For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టర్నిప్ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

By Lakshmi Perumalla
|

టర్నిప్ అనేది క్రూసిఫెరా కుటుంబానికి చెందినది. ఇది అనేక అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. దీనిలో అనేక రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండెపోటు,ఇతర హృదయ సంబంధమైన వ్యాధులు మరియు ఎన్నో ఇతర క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు మొదలైన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ నిరోధక వ్యవస్థ, కంటి చూపు, ఎముక ఆరోగ్యం మరియు చర్మంనకు చాలా మంచిది.

ఇది మీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. బోలు ఎముకల వ్యాధి,కీళ్ల నొప్పులు,కంటిశుక్లాలు మరియు రక్తపోటు వంటి వాటిని నియంత్రిస్తుంది. మీ ఆహారంలో క్రూసిఫెరా కుటుంబానికి చెందిన కూరగాయలను తీసుకొంటే అద్భుతమైన ఆరోగ్య లాభాలను పొందవచ్చు. ఈ కూరగాయల రసాన్ని ఉపయోగించి సూప్,రైతా మరియు సలాడ్ తయారుచేయవచ్చు. ఇది రుచిలో కొద్దిగా చేదుగా ఉంటుంది. అందువల్ల రైత తయారుచేసుకోవటం మెరుగైన ఎంపిక అని చెప్పవచ్చు.

మీరు ఒక ఫిట్నెస్ ఫ్రీక్ లేదా వేగంగా బరువు కోల్పోవ టానికి ప్రయత్నిస్తూ ఉంటే మీకు టర్నిప్ బాగా సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయ వలన మీకు పూర్తి అనుభూతి మరియు మీ జీవక్రియ నియంత్రణకు సహాయపడుతుంది. రెగ్యులర్ గా టర్నిప్ తీసుకోవటం వలన మీ కంటి చూపు బాగుంటుంది. మీ శరీరంనకు అవసరమైన అనేక విటమిన్లు,ఖనిజాలను అందిస్తుంది.

టర్నిప్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము.

గుండెకు మంచిది

గుండెకు మంచిది

టర్నిప్ మీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన గుండెజబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మీ హృదయనాళ వ్యవస్థను పెంచడానికి సహాయం చేస్తుంది. అంతేకాక ఫోలేట్ మరియు విటమిన్ B ఒక మంచి మూలం కలిగి ఉంది.

క్యాన్సర్ ను నిరోధిస్తుంది

క్యాన్సర్ ను నిరోధిస్తుంది

టర్నిప్ లో యాంటియాక్సిడెంట్స్ మరియు ఫ్యతోనుత్రిఎంత్స్ సమృద్దిగా ఉండుట వలన క్యాన్సర్ ప్రమాదాన్ని నిరోదిస్తుంది. టర్నిప్ లో ఉండే గ్లూకోసినోలేట్ కణితుల పెరుగుదలకు నిరోధిస్తుంది. మీ ఆహారంలో టర్నిప్ ను చేర్చుకొంటే రొమ్ము క్యాన్సర్,పెద్దప్రేగు మరియు మల కణితులను నిరోధించటానికి సహాయపడుతుంది.

ఎముకలకు బలాన్ని ఇస్తుంది

ఎముకలకు బలాన్ని ఇస్తుంది

మీ ఆహారంలో టర్నిప్ ను చేర్చుకొంటే బోలు ఎముకల వ్యాధి మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. ఈ క్రూసిఫెరా కుటుంబానికి చెందిన కూరగాయలలో కాల్షియం, పొటాషియం మరియు ఎముకలు పెరగడానికి చాలా అవసరమైన అత్యవసర ఖనిజ లవణాలు సమృద్దిగా ఉంటాయి.

మంచి కంటి చూపు

మంచి కంటి చూపు

మీరు అనేక విధాలుగా మీ రోజువారీ ఆహారంలో టర్నిప్ ను తీసుకోవాలి. దీనిలోని అధిక లాభాలను పొందటానికి సూప్ లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. దీనిలో లుటీన్ సమృద్దిగా ఉండుట వలన కంటి చూపుకు మంచిది. దీనిలో కంటి ఆరోగ్యానికి మరియు శుక్లాలు మరియు మచ్చల క్షీణతను నిరోధించే కెరోటినాయిడ్స్ ఉంటాయి.

బరువు తగ్గించేందుకు సహాయం

బరువు తగ్గించేందుకు సహాయం

మీరు బరువు కోల్పోవ టానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు మీకు టర్నిప్ చాలా మంచిది. దీనిలో కెలోరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో అత్యధిక ఫైబర్ కంటెంట్ ఉండుట వలన మీ జీవక్రియను నియంత్రిస్తుంది. కాబట్టి ఏటువంటి ఆందోళనలు లేకుండా టర్నిప్ తీసుకోని స్లిమ్ అవ్వండి.

ఆస్తమాకు అద్భుతమైన నివారణ

ఆస్తమాకు అద్భుతమైన నివారణ

మీరు ఒక ఆస్త్మా రోగి అయితే కనుక,టర్నిప్ మీ రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. దీనిలో శోథ నిరోధక మరియు యాంటిఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన ఆస్తమా నివారణలో సహాయపడుతుంది. టర్నిప్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే ఆస్త్మా చికిత్స కొరకు చాలా ప్రభావవంతముగా పనిచేస్తుంది.

జీర్ణక్రియకు సహాయం

జీర్ణక్రియకు సహాయం

ఈ కూరగాయలో ఫైబర్ కంటెంట్ చాలా సమృద్ధిగా ఉంది. మీ ప్రేగు మరియు పెద్దప్రేగు కాపాడుతుంది. అంతేకాక ఒక ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మీ జీర్ణ వ్యవస్థ మంచిగా లేకపోతే మీరు ఒక ఔషధంగా ఈ క్రూసిఫెరా కూరగాయలను ప్రయత్నించవచ్చు.

రోగనిరోధక వ్యవస్థ శక్తివంతం

రోగనిరోధక వ్యవస్థ శక్తివంతం

టర్నిప్ మీ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సరైన కార్యాచరణలో సహాయపడుతుంది. దీనిలో బీటా కెరోటిన్ ఉండుట వలన ఆరోగ్యకరమైన పొరల ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే పొటాషియం కూడా కండరాలు మరియు నరాల సరైన కార్యాచరణకు సహకరిస్తుంది.

మీ చర్మం కొరకు మంచిది

మీ చర్మం కొరకు మంచిది

ఇది అనేక చర్మ సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. మీరు ప్రతి రోజు టర్నిప్ రసం త్రాగితే పొడి మరియు మచ్చలు వంటి అనేక చర్మ సమస్యల నుండి విమోచనం పొందవచ్చు. దీనిలో మంచి రుచి కోసం క్యారట్ కలపవచ్చు.

బిపి రోగులకు మంచిది

బిపి రోగులకు మంచిది

మీ రక్తపోటును స్థిరీకరణ చేయటానికి టర్నిప్ ఒక గొప్ప కూరగాయ అని చెప్పవచ్చు. దీనిలో మెగ్నీషియం మరియు విటమిన్ B ఉండుట వలన రక్తపోటు స్థిరీకరణలో చాలా సహాయపడుతుంది. అలాగే మెగ్నీషియం కూడా మీ ఎముకలు మరియు గుండెకు మంచిది.

Story first published: Saturday, December 14, 2013, 11:18 [IST]
Desktop Bottom Promotion