For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడి పుట్టించే కూరగాయలను నివారించడానికి చిట్కాలు

By Lakshmi Perumalla
|

కూరగాయలలో విటమిన్లు,ఖనిజాలు మరియు మనకు అవసరమైన పోషకాల యొక్క సహజ మూలం కలిగి ఉంటుంది. కానీ శరీరంలో వేడి మరియు ఉష్ణోగ్రతను పెంచడానికి నాణ్యత మరియు సహజ సామర్ధ్యాన్ని కలిగి ఉన్న కొన్ని కూరగాయలు ఉన్నాయి.

పిండిపదార్ధాలు మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న కొన్ని కూరగాయలు శరీర ఉష్ణోగ్రతను పెంచే లక్షణం కలిగి ఉంటాయి. ఈ కూరగాయలు కొవ్వులు తగ్గించడానికి మరియు బరువు తగ్గాలని అనుకొనే వారికీ ఉపయోగపడతాయి. కానీ వీటిలో కొంత వరకు మాత్రమే మంచి ఉన్నది. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండి మీకు చల్లదనం ఉండటానికి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి రోజుల్లో,మీరు శరీరంను వేడి పెంచే ఈ కూరగాయలను తినటానికి దూరంగా ఉండాలి.

కొంత మందికి అన్ని సీజన్లలోను శరీరంలో వేడి పెరుగుదల అనేది ఒక సమస్యగా ఉంటుంది. హార్మోన్ల అసమతౌల్యం, మోటిమలు, ఇతర చర్మ సమస్యలు,ఇతర జీర్ణ సమస్యలు,పైల్స్ వంటి సమస్యలకు కారణమవుతుంది. ఇప్పుడు పైన ఉన్న ఈ సమస్యలను ఎదుర్కొనే వ్యక్తులు శరీర వేడిని మరియు ఉష్ణోగ్రతను పెంచే కూరగాయలకు దూరంగా ఉండాలి. క్రింద శరీర వేడిని మరియు ఉష్ణోగ్రత పెంచే కాయగూరల జాబితా ఉంది: -

అల్లం

అల్లం

అల్లం కారం మరియు వేడి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఇది శరీరం ఉష్ణోగ్రతను పెంచే సహజ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది స్పైసి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. అందువలన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీనిని నివారించవలసిన ఒక కూరగాయగా చెప్పవచ్చు. కానీ ఒక చిన్న అల్లం ముక్క మొత్తం ఆరోగ్యానికి మంచిది మరియు అనేక సమస్యలకు కారణం కాదు. భారీ పరిమాణంలో వినియోగం మరియు తినడం వల్ల అల్లం మీ శరీర ఆరోగ్యానికి సమస్యగా ఉంటుంది.

హాట్ మిరియాలు

హాట్ మిరియాలు

మిరపకాయలు మరియు కాప్సికం వంటి కొన్ని కూరగాయలు శరీర ఉష్ణోగ్రతను పెంచే శక్తి కలిగిన మిరియాల కుటుంబంనకు చెందినవి. మిరియాల కుటుంబం శరీరంలో వేడిని మరియు ఉష్ణోగ్రతను పెంచి శరీర ప్రసరణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. మిరియాలు వంటి వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని జాతులు మీ నోటి చర్మంను బర్న్ చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

క్యారెట్లు

క్యారెట్లు

నారింజ రంగులో ఉండే "బగ్స్ బన్నీ" ఆహారం లోపల వేడి కంటెంట్ చాలా ఉంటుంది. అంతేకాక శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. శరీర ప్రసరణ వ్యవస్థ యొక్క పనిని పెంచుతుంది. తద్వారా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందువల్ల క్యారట్ తప్పించుకోవలసిన వేడి కూరగాయగా ఉంది.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు ప్రతి ఆహారంలో అలంకరించడానికి మరియు అనేక వంటకాల్లో అవసరమైన కూరగాయగా ఉన్నది. కానీ ఈ కూరగాయ మీ శరీరం వేడి మరియు అలాగే హార్మోన్ల అసమతౌల్యం కలిగించే లక్షణం కలిగి ఉంది. మీరు చంకలో ఒక ఉల్లిపాయలు పెట్టి ఉంచితే మీ శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం ప్రభావాన్ని కలిగిస్తుంది. మీరు వేడి సమస్యల కారణంగా ఉల్లిపాయలను నివారించవలసిన వేడి ఉత్పత్తి కూరగాయగా ఉన్నది.

ఆకుకూరలు

ఆకుకూరలు

పాలకూర,బచ్చలికూర వంటి కూరలు చాలా ఆరోగ్యకరమైనవి మరియు మన శరీరం కోసం చాలా మంచివి. వాటిలో వ్యతిరేక ఆక్సిడెంట్లు చాలా సమృద్దిగా ఉండుట వలన వ్యాధులను నిరోధిస్తాయి. ఈ ఆకుకూరలలో ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.అందువలన వినియోగంలో ఉన్నప్పుడు ప్రోటీన్లు విచ్ఛిన్నం జరిగినప్పుడు వేడి చాలా విడుదల అవుతుంది. అప్పుడు ఈ వేడి వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. మీకు అంతర్గత ఉష్ణ సమస్యలు ఉంటే వేడి ఉత్పత్తి ఆకు కూరలను వాడరాదు.


పైన ఉన్న కూరగాయలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. వాటిని నియంత్రణగా తింటే హాని లేకుండా చాలా లాభాలు ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉండుట వలన పూర్తిగా ఈ కూరగాయలను మానవలసిన అవసరం లేదు.

Story first published: Saturday, December 7, 2013, 14:46 [IST]
Desktop Bottom Promotion