For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంటి ఆరోగ్యానికి వ్యాయామం చెయ్యడం ఎలా?

|

జిమ్ కి వెళ్ళడం, జాగింగ్ చెయ్యడం, స్విమ్మింగ్ చెయ్యడం ద్వారా మన శరీరాన్నిఆరోగ్యంగా ఉంచుకోవాలని మనకందరికి తెలుసు. కానీ మన కళ్ళకి కూడా వ్యాయామం అవసరమని తెలుసా? కళ్ళకి వ్యాయామం చెయ్యడం ద్వారా మన కళ్ళని ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు. కంటికి కలిగే ఒత్తిడిని తగ్గించవచ్చు.

ఈ చిట్కాలు మీ కంటి చూపుని మెరుగుపరిచేందుకు కాదని గమనించండి. కానీ వీటి వల్ల కంటి చూపు మరింత మందగించకుండా జాగ్రత్తపడవచ్చు.

చిట్కాలు:

1. ఒక కుర్చీ మీద సౌకర్యవంతంగా కూర్చోండి. మీ రెండు చేతులు వెచ్చబడే వరకు ఒక దానితో ఒకటి రుద్దండి. మీ కళ్ళు మూసుకుని వెచ్చటి మీ అరచేతులతో కనుగుడ్ల మీద ఒత్తిడి పడకుండా కప్పండి. మీ ముక్కు కప్పబడకూడదు. మీ చేతి వేళ్ళ సందులోంచి వెలుతురు రాకుండా జాగ్రత్తపడండి. మీ చేతుల పక్క నుండి లేదా ముక్కు పై భాగం నుండి వెలుతురు చేరకుండా జాగ్రత్త పడండి. కొన్ని తాత్కాలిక రంగులు మీకు కనిపిస్తాయి. కానీ దట్టమైన నలుపు రంగుని ఉహించుకుని దాని మీదే దృష్టి కేటాయించండి. మెల్లగా లోతైన శ్వాస తీసుకుంటూ ఏదైనా ఆనందకరమైన సంఘటన ని తలచుకోండి. లేదా ఏదైనా సుదూర సన్నివేశాన్ని ఉహించుకోండి. చీకటి తప్ప ఏమీ కనిపించనప్పుడు మీ చేతులని కళ్లపై నుండి తీసివెయ్యండి. ఈ పద్దతిని మూడు లేక అంత కంటే ఎక్కువ సేపు చెయ్యండి.

How to Exercise Your Eyes

2. మీ కళ్ళని గట్టిగా మూడు నుండి అయిదు సెకండ్ల పాటు ముసివేయ్యండి. ఇలా ఏడు లేక ఎనిమిది సార్లు చెయ్యండి.

3. మీ కళ్ళని మర్దనా చెయ్యండి. ఒక టవల్ ని వేడి నీటిలో అలాగే ఇంకొక టవల్ ని చల్లటి నీటిలోముంచండి . ఒక టవల్ ని తీసుకుని మీ ముఖం పై తేలికగా అద్దండి. కనుబొమ్మలు, మూసి ఉన్న కనురెప్పలు, చెంపలపై దృష్టిపెట్టండి. ఇలా ఒక సారి వేడి టవల్ తో ఒక సారి చల్లటి టవల్ తో చెయ్యండి. ముగింపు మాత్రం చల్లటి టవల్ తో ఇవ్వండి.

మొత్తం ముఖానికి మర్దనా : ఒక టవల్ ని వేడి నీటిలో ముంచండి. మెడ, నుదురు మరియు చెంపలని ఈ టవల్ తో రుద్దండి. కళ్ళని మాత్రం రుద్దకండి. మీ ముని వేళ్ళతో నుదురు ని అలాగే కళ్ళని సుతారంగా మర్దనా చెయ్యండి.

కనురెప్పల మర్దనా : మీ కళ్ళు మూసుకుని మీ వేళ్ళతో వలయాకారంలో ఒకటి లేదా రెండు నిమిషాల వరకు మర్దనా చెయ్యండి. కంటికి హానీ కలగకుండా చేతులని శుభ్రంగా కడుగుకుని అలాగే చాలా తేలికగా మర్దనా చెయ్యడం ఇక్కడ ముఖ్యమైన విషయం.

4. సుతారంగా రెండు చేతుల యొక్క మొదటి మూడు వేళ్ళతో కనురెప్పల పై బాగాన్ని వత్తాలి. వత్తి ఉంచి ఒకటి లేదా రెండు సెకండ్లు ఉండి తరువాత తీసేయాలి. ఇలా అయిదు సార్లు చెయ్యాలి.

5. సౌకర్యవంతం గా కూర్చోవాలి. మీ కళ్ళని గడియారం తిరిగే దిశలో గుండ్రంగా తిప్పాలి. ఆ తరువాత వ్యతిరేక దిశలో తిప్పాలి. మధ్య మధ్యలో కళ్ళు మూస్తూ ఇలా అయిదు సార్లు చెయ్యాలి.

6. సుదూరంలో (దాదాపు 150 అడుగుల ఎత్తు లేదా 50 మీటర్ల దూరం)ఉన్న ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించాలి. ఆ తరువాత మెల్లగా దగ్గరలో(30 అడుగుల కంటే తక్కువ ఎత్తు లేదా 10 మీటర్ల దూరం) ఉన్న వస్తువుపై తల కదపకుండా దృష్టి మార్చాలి. ఇలా 10 నుండి 15 సెకండ్లు చెయ్యాలి. ఇలా అయిదు సార్లు చెయ్యాలి.

7. మీ చేతిలో ఒక పెన్సిల్ ని పట్టుకోండి. మీ చేతులని మీ ముక్కుకు దగ్గరగా తీసుకురండి. అలాగే దూరంగా తీసుకెల్లండి. పెన్సిల్ కదిలే వైపు మీ కళ్ళు చూస్తూ ఉండాలి.

ఏదైనా వేలాడే దానికి ఒక తేలికపాటి వస్తువుని ఉంచి అది ఊగుతున్నప్పుదు మీ కళ్ళు వాటినే చూస్తూ ఉండాలి.

8. మీకు ఎదురుగా ఉన్న గోడ పైన చూస్తూ మీ కళ్ళతో అక్షరాలూ రాస్తున్నట్టుగా చెయ్యండి. మీ తలని కదపకండి. ఇలా చెయ్యడం మొదట కష్టంగానే ఉన్నా, కొంచెం సాధన తో చెయ్యడం సాధ్యం. అక్షరాలూ ఎంత పెద్దగా ఉంటే దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది.

9. లయబద్దమైన కదలికల్ని సాధన చెయ్యండి.

10. ఒక పెద్ద గడియారం ముందు మీరు నిల్చున్నట్లు ఉహించుకొన్ది. గడియారం మధ్యలోకి చుడండి. ఆ తరువాత గంటల గుర్తుని మీ తల తిప్పకుండా చూడండి. మళ్లీ గడియారం మధ్యలోకి చూడండి. ఇప్పుడు ఇంకొక గంట గుర్తుని చుడండి. ఇలా 12 సార్లు చెయ్యండి. ఈ వ్యాయామాన్ని కళ్ళు మూసుకుని కూడా చెయ్యవచ్చు.

11. స్వల్పమైన విభిన్న నేపధ్యం కలిగిన ఒక సుదూర వస్తువు పైన మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇలా ప్రతి గంటలో కొన్ని నిమిషాల పాటు చెయ్యాలి.

12. పైకి కింది మీ కళ్ళ కదలికలు చేయండి. ఇలా ఎనిమిది సార్లు చెయ్యాలి. ఆ తరువాత ఒక పక్క నుండి ఇంకొక పక్క వరకు కళ్ళని కదిలించండి. ఎడమవైపు తో ఈ పద్దతి పాటించాలి. ఇలా ఎనిమిది సార్లు చెయ్యాలి. మీ కంటిపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడండి.

13. ఈ పద్దతులని అరచేతులతో కళ్ళని కప్పడం లేదా వేరే ఏదైనా కళ్ళకి విశ్రాంతి కలిగే పద్దతితో ముగించాలి.

చిట్కాలు

కళ్ళ వ్యాయామాన్ని ఎక్కువ సేపు చెయ్యడం కంటే ప్రతి రోజు క్రమం తప్పకుండా చెయ్యడం ముఖ్యం. ప్రతి గంటలో ముప్పై నుండి అరవై సెకండ్ల కళ్ళ కదలికలు సరిపోతాయి. ఒక వేళ మీరు కంప్యూటర్ వద్ద ఎక్కువ సేపు పని చేస్తున్నప్పుడు మీ కళ్ళ ని వలయాకారంలో అప్పుడప్పుడు తిప్పడం ద్వారా రోజూ లాగా కంటిపై పడే ఒత్తిడి తగ్గుతుంది.

అరచేతితో కంటి ని కప్పడం మంచి పద్దతి. దీని వల్ల మీ కళ్ళు ఒత్తిడికి గురి అవ్వవు.

కంప్యూటర్ వద్ద ఎక్కువ సేపు పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న విరామం తీసుకోవడం కూడా ఏంతో ఉపయోగపడుతుంది.

English summary

How to Exercise Your Eyes | కంటి ఆరోగ్యానికి వ్యాయామం చెయ్యడం ఎలా?


 We all know how important it is to keep our bodies fit by doing things like going to the gym, jogging, and swimming. But, did you know that you can exercise your eyes as well? Eye exercising will keep your eyes healthy and help minimize eyestrain
Story first published: Sunday, January 13, 2013, 15:30 [IST]
Desktop Bottom Promotion