For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి అత్యంత ప్రభావమంతైన ఆహారం పొందడం ఎలా...?

|

ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావాలు ఉండకుండా బరువు తగ్గే విధంగా ఆహారాన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

1. మీరు ప్రతిరోజూ తినే ఆహార పదార్ధాల జాబితా తయారు చేసుకోండి.
2. ఎన్ని కార్బ్స్, ప్రోటీన్స్, పళ్ళు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తీపి మరియు కొవ్వు పదార్ధాలు ఏ విధంగా మీరు ఆహారంతో తీసుకుంటున్నారో లెక్కించండి.
3. మొదటి రెండు వారాలు డిసెర్ట్ లని తీపి పదార్ధాలని తినడం మానేయ్యండి.
4. మీరు తినే పిండి పదార్ధాలని పరిమిత పరచండి. పూర్తిగా వాటిని నిర్మూలించకుండా పరిమితంగా వాటిని తినండి.
5. కూరగాయలు, పళ్ళు మరియు మాంసాన్ని ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే ఇవి పోషకాలు మరియు విటమిన్స్ ని ఎక్కువగా అందించే ఆహారాలు.
6. మీ వైద్యుని సూచనల ప్రకారం కేలరీ లని తీసుకోవడం తగ్గించండి.
7. ప్రతి రోజు మూడు సార్లు భోజనం మరియు రెండు సార్లు అల్పాహారాన్ని తీసుకునేటట్లుగా జాగ్రత్త పడండి.
8. వారంలో మూడు లేక అంత కంటే ఎక్కువ సార్లు గుండెకి సంబంధించిన వ్యాయామాలు చెయ్యండి. మీ హార్ట్ రేట్ కనీసం 20 నిమిషాల వరకు 120 కంటే ఎక్కువగా వచ్చేలా నిర్ధారించుకోండి.
9. సూపర్ గ్రాసరీ లిస్టు ని తయారు చేసుకోండి. మీరు సూపర్ మార్కెట్ కి వెళ్ళే ప్రతిసారి ఈ జాబితాని తీసుకుని వెళ్ళండి. ఈ జాబితాలో ని మీ శరీర బరువుని దృష్టిలో పెట్టుకుని తీపి పదార్ధాలని ఈ జాబితా నుండి తొలగించడం లేదా కనీసం తగ్గించడం చెయ్యాలి.

How to Get the Most Effective Diet

చిట్కాలు
వీలైన ప్రతిసారి లిఫ్ట్ బదులు మెట్లని వాడండి. ఇది వ్యాయామం గానే కాకుండా అందమైన ఆకృతి కలిగిన కాళ్ళు కలిగేందుకు సహాయపడుతుంది.
తప్పనిసరిగా అల్పాహారాన్ని తీసుకోవాలి. కనీసం పండునైనా అల్పాహారంగా తీసుకోవాలి. జివ ప్రక్రియ సజావుగా జరుగడానికి అల్పాహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
నిద్ర పోవడానికి రెండు గంటల ముందే భోజనం ముగించాలి.
అందమైన శరీరాకృతిని పొందేందుకు జిమ్ కి వెళ్లి బరువులని ఎత్తడం కూడా సహకరిస్తుంది. అంతే కాదు మీ కండరాల ఒక్క శక్తిని పెంచడానికి కూడా వ్యాయామం సహకరిస్తుంది.
తక్కువ కొవ్వు కలిగిన పాలని లేదా సోయా మిల్క్ ని తీసుకోండి.
మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. శరిరంలోని మలినాలు తొలగిపోవడంతో ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి మంచినీళ్ళకి ఉంది.

జాగ్రత్తలు
మీరు అధిక బరువుతో బాధపడుతున్న లేదా వేరే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా మీ వైద్యున్ని వెంటనే సంప్రదించి తగిన సలహాలు తీసుకోండి.
ఇది కొంచెం నిదానమైన ప్రక్రియ. పై పద్దతులు పాటించడం ద్వారా మొదటి వారంలో శరీర బరువు 8-10 lbs తగ్గగా తరువాత 1-2 lbs వరకు తగ్గుతుందని అంచనా.
బరువు తగ్గడం కోసమని ఆకలితో బాధపడుతూ ఏమీ తినకుండా ఉండడం మంచిది కాదు. ఆహారం తీసుకోనట్లయితే, శరీరానికి కొవ్వుని ఖర్చు చెయ్యడం బదులు భద్ర పరచుకుకోవడం అలవాటైపోతుంది.

English summary

How to Get the Most Effective Diet | ఆరోగ్యానికి అత్యంత ప్రభావమంతైన ఆహారం.!

Old diets Not working? Try this; it's proven to work! Just remember it is not a quick fix!
Story first published: Thursday, February 14, 2013, 11:05 [IST]
Desktop Bottom Promotion