For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విమ్మింగ్(ఈత)తో మీ పొట్టను తగ్గించుకోవడం ఎలా...?

|

పొట్ట కండరాలను పటిష్ట పరచుకోవడానికి ప్రభావ వంతమైన వ్యాయామాలలో ఈత ఒకటి. ఇది హృదయ నాళాలకు మంచి వ్యాయామమే కాక, మీ శరీరం మొత్తం లోని కండరాలను పటిష్ట పరచి, మీ శరీరాకృతిని, సహనాన్ని సమయం గడిచే కొద్దీ మెరుగు పరుస్తుంది. స్థిరంగా ఈత సాధన చేస్తుంటే మీ ఉదరం గట్టి పడి ఏడాది పొడవునా మంచి ఆకారంలో నిలుస్తుంది.

సూచనలు:

1. మీకు ఇష్టమైన ఈత స్ట్రోక్ తో కొన్ని లాప్ లు ఈదండి. ప్రతి స్ట్రోక్ తో వివిధ కండరాల సమూహాలు వివిధ రకాలుగా పనిచేస్తాయి, కానీ మీ ఉదర కండరాల నుంచి మంచి ఫలితాలు రాబట్టాలంటే మీ శరీరం మొత్తాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉదర భాగాన్ని గట్టిపరచుకోవడానికి ఉపయోగపడే ప్రసిద్ధ ఈత స్ట్రోక్ లలో బ్రెస్ట్ స్ట్రోక్, బాక్ స్ట్రోక్, బటర్ ఫ్లై స్ట్రోక్ కొన్ని.

2. మీ ఉదర భాగాన్ని గట్టి పరచుకోవడానికి నీటి నడకను ఒక ఈత వ్యాయామంగా ప్రయత్నించండి. కొలనులో లోటు ఎక్కువ లేని వైపు నడుస్తూ, మీ మోకాలును గుండె వైపుకి లాగి, మీ వీపు భాగాన్ని సాధ్యమైనంత నిటారుగా వుంచండి. మీ మోకాలిని గుండె వైపుకు లాగిన ప్రతి సారీ మీ పొత్తికడుపు కండరాలను బిగుతుగా చేయడం మీద ధ్యాస వుంచండి.

How to Tone Your Stomach With Swimming

3. ఇప్పుడు కొలనులో లోతెక్కువ వున్న వైపుకి వెళ్లి మీ ఉదర భాగాన్ని గట్టి పరచేళా కాలు ఎత్తడం సాధన చేయండి. కొలను లొని ఒక గోడకు మీరు స్థిరంగా ఆనుకుని మీ తల నీటి పైన సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుని ఒకసారి ఒక కాలు చొప్పున గుండె వరకు లాక్కోండి. కాలు మార్చి కాలు పైకి సాధ్యమైనంత వేగంగా ఎత్తి మీ ఉదర కండరాల కోసం మంచి హృదయ సంబంధమైన వ్యాయామం చేయండి.

4. కొలనులోని లోతైన వైపు ఒక నిమిషం పాటు నీటి లో నడవండి - ఆగకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఒక నిమిషం పాటు విశ్రమించి ఇలా అయిదు సార్లు చేయండి. నీటి లో నడవడం మీ శరీరం మొత్తానికి వ్యాయామాన్ని అందిస్తుంది, ముఖ్యంగా నడిచేటప్పుడు బిగుతుగా ఉండాలంటే మీ ఉదర భాగం లోని కండరాలకు.

5. వెనుక నుంచి కిక్ చేస్తూ మీ ఛాతీకి ఒక కిక్ బోర్డ్ పట్టుకొంటే మీ ఉదర కండరాలు పని చేస్తాయి. మీ శరీరం మొత్తాన్ని, ముఖ్యంగా మీ కాళ్ళు, పాదాలు, సాధ్యమైనంత వరకు నీటి ఉపరితలానికి దగ్గరగా వుంచండి.

చిట్కాలు & హెచ్చరికలు

మీరు సురక్షితమైన వ్యాయామం చేయాలనుకుంటే ఈత కొట్టి మీ ఉదర భాగాన్ని గట్టి పరచుకొంది - ఇది వ్యాయామాలన్నిటిలోకీ తక్కువ ప్రమాదకరమైనది. అన్ని రకాల శరీరాలు కల వారికి కూడా ఈత మంచిదే - సాధారణంగా సరైన పర్యవేక్షణలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులకు కూడా సురక్షితంగా భావించబడుతుంది

మీ స్థానిక జిమ్ లో గాని ఈత క్లబ్ లో గానీ ఈత శిక్షణా తరగతుల గురించి అడగండి. కొత్తగా నేర్చుకునే వారికి, కొంచెం వచ్చిన వారికి కూడా వివిధ ఈత స్ట్రోక్ లకు సరైన మెళకువలు, ఈతకు సంబంధించిన వ్యాయామాలు నేర్చుకోవడానికి ఇవి పనికి వస్తాయి.

ఎప్పుడూ మరో వ్యక్తీతో కలిసి కానీ లేదా అధీకృత ప్రాణ రక్షకుడు వున్న కొలనుల్లో గానీ ఈత కొట్టడానికి ప్రయత్నించండి.

English summary

How to Tone Your Stomach With Swimming | పొట్ట తగ్గించే స్విమ్మింగ్...

Swimming is one of the most effective exercises for toning and strengthening the stomach muscles. Not only is it one of the best cardiovascular workouts, but it will help strengthen muscles throughout your body and may improve your posture and endurance level over time.
Story first published: Wednesday, January 2, 2013, 18:56 [IST]
Desktop Bottom Promotion