రుచికరమైన ఆహరాన్ని చిన్న ముద్దలుగా తీసుకోండి. మీకు ఎక్కువ అనిపించక ముందే ఆపేయండి? చాల ఎంపికలు వుంటే జాగ్రత్తగా ఎంచుకు౦టూ గమనిక తో వుండండి

4. శ్రద్ధ వహించండి. మీరు ఏ౦ చేస్తున్నారన్నదాని మీద శ్రద్ధ పెట్టేంత వరకు తినకండి. నిలబడి వున్నపుడు, పని చేసేటప్పుడు, డ్రైవింగ్ లో, టి వి చూస్తున్నపుడు, నడుస్తున్నపుడు తినకండి. కూర్చుని, మీరు భోజనాన్ని ఆస్వాదిస్తూ తింటే, తీసుకున్న ఆహరం వంటికి పడుతుంది.

5. ఎక్కువ పరిమాణం మర్చిపోయి, ఇపుడు తక్కువ పరిమాణానికి రండి. తగ్గించుకోవడం ఇప్పుడు మీ నూతన జీవన విధానం. చిన్న ప్లేట్లలో, బౌల్ లు, గ్లాసుల లో తినండి, భాగాల మీద కొత్త స్పృహను పెంపొందించుకొండి.

6. ప్లేటు నిండా తినే అలవాటుని మానుకోండి. ప్లేట్ లో ఉన్నది మొత్తం తినకండి. ప్లేట్లో ఉంది కాబట్టి మొత్తం తినేయాలనేమీ లేదుగా. బదులుగా, మీ భోజనాన్ని పంచుకో౦డి, తరవాత తినడానికి దాచుకోండి, లేదా అంత రుచిగా లేకపోతె వదిలేయండి.

7. మిమ్మల్ని మీరు పాడు చేసుకునే ముందు ఒకసారి పరీక్షించుకోండి. ఈ నియమం మీకోసం మీరే చేసుకోగల ముఖ్యమైన పనులలో ఒకటి. మితం లేకుండా తినడం ఆపండి, మరలా చేయకండి. మీ జీవితానికి మీరే యజమాని, ఒక అడుగు ముందుకు వేయండి.

8. మీ గురించి మీరు తెలుసుకోండి. మీ అలవాట్లని మార్చుకు౦టు౦టే, మీ గురించి మీరు తెలుసుకొని, మీకు సరిపడా తినే పద్ధతిని అనుసరించండి.

9. వాస్తవిక ధోరణి కలిగి వుండండి. కుదిరినపుడు, ఆ ఎంపిక ఉన్నపుడు, దాని గురించి విపరీత ధోరణి లేకుండా, నకిలీవి, సిద్ధ ఆహారానికి బదులుగా నిజమైన, సేంద్రియ, స్థానిక, కాలానుగుణ ఆహారాన్ని తీసుకోండి.

10. మీకు మంచిది. మీ అలవాట్లలో వచ్చిన ప్రతి మార్పు మీపై మీకున్న ప్రేమ, శ్రద్ధ లో౦చి రావాలి. మీరు ఏంచెయ్యాలనుకున్నా సరే, మీరు ఎలా తినాలనుకున్నా, మీరు ఎలా ఉండాలనుకున్నా, మిగతా వాటి కంటే ప్రధానంగా మీకు ఏది మంచిదో దాన్ని బట్టి చేయండి.

English summary

How to Be Naturally Thin | సహజంగా సన్నబడడం ఎలా ?

Looking "Naturally Thin" is everyone's desire. It explains how to banish your heavy habits, embrace thin thoughts and enjoy satisfying meals, snacks and drinks without the guilt. Below are the rules to get a Naturally Thin look
Story first published: Friday, January 4, 2013, 18:36 [IST]
Desktop Bottom Promotion